రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ కానుక ప్రకటించారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని 57 ఏళ్లు నిండిన వారికి ఆగస్టు 15 నుంచి కొత్తగా పెన్షన్లు అందజేయనున్నట్లు తెలిపారు. ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ఇప్పటికే 36లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని.. కొత్తగా మరో 10లక్షల మందికి ఇస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒంటరి మహిళలు, బోదకాలు వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ రోగులుకు …
Read More »భారీ వర్షాలు.. అలెర్ట్‌గా ఉండండి: కేసీఆర్ ఆదేశం
మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగమంతా అలెర్ట్‌గా ఉండాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం పెరిగే అవకాశముందని.. నీరుపారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని రివ్యూ చేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలపై జీహెచ్‌ఎంసీ సిబ్బంది …
Read More »మంకీపాక్స్.. ఎలాంటి ఆందోళన వద్దు: హరీష్‌రావు
మంకీపాక్స్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. దేశంలో మంకీపాక్స్ రెండో కేసు నమోదైన నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని.. ఈ విషయంలో ఆందోళన అవసరం లేదన్నారు. ఫీవర్ ఆస్పత్రిని మంకీపాక్స్ నోడల్ కేంద్రంగా చేసినట్లుహరీష్‌రావు చెప్పారు.
Read More »హైదరాబాద్‌లో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీలు
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీ జరిగింది. మొత్తం 69 మందిని ట్రాన్స్‌ఫర్ చేస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. మారేడ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్‌రావు వ్యవహారం చర్చనీయాంశం అయిన నేపథ్యంలో భారీగా బదిలీల ప్రక్రియ చేపట్టినట్లు తెలుస్తోంది. నారాయణగూడ ఇన్‌స్పెక్టర్‌గా రాపోలు శ్రీనివాస్‌రెడ్డి, సైఫాబాద్‌కు కె.సత్తయ్య, శాలిబండకు జి.కిషన్, బేగంబజార్‌కు ఎన్.శంకర్, ఆసిఫ్‌నగర్‌కు శ్రీనివాస్, రాంగోపాల్‌పేటకు జి.లింగేశ్వరరావు, మొగల్పురాకు శివకుమార్‌ను నియమించారు. ఈ మేరకు …
Read More »జులై 15 నుంచి రెవెన్యూ సదస్సులు: కేసీఆర్ ఆదేశం
రాష్ట్రంలోని భూముల సమస్య పరిష్కారానికి జులై 15 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రతి మూడురోజులకు ఒక మండల కేంద్రం చొప్పున 100 టీమ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సదస్సుల్లో జేసీ, డీఆర్వో, ఆర్డీవో, స్థానిక ఎమ్మెల్యే పాల్గొనాలని ఆదేశించారు. మరోవైపు ఈ రెవెన్యూ సదస్సులకు సంబంధించిన అవగాహన సదస్సును ఈనెల 11న నిర్వహించనున్నారు. …
Read More »నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. 1,663 ఉద్యోగాల ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో ఇంజినీరింగ్‌విభాగానికి చెందినవే 1,522 ఉన్నాయి. ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ శాఖల్లోని ఇంజినీరింగ్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇరిగేషన్‌లో 704 ఏఈఈ పోస్టులు, 227 ఏఈ, 212 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, 95 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. తాజా అనుమతులతో కలిపి ఇప్పటి వరకు మొత్తం …
Read More »టీచర్లంతా ఆస్తులు వెల్లడించాల్సిందే: తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు
ఉపాధ్యాయుల విషయంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం టీచర్లు తమ ఆస్తుల వివరాలను ప్రకటించాలని ఆదేశించింది. నల్గొండ జిల్లా గుంటిపల్లి పాఠశాల హెడ్‌మాస్టర్ మహమ్మద్ జావేద్ అలీ విధులకు హాజరుకాకుండా రాజకీయ కార్యకలాపాలు, స్థిరాస్తి వ్యాపారాలు, సెటిల్‌మెంట్లలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారంటూ 2021లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అతడిపై వచ్చిన ఆరోపణల్లో చాలా వరకు నిజమేనని తేల్చింది. విద్యాశాఖ …
Read More »త్వరలో రైతుల అకౌంట్లలో రైతుబంధు సాయం
త్వరలో రైతుబంధు కింద పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈనెల 28 నుంచి అకౌంట్లలో వేయాలని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేష్‌ను కేసీఆర్ ఆదేశించారు. తక్కువ విస్తీర్ణం ఉన్న వారితో ప్రారంభించి క్రమంగా ఎక్కువ విస్తీర్ణం ఉన్నవారికి రైతుబంధు జమ చేస్తారు. రైతుబంధు కోసం వానాకాలం సీజన్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.7,600 కోట్ల సాయం …
Read More »సింగిల్ స్టాప్ డెస్టినేషన్‌గా హైదరాబాద్: కేటీఆర్
హైదరాబాద్ నగరానికి వస్తున్న పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. భాగ్యనగరం సింగిల్ స్టాప్ డెస్టినేషన్‌గా మారిందని.. తయారీ రంగానికి అడ్డాగా మారబోతోందని చెప్పారు. హైటెక్ సిటీలో జాన్సన్ కంట్రోల్‌కు చెందిన ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్ సెంటర్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్ టీహబ్ హైదరాబాద్‌లో ఉందని.. ఇమేజ్ టవర్స్‌ను సైతం నిర్మిస్తున్నామని …
Read More »దాంతో తెలంగాణకు కేంద్రం పెద్ద దెబ్బ కొట్టింది: కేటీఆర్
ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ గతంలో హామీ ఇచ్చారని.. అది ఏమైందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిలదీశారు. ఈ మేరకు ప్రధానికి ఆయన లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 16లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 1.32లక్షల జాబ్స్ భర్తీ చేసిందని.. త్వరలో మరో లక్ష చేస్తుందని చెప్పారు. ప్రైవేట్ …
Read More »