వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించి రైతు ప్రభుత్వాన్ని తీసుకొస్తారని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. ఇటీవల 26 రాష్ట్రాల నుంచి రైతు సంఘాల నేతలు వచ్చి తనను కలిశారని.. జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారని చెప్పారు. పెద్దపల్లిలో జిల్లా కలెకర్ట్ కార్యాలయం, టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లోకి పోదామా? అని ప్రజల్ని ఆయన …
Read More »షాక్.. యూపీఐ పేమెంట్స్‌కు ఇకపై ఛార్జీలు!
మరో బాదుడుకు ప్రజలు సిద్ధమవ్వాల్సిందేనా? ఇప్పటికే జీఎస్టీ, ఇతర పన్నులతో సతమతమవుతున్న సగటు వినియోగదారుడిపై ఆర్బీఐ రూపంలో మరో భారం వేయనుందా? దీనికి అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటి వరకు క్రెడిట్ కార్డులపైనే అదనపు భారం ఉండగా.. ఇకపై యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) పేమెంట్స్‌కు కూడా ఛార్జీల రూపంలో కొంత వసూలు చేయాలని ఆర్బీఐ భావిస్తోంది. నోట్ల రద్దు తర్వాత ఆన్‌లైన్, యూపీఐ పేమెంట్స్ విపరీతంగా పెరిగాయి. పాకెట్లో …
Read More »భారీగా తగ్గనున్న వంటనూనెలు!
గతకొంతకాలంగా బెంబేలెత్తిస్తున్న వంటనూనెల ధరలు మరింత తగ్గనున్నాయి. అంతర్జాతీయంగా ధర తగ్గిన నేపథ్యంలో దేశంలోనూ తగ్గించేందుకు ఆయా కంపెనీలు అంగీకారం తెలిపాయి. త్వరలోనే లీటరుపై రూ.10 నుంచి రూ.12 వరకు ధర తగ్గే అవకాశముంది. కేంద్ర ఫుడ్, ప్రాసెసింగ్ వ్యవహారాల శాఖ అధికారులతో వంట నూనెల తయారీ సంస్థల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Read More »తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం క్లారిటీ!
ఏపీ, తెలంగాణల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. నియోజకవర్గాల పెంపుకు రాజ్యాంగ సవరణ అవసరమని పేర్కొంది. ఈ మేరకు కేంద్రమంత్రి నిత్యానందరాయ్ లోక్‌సభలో లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. రాజ్యాంగ సవరణ ద్వారా చేయాల్సి ఉన్నందున సీట్ల సంఖ్య పెంచాలంటే 2026 వరకు ఆగాల్సిందేనని.. అప్పటి వరకు రెండు రాష్ట్రాల్లో సీట్ల పెంపు సాధ్యం కాదని తెలిపింది. ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగి ప్రశ్నకు కేంద్రమంత్రి ఈ …
Read More »దుర్మార్గపు ఆలోచనలతోనే ‘అగ్నిపథ్’: నారాయణ
నిరుద్యోగ యువత జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని.. దాని ఫలితమే దేశంలో హింసాకాండ అని సీపీఐ జాతీయ నేత నారాయణ ఆరోపించారు. అగ్నిపథ్‌పై జరుగుతున్న ఆందోళనలు కేంద్ర ప్రభుత్వం సృష్టించినవేనని ఆయన విమర్శించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఆందోళనల నేపథ్యంలో నారాయణ స్పందించారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ను అర్ధంతరంగా ఎందుకు మార్చాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగులను మాయ చేసేందుకు దుర్మార్గపు ఆలోచనలతోనే అగ్నిపథ్‌ను తీసుకొచ్చారని నారాయణ విమర్శించారు.
Read More »మిగతా వాళ్లకీ బూస్టర్ డోసు ఇవ్వండి: కేంద్రాన్ని కోరిన మంత్రి హరీష్
18 ఏళ్లు నిండిన వారందరికీ గవర్నమెంట్ హాస్పిటళ్లలో బూస్టర్ డోస్ ఇవ్వాలని కేంద్రాన్ని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో హరీష్ మాట్లాడారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ బీఏ.4, బీఏ.5 కేసులు పెరుగుతున్నందన అర్హులైన వారందరికీ బూస్టర్ డోస్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని …
Read More »బాబోయ్.. కేరళలో ‘నోరో వైరస్’ కలకలం..
కేరళలో నోరో వైరస్ కలకలం రేపుతోంది. ఇద్దరు చిన్నారుల్లో దీన్ని కనుగొన్నట్లు కేరళ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కలుషితమైన నీరు, ఆహారం తినడం వల్ల ఇది సోకుతున్నట్లు గుర్తించారు. దీన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతానికి చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. ఆందోళన అవసరం లేదని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలని ఆమె సూచించారు. …
Read More »కేంద్రంలో హిట్లర్ కంటే దారుణంగా బీజేపీ పాలన: మమత
కేంద్రంలోని బీజేపీ పాలన హిట్లర్, ముస్సోలిని కంటే దారుణంగా ఉందని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో రాష్ట్రంలోని పాలనా వ్యవహారాల్లో బీజేపీ ప్రభుత్వం తలదూరుస్తోందని ఆరోపించారు. దేశంలోని సమాఖ్య వ్యవస్థలను కూల్చివేస్తోందన్నారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా దర్యాప్తు సంస్థలు పనిచేసేలా స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఆమె కోరారు.
Read More »భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. గ్యాస్‌పైనా భారీ రాయితీ
దేశ ప్రజలకు ఇది పెద్ద రిలీఫ్. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రజానీకానికి కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించే విషయం చెప్పింది. పెట్రోల్, డీజిల్‌తో పాటు గ్యాస్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో లీటర్ పెట్రోల్‌పై సుమారు రూ.10, డీజిల్‌పై సుమారు రూ.7 తగ్గనుంది. ఉజ్వల్ యోజన కింద గ్యాస్ సిలిండర్ …
Read More »మొదటి 20లో 19 తెలంగాణ గ్రామాలే.. కంగ్రాట్స్ సీఎం గారూ: కేటీఆర్ ట్వీట్
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సంసద్ ఆదర్శ గ్రామీణ యోజనలో దేశవ్యాప్తంగా మొదటి 10 స్థానాలతో పాటు మొదటి 20లోనూ 19 తెలంగాణ గ్రామాలే ఉండటం గర్వకారణమని మంత్రి కేటీఆర్ అన్నారు. పల్లె ప్రగతి లాంటి ప్రత్యేక కార్యక్రమాలు అమచేస్తున్న సీఎం కేసీఆర్‌కు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆయన బృందానికి అభిందనలు తెలిపారు. …
Read More »