వచ్చే విద్యా సంవత్సరం నుంచి ములుగు జాకారంలో గిరిజన యూనివర్శిటీ, వరంగల్ లోని మామునూరులో వెటర్నరీ కాలేజీ ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఈ రెండింటిలో 2018 విద్యా సంవత్సరం జూన్ నుంచి తరగతులు ప్రారంభించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సచివాలయంలో నేడు ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వరంగల్ లోని మామునూరు వెటర్నరీ కాలేజీలో అడ్మిషన్లు …
Read More »సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికులకు టీఆర్ఎస్ సర్కారు తీపికబురు…
తెలంగాణ రాష్ట్రంలో కాగజ్‌నగర్ పట్టణంలో గత మూడున్నరేండ్లుగా మూత పడిన సిర్పూర్ పేపర్ మిల్లు పునరుద్ధరణ ప్రక్రియలో వేగం పుంజుకుంది. ఈ మిల్లును తీసుకునేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తుండటంతో కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గతవారం జేకే పేపర్ మిల్లు ప్రతినిధులు మిల్లును సందర్శించి యంత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కర్ణాటకలోని దండెల్లి పేపర్ మిల్లు (వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్లు) ప్రతినిధులు ఈనెల 17, 18వ తేదీల్లో మిల్లును సందర్శించనున్నారు. …
Read More »తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ ….
తెలంగాణ ప్రభుత్వం మరో తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది.ప్రస్తుతం వెయ్యి రూపాయలుగా ఉన్న ఆసరా పింఛన్‌ను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిని రానున్న బడ్జెట్ నుంచి రూ. 1500 కు పెంచడానికి ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, కల్లు గీత, బీడీ, చేనేత కార్మికులు, తదితరులకు ప్రతి నెలా ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున ప్రభుత్వం ఆసరా పింఛను ఇస్తోంది. దివ్యాంగులకు మాత్రం రూ. …
Read More »పట్టా పాసు పుస్తకాలపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు…
తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లతో సమావేశం అయ్యారు. ప్రగతిభవన్ లో జరుగుతున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తో పాటు పలువురు మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, భూరికార్డుల ప్రక్షాళన, పంచాయితీరాజ్ ఎన్నికలు, పంచాయితీల విధులు, మునిసిపల్ చట్ట సవరణ తదితర అంశాలపై సీఎం దిశా నిర్దేశం చేశారు. మార్చి 11వ తేదీ నుంచి పట్టాదార్ …
Read More »టీడీపీ వారు చేసినప్పుడే ఆరోగ్యం సహకరించలేదా..నన్నపనేని
ఏపీలోని విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో దళిత మహిళలపై దాడి చేసింది టీడీపీ నేతలే అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి స్పందించారు. పెందుర్తి ఘటనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అనడం సరికాదని అన్నారు. : మహిళపై దాడి చేసిన ఘటన తెలిసిన వెంటనే అక్కడి అధికారులతో తాను స్వయంగా మాట్లాడానని నన్నపనేని …
Read More »చెన్నంపల్లి కోటలో నిధి దొరికేసిందంట..?
చెన్నంపల్లి కోటలో గుప్తనిధుల వేటకు ప్రభుత్వమే తవ్వకాలు జరిపిస్తున్నసంగతి తెలిసిందే. గత ఐదు రోజులుగా ఆధునిక సాంకేతిక పరికరాల సహాయంతో జోరుగా తవ్వకాలు సాగిస్తున్న మైనింగ్ సిబ్బందికి సోమవారం ఒక విషయమై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లిలోని పురాతన కోటలో భారీగా గుప్తనిధులు ఉన్నట్లు అక్కడి వాళ్లు బలంగా విశ్వసిస్తారు. ఇటీవలి కాంలో అక్కడ గుప్తనిధుల కోసం అక్రమ తవ్వకాలు జరిపేవాళ్లు ఎక్కువైపోవడంతో …
Read More »ఆదివారం తవ్వకాల్లో కొన్ని బయటపడ్డాయి…అవి..ఏంటివి…?
కొన్నేళ్లుగా కర్నూల్ జిల్ల చెన్నంపల్లి కోటలో గుప్త నిధులు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని అధికారులే ఏకంగా రంగంలోకి దిగి పోలీసు బందోబస్తు మధ్య ఈనెల 13 నుంచి కోటపై తవ్వకాల పనులు చేపట్టారు. మొదటి రోజు గ్రామస్తులు అడ్డుకోవడంతో వారితో ఓ కమిటీని ఏర్పాటు చేసి తవ్వకాల పనులు ముమ్మరం చేశారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ …
Read More »కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో వజ్రాలు, వైఢ్యూర్యాలు, బంగారం
గుప్తనిధుల వేటకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లిలోని పురాతన కోటలో పెద్ద మొత్తంలో గుప్తనిధులు ఉన్నట్లు కొంతమంది ఇచ్చిన నివేదిక మేరకు తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా గత మూడు రోజులుగా కోటలో అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు. విజయనగర రాజుల కాలం నాటి నిధి నిక్షేపాలు ఉన్నట్లు పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు సాగిస్తున్నారు. ఈ తవ్వకాల్లో నిధి ఉన్న ప్రదేశాన్ని …
Read More »ఆరు నెలల కిందట చనిపోయిన ది డీఎస్పీని బదిలీ చేసి..రిపోర్టు చేయాలని ఆదేశాలు…ఏపీ ప్రభుత్వం
ఏపీ పోలీస్ శాఖలో నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి తాజా బదిలీలు చాలు. ఓ వైపు ఉన్నవారికి పదోన్నతులు, పదవులు, బదిలీలు లేక ఆపసోపాలు పడుతుంటే ఏపీ పోలీసుశాఖ మాత్రం చనిపోయిన ఓ అధికారికి బదిలీ చేయడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. తక్షణమే పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు వచ్చి జాబ్ రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ కావడంతో.. బతికున్న తమను వదిలేసి చనిపోయిన పోలీసులకు పోస్టింగ్స్ ఇవ్వడమేంటని …
Read More »ప్రపంచబ్యాంకు సర్వే…. జన్‌ధన్ ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులేస్తుందట!
జన్‌ధన్ ఖాతా తెరిస్తే అలవోకగా ఖాతాల్లో నగదు బోనస్ పడిపోతుందని ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 31% మంది జనం ఆశించినట్లు ప్రపంచబ్యాంకు అధ్యయనంలో తేలింది. ఈ విషయంలో రాష్ట్రవాసులు బిహార్ తర్వాతి స్థానంలో నిలిచారు. దేశవ్యాప్తంగా 13% మంది ఇలాంటి ఆశలు పెట్టుకోగా ఆంధ్రప్రదేశ్(31%), బిహార్(46%) వాసుల అంచనాలు మాత్రం ఆకాశాన్ని అంటినట్లు ప్రపంచబ్యాంకు నివేదిక వెల్లడించింది. మోదీ ప్రభుత్వం జన్‌ధన్ పథకం మొదలుపెట్టిన ఏడాదిన్నర తర్వాత 2016 జనవరి-మార్చి మధ్యలో …
Read More »