సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌కుమార్ క్యాంప్ ఆఫీస్ వద్ద గుడాటిపల్లి నిర్వాసితులు ధర్నాకు దిగారు. గౌరవెల్లి ప్రాజెక్టు కోసం భూములిచ్చిన తమకు ప్యాకేజీ ఇవ్వకుండా అధికారులు ట్రయల్‌రన్ నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో భూ నిర్వాసితులు వారిపై దాడి చేశారు. పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.
Read More »మిషన్ భగీరథ, గౌరవెల్లి రిజర్వాయరు పనుల పురోగతి పై మంత్రి హరీశ్ సమీక్ష
హుస్నాబాద్ మిషన్ భగీరథ, గౌరవెల్లి రిజర్వాయరు పనుల పురోగతి పై ఇవాళ హుస్నాబాద్ పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు . ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్, ప్రభుత్వ ఛీఫ్ విప్-ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, పర్యాటక శాఖ ఛైర్మన్ …
Read More »