సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌కుమార్ క్యాంప్ ఆఫీస్ వద్ద గుడాటిపల్లి నిర్వాసితులు ధర్నాకు దిగారు. గౌరవెల్లి ప్రాజెక్టు కోసం భూములిచ్చిన తమకు ప్యాకేజీ ఇవ్వకుండా అధికారులు ట్రయల్‌రన్ నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో భూ నిర్వాసితులు వారిపై దాడి చేశారు. పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.
Read More »