బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రూ.50 వేల లోపు రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశమై రైతుల రుణమాఫీపై చర్చించింది. ఈ నెల 15వ తేదీ నుంచే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించి, నెలాఖరు కల్లా పూర్తిచేయాలని వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. తాజా నిర్ణయంతో దాదాపు ఆరు లక్షల మంది రైతులు రుణ విముక్తులవుతారు. …
Read More »ధరణితో రైతుల సమస్యలు పరిష్కారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ఆధారంగా పెండింగ్ మ్యుటేషన్లు వేగంగా పరిష్కారం అవుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో 99.65 శాతం పరిష్కారమయ్యాయి. అదనంగా రూపాయి చెల్లించాల్సిన, ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేకుండానే ప్రక్రియ పూర్తవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గతంలో రిజిస్ట్రేషన్ జరిగి మ్యుటేషన్ చేసుకోని భూములకు డబుల్ రిజిస్ట్రేషన్లతో భూ వివాదాలు తలెత్తేవి. వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం గతేడాది నవంబర్ చివరి వారంలో ధరణి …
Read More »TSRTC శుభవార్త
కరోనా కేసులు తగ్గడంతో తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తేశారు. ఇన్నిరోజులు లాక్ డౌన్ కారణంగా కేవలం రాష్ట్రానికే పరిమితమైన ఆర్టీసీ సర్వీసులు తాజాగా లాక్ డౌన్ ఎత్తి వేయండంతో అంతరాష్ట్ర సర్వీసులను నేటి నుండి ప్రారంభించింది. ఈ రోజు ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రలకు బస్సు సర్వీసులను ప్రారంభించింది. ఆయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా బస్సులను నడపనుంది. ఆంధ్రప్రదేశ్‌కు రోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 …
Read More »విప్రో కంపెనీ ఉద్యోగులకు బంఫర్ ఆఫర్
ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ అయిన విప్రో కంపెనీ ఉద్యోగులకు ఈ ఏడాది రెండోసారి జీతం పెరగనుంది. జూనియర్ ఉద్యోగులకు జీతాలను పెంచుతున్నామని.. బ్యాండ్ B3 ఉద్యోగుల (అసిస్టెంట్ మేనేజర్ మరియు దిగువస్థాయి)కు పెరిగే జీతాలు సెప్టెంబర్ 1 నుంచి అమలవుతాయని సంస్థ తెలిపింది. 2021 జనవరిలోనే ఒకసారి వీరి జీతాలు పెరగ్గా.. తాజాగా మళ్లీ పెరగనున్నాయి. మొత్తం కంపెనీ ఉద్యోగుల్లో బ్యాండ్ B3 కేటగిరీ వారు 80శాతం వరకు …
Read More »ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ప్రభుత్వ, పదవీ విరమణ పొందిన ఉద్యోగులతో పాటు వారి మీద ఆధారపడ్డ వారు.. ప్రయివేటు ఆస్పత్రుల్లో ఇన్‌పెషేంట్ వార్డుల్లో కొవిడ్ చికిత్స పొందితే వారికి మెడికల్ రీఎంబర్స్‌మెంట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆరోగ్య శాఖ సెక్రటరీ ఎస్ఏఎమ్ రిజ్వీ తెలిపారు. రూ. లక్ష వరకు రీఎంబర్స్‌మెంట్ ఇవ్వనున్నారు. ప్రయివేటు ఆస్పత్రిలో ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందిన వారికే రీఎంబర్స్‌మెంట్ వర్తించనుంది.
Read More »వాహనదారులకు భారీ షాక్
బ్రేక్ లేకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు షాక్ ఇస్తున్నాయి. తాజాగా ఆయిల్ కంపెనీలు పెట్రోల్ లీటర్కు 26 పైసలు, డీజిల్ లీటర్కు 34 పైసలు పెంచాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.95.13కు చేరగా డీజిల్ ధర రూ.89.47గా ఉంది. వ్యాట్ ఎక్కువగా ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ధరలు రూ.100 దాటాయి. కొవిడ్ సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.
Read More »రైల్వే ప్రయాణికులకు శుభవార్త
దేశంలో కరోనా లాక్ డౌన్ సడలింపుల తర్వాత ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా.. దక్షిణ మధ్య రైల్వే రైలు సర్వీసులను పునరుద్ధరిస్తోంది. తాజాగా ఏప్రిల్ 1 నుంచి విజయవాడ మీదుగా మరో 12 రైళ్లను ప్రారంభించనుంది. ఇందులో రోజువారి ఎక్స్ ప్రెస్, వారాంతపు సర్వీసులు ఉన్నాయి. వీటిని ప్రత్యేక రైళ్లుగానే ద.మ రైల్వే నడపనుండగా.. ఈ రైళ్ల టికెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకునే అవకాశం ఉంది.
Read More »హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ నగర వాసులకు త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు కనువిందు చేయనున్నాయి. మరో రెండు నెలల్లో సిటీ రోడ్లపై దూసుకుపోనున్నాయి. ప్రయోగాత్మకంగా డబుల్ డెక్కర్ బస్సులను తిప్పాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు బస్సుల కోసం టెండర్లు కూడా ఆహ్వానించింది. ఈనెల 18న ప్రీ బిడ్ నిర్వహించి, బస్సులు ఎలా ఉండాలన్న విషయాన్ని ఆ సమావేశంలో తయారీదారులకు వివరించనుంది.
Read More »మద్యం ప్రియులకు శుభవార్త
దేశంలోని మద్యం ప్రియులకు శుభవార్త.. అదేంటంటే పెట్రోల్, డీజిల్ తరహాలోనే మద్యంపై 100శాతం అగ్రి ఇన్ ఫ్రాస్టక్చర్ అండ్ డెవలప్ మెంట్ సెస్ (AIDC) విధించిన కేంద్ర ప్రభుత్వం దీని ద్వారా ధరల్లో ఎలాంటి పెరుగుదల ఉండదని స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం ఇంపోర్టెడ్ మద్యంపై 150శాతం కస్టమ్స్ డ్యూటీ విధిస్తుండగా.. దాన్ని 50శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మద్యంపై కస్టమ్స్ డ్యూటీ, AIDC కలిపి మొత్తంగా 150శాతానికే పరిమితం అవుతుందని …
Read More »శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. సర్వదర్శనం టోకెన్లను పదివేల నుంచి 20 వేలకు పెంచింది. ఎక్కువ మంది భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండే విష్ణు నివాసంతో పాటు. భూదేవి కాంప్లెక్స్ లోనూ ఈ టోకెన్లను జారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సర్వదర్శనం టోకెన్లను పెంచటంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read More »