హెలికాప్టర్ ప్రమాదంలో చిక్కుకొని తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న బిపిన్ రావత్ తనను నీళ్లు కావాలని అడిగారని శివకుమార్ అనే వ్యక్తి మీడియాకు తెలిపారు. అయితే, ఏటవాలు ప్రాంతంలో ఆయన పడి ఉండడంతో సత్వరం రక్షించేందుకు వీలు కాలేదని చెప్పారు. ఆయన అంత పెద్ద మనిషి అని అప్పుడు తెలియలేదని.. ఆ తర్వాత ఎవరో ఫొటో చూపించినప్పుడు తెలిసిందన్నారు. తలుచుకుంటే బాధనిపిస్తోందని, ఆ రోజు రాత్రంతా నిద్రపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శివకుమార్ …
Read More »బిపిన్ రావత్‌కు రాహుల్‌గాంధీ నివాళులు
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌కు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఘనంగా నివాళులు అర్పించారు. బిపిన్ రావత్, ఆయన సతీమణి మధూలిక రావత్ భౌతిక కాయాలపై పుష్పగుఛ్చాలుంచి అంజలి ఘటించారు. అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కూడా బిపిన్ రావత్ దంపతులకు నివాళులు అర్పించారు.
Read More »రావత్ భౌతికకాయానికి గవర్నర్ తమిళసై నివాళి
తమిళనాడులోని నీలగిరి కొండల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్‌తో పాటు మరో 11 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ నీలగిరి జిల్లాలో ఉన్న మద్రాస్ రెజిమెంట్ సెంటర్‌లో వీరసైనికుల భౌతికకాయాలకు గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ నివాళి అర్పించారు. సైనికవీరుల పార్దీవదేహాల ముందు పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. …
Read More »ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాదంలో ఇతనే బయటపడ్డాడు..?
ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాదంలో ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనే శౌర్యచక్ర అవార్డు గ్రహీత, ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రస్తుతం వెల్లింగ్టన్‌లోని మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఐఏఎఫ్ ట్వీట్ చేసింది. వరుణ్ మంచి ధైర్యశాలి. వాయుసేనలో విశేష సేవలందించారు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌కు ఆయనే కెప్టెన్. గతంలో సాంకేతిక సమస్యలు ఎదురైనపుడు ఆయన వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. గతేడాది …
Read More »బిపిన్ రావత్‌కు రేపు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌కు రేపు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన భౌతికకాయాన్ని ఇవాళ సాయంత్రం ఢిల్లీకి తీసుకురానున్నారు. తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఉన్న కూనూరు వద్ద హెలికాప్టర్ కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో 13 మంది మృతిచెందారు. దాంట్లో బిపిన్ రావత్ సతీమణి మధులిక కూడా ఉన్నారు. అయితే కోయంబత్తూరు నుంచి వాయుసేన ప్రత్యేక విమానంలో బిపిన్ రావత్ పార్దీవదేహాన్ని తరలించనున్నారు. …
Read More »ఆర్మీ హెలికాప్టర్ [ప్రమాదంలో బ్లాక్‌బాక్స్ లభ్యం
తమిళనాడులోని నీలగిరి జిల్లా కూనూర్ వద్ద భారత వాయుసేనకు సంబంధించిన ఎంఐ17వీ5 (Mi-17V5) హెలికాప్టర్ కూలిపోయిన విషయం తెలిసిందే. హెలికాప్టర్‌కు సంబంధించిన బ్లాక్‌బాక్స్‌ను తమిళనాడు ఫోరెన్సిక్ సైన్స్ విభాగానికి చెందిన బృందం గుర్తించినట్లు గురువారం ప్రకటించింది. ప్రమాదం జరిగిన స్థలం నుంచి 30 అడుగుల దూరంలో బ్లాక్‌బాక్స్ లభ్యమైంది. అనంతరం బ్లాక్‌బాక్స్‌ను ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకొని, వెల్లింగ్టన్ బేస్ క్యాంప్‌కు తరలించారు. వింగ్ కమాండర్ ఆర్ భరద్వాజ్ నేతృత్వంలోని …
Read More »