దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్ ధరల్లో ఆయిల్ కంపెనీలు మార్పులు చేశాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 91.50 తగ్గించింది. దీంతో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,233కు చేరింది. అయితే గృహ అవసరాల కోసం వినియోగించే సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా, ప్రతి నెలా ఒకటో తేదీన సిలిండర్ ధరల్లో ఆయిల్ కంపెనీలు మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే.
Read More »వంట గ్యాస్ సిలిండర్ పై సామాన్యులకు షాక్
డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండ్ ధర మరోసారి పెరిగింది. గృహావసరాల కోసం వినియోగించే 14.2 కేజీల సిలిండర్‌పై రూ.50 పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో రూ.1055గా ఉన్న గ్యాస్ బండ ధర రూ.1105కు చేరింది. ఢిల్లీలో రూ.1003గా ఉన్న సిలిండర్ ధర రూ.1053కు చేరింది. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి అదేవిధంగా ఐదు కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.18 పెరిగింది. అయితే …
Read More »గ్యాస్ బండ మరింత భారం
పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి భారం మోపింది. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ బండపై రూ.3.50, వాణిజ్య అవసరాలకు వాడే సిలిండర్‌పై రూ.8 వడ్డిస్తూ నిర్ణయం తీసుకున్నది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.వెయ్యి దాటింది. తాజా పెంపుతో ఢిల్లీ, ముంబైలో గృహావసరాలకు ఉపయోగించే 14 కిలోల సిలిండర్ ధర రూ.1003కు చేరింది. అదేవిధంగా కోల్‌కతాలో రూ.1029, చెన్నైలో రూ.1018.5, హైదరాబాద్‌లో …
Read More »సిలిండర్ల ధరలు మళ్లీ పెరిగాయి
శవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరిగాయి. 19 కేజీల సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 105, కోల్కతాలో రూ. 108 మేర పెరిగింది. అలాగే 5 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.27 ఎగబాకింది. పెరిగిన రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. డొమెస్టిక్ (గృహావసరాల) సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
Read More »మళ్లీ పెరిగిన సిలిండర్ ధర
దేశ వ్యాప్తంగా ఉన్న కమర్షియల్ LPG సిలిండర్ ధర రూ. 103.50 పెరిగింది. పెరిగిన ధర ఇవాల్టి నుంచే (DEC 1) అమల్లోకి వస్తుందని ఆయిల్ కంపెనీలు పేర్కొన్నాయి. ప్రతి నెలా మొదటి తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు సమీక్షిస్తుంటాయి. తాజా సమీక్షలో ఈ పెంపు నిర్ణయం తీసుకున్నాయి. కాగా గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ధరను మాత్రం పెంచలేదు. ఇది ఊరటనిచ్చే విషయం.
Read More »మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. పదిహేను రోజుల వ్యవధిలో సిలిండర్ ధరలు పెరగడం ఇది రెండోసారి. గత నెల 17న గ్యాస్ బండ ధరలు పెంచిన చమురు కంపెనీలు మరోసారి వినియోగదారులపై భారం మోపాయి. గృహావసరాలకోసం వినియోగించే నాన్ సబ్సిడీ సిలిండర్ ధరను రూ.25 పెంచాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.884.50కు పెరిగింది. అదేవిధంగా వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 …
Read More »ఇలా చేస్తే రూ.300 తక్కువకు గ్యాస్ సిలిండర్
గత కొన్ని నెలలుగా గ్యాస్ ధర రూ.200 పెరగడంతో సామాన్యులపై గుదిబండలాగా మారింది అయితే, సబ్సిడీ ద్వారా వంట గ్యాస్ సిలిండర్ రూ.300 తక్కువకు లభిస్తుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. గ్యాస్ సిలిండర్ పై కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద సబ్సిడీని రూ.174 నుంచి రూ.312 రూపాయలకు పెంచింది. స్కీం కింద రిజిస్టరైతే సబ్సిడీ లభిస్తుంది. వార్షిక ఆదాయం రూ.10 లక్షలు అయితే ఈ …
Read More »