అంతర్జాతీయ క్రికెట్ కి టీమిండియా మహిళా క్రికెటర్ వీఆర్ వనిత రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెబుతున్నట్లు వెల్లడించింది. టీమిండియాతో తన జర్నీని ట్వీట్లో వివరించింది.2014లో భారత జట్టులో చోటు దక్కించుకున్న వనిత.. అంతర్జాతీయ కెరీర్లో 6 వన్డేలు, 16 టీ20లు ఆడింది. మొత్తం 300కుపైగా పరుగులు చేసింది.
Read More »కెప్టెన్ గా రోహిత్ శర్మ తనదైన మార్క్
టీమిండియా మాజీ కెప్టెన్.. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ నుండి కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ తనదైన మార్క్ దూసుకెళ్తున్నాడు. తాజాగా వెస్టిండీసు 3-0తో చిత్తు చేసిన భారత్ టీ20 ర్యాంకింగ్స్ టాప్ ప్లేస్ కు చేరుకుంది. రోహిత్ నాయకత్వంలో భారత్ వరుసగా మూడు టీ20 సిరీస్లను వైట్వాష్ చేయడం విశేషం. ఇందులో న్యూజిలాండ్తో ఒకటి.. విండీస్తో రెండు సిరీస్లున్నాయి.
Read More »వెస్టిండీస్ తో జరిగిన మూడో టీ20లో భారత్ విజయం
వెస్టిండీస్ తో జరిగిన మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాలో సూర్య కుమార్ యాదవ్ (65), వెంకటేశ్ అయ్యర్ (35 నాటౌట్) విజృంభించడంతో 184/5 రన్స్ చేసింది. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ను 167/9 పరుగులకే కట్టడి చేసింది. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ 3, చాహర్, వెంకటేశ్ అయ్యర్, శార్దూల్ తలో 2 వికెట్లు తీశారు. దీంతో …
Read More »భారత టెస్టు సారథిగా రోహిత్ శర్మ
అంతా ఊహించినట్లే స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ.. భారత టెస్టు సారథిగా ఎంపికయ్యాడు. సఫారీ పర్యటన అనంతరం విరాట్ కోహ్లీ జట్టు పగ్గాలు వదిలేయగా.. శనివారం ఆల్‌ఇండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ రోహిత్‌ను నాయకుడిగా నియమించింది. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో రోహిత్ శర్మ భారత 35వ సారథిగా సేవలందించనున్నాడు. సభ్యులంతా రోహిత్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ పేర్కొన్నాడు. మార్చి 4 నుంచి …
Read More »SRHకు భారీ షాక్
ఐపీఎల్ -2022 సీజన్ ఆరంభానికి ముందు SRHకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు అసిస్టెంట్ కోచ్.. సైమన్ కటిచ్ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ మెగా వేలంలో ఆటగాళ్ల ఎంపిక, కొనుగోలు విషయంలో యాజమాన్యంతో విభేదాలు తలెత్తడంతో జట్టును వీడినట్లు.. ది ఆస్ట్రేలియన్ పత్రిక కథనం ప్రచురించింది. గత సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన SRH.. కేవలం మూడింటిలో గెలిచింది. ఈ క్రమంలో కటిచ్ రాజీనామా …
Read More »మిథాలీరాజ్ అరుదైన రికార్డులు
కివీస్ తో జరిగిన రెండో వన్డేలో భారత క్రికెటర్ మిథాలీరాజ్ అరుదైన రికార్డులు సాధించింది. తన కంటే 21 ఏళ్ల చిన్నదైన రిచాఘోష్తో కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పింది. మిథాలీ మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన 4ఏళ్లకు రిచా జన్మించింది. అలాగే 20ఏళ్ల కెరీర్ పూర్తయిన మొదటి మహిళా క్రికెటర్, కివీస్పై అత్యధిక హాఫ్ సెంచరీలు, రన్స్ చేసిన భారత కెప్టెన్ రికార్డులు నెలకొల్పింది. ధోనీ, కోహ్లి రికార్డులను బద్దలుకొట్టింది.
Read More »టీమిండియాపై న్యూజిలాండ్ మహిళల జట్టు ఘనవిజయం
క్వీన్స్‌టౌన్ వేదికగా ఇండియాతో జరిగిన రెండవ వన్డేలో న్యూజిలాండ్ మహిళల జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. క్వీన్స్‌టౌన్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియన్ మహిళల జట్టు నిర్ణీత ఓవర్లలో 270 రన్స్ చేసింది. మిథాలీ రాజ్, రిచా ఘోష్‌లో హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. మిథాలీ తన కెరీర్‌లో 61వ హాఫ్ సెంచరీ నమోదు చేసింది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన కివీస్ జట్టు …
Read More »హార్దిక్ పాండ్యాపై వేటు తప్పదా..?
టీ20 వరల్డ్ కప్ టీమిండియా ఘోరంగా విఫలం కావడంతో బీసీసీఐ చర్యలకు సిద్ధమైంది. త్వరలో జరిగే న్యూజిలాండ్ టూర్క టీమ్ ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఫిటెనెస్ లేక ఇబ్బంది పడుతున్న హార్దిక్ పాండ్యాను ఈ టూర్కు ఎంపిక చేయకుండా పక్కనబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. వరల్డ్కప్లో అతడి ఫిట్నెస్పై నివేదికలు కోరినట్లు తెలుస్తోంది. హార్దిక్ గాయపడ్డా జట్టులోకి ఎందుకు తీసుకున్నారో జట్టు నుంచి బీసీసీఐ వివరణ కోరనుంది.
Read More »రవిశాస్త్రి BCCI కి ప్రత్యేక ధన్యవాదాలు
టీమిండియా కోచ్ జట్టు విజయాల కోసం చేయాల్సినదంతా చేశానని రవిశాస్త్రి తెలిపాడు. భారత క్రికెట్ జట్టుకు సేవలందించే అవకాశం కల్పించిన బీసీసీఐకి ఆయన ధన్యవాదాలు తెలిపాడు. తనపై నమ్మకంతో కోచ్ బాధ్యతలు అప్పగించిన మాజీ ప్రెసిడెంట్ శ్రీనివాసను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. కాగా 2014లో ఇంగ్లాండ్ టూర్లో టీమిండియా 1-3 తేడాతో ఘోర పరాజయంతో విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో తనను శ్రీనివాసన్ కోచ్ గా నియమించారన్నాడు.
Read More »హైదరాబాద్ కు చేరుకున్న పీవీ సింధు
టోక్యో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ( PV Sindhu ) బుధవారం హైదరాబాద్ చేరుకుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండైన ఆమెకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘన స్వాగతం పలికారు. సింధుతోపాటు ఆమె కోచ్ పార్క్‌కు కూడా శాలువా కప్పి సత్కరించారు. వచ్చే ఒలింపిక్స్‌లో ఆమె గోల్డ్ మెడల్ సాధించాలని ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. ఆమె విజయం ఎంతోమంది యువతలో స్ఫూర్తి …
Read More »