ఐపీఎల్ లో 4 సార్లు కప్ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) నలుగురిని రిటైన్ చేసుకుంది. జడేజా (రూ. 16 కోట్లు), ధోనీ (రూ.12 కోట్లు), మోయిన్ అలీ (రూ. 8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్ (రూ.6 కోట్లు)లను రిటైన్ చేసుకుంటున్నట్లు ప్రకటించింది. మెగా వేలం కోసం చెన్నై దగ్గర ఇంకా రూ.48 కోట్లు ఉన్నాయి.
Read More »KKR ఆ నలుగుర్నే రిటైన్ చేసుకుంది..?
కోల్ కత్తా నైట్ రైడర్స్ (KKR) నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. రస్సెల్ (రూ.12 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ.8 కోట్లు), వెంకటేశ్ అయ్యర్ (రూ. 8 కోట్లు), సునీల్ నరైన్ (రూ.6 కోట్లు)లను రిటైన్ చేసుకుంటున్నట్లు ఆ ఫ్రాంఛైజీ ప్రకటించింది. మెగా వేలానికి ముందు KKR దగ్గర ఇంకా రూ.48 కోట్లు మిగిలి ఉన్నాయి.
Read More »న్యూజిలాండ్ తో రెండో టెస్టుకు 25 శాతం మందికే అనుమతి
న్యూజిలాండ్ జట్టుతో జరగనున్న రెండో టెస్టుకు.. లిమిటెడ్గానే ప్రేక్షకులకు అనుమతి ఇస్తామని ముంబయి క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. ఈ క్రమంలో 33 వేలున్న వాంఖడే స్టేడియం సామర్థ్యంలో 25 శాతం మందికే అనుమతి ఇవ్వనున్నారు. కరోనా నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మ్యాచ్ నిర్వహించనున్నారు. టీమిండియా, న్యూజిలాండ్ మధ్య.. డిసెంబరు 3 నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Read More »ఈ యుగంలో విరాట్ కోహ్లి అత్యుత్తమ బ్యాటర్
ఈ యుగంలో విరాట్ కోహ్లి అత్యుత్తమ బ్యాటర్ అని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ అభిప్రాయపడ్డాడు. అయితే.. కోహ్లికి బౌలింగ్ చేయడం తనకు ఎప్పుడూ కష్టంగా అనిపించలేదని పేర్కొన్నాడు. ఆ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్టీవ్ స్మితికి బౌలింగ్ చేయడం కష్టంగా అనిపించేదని అమీర్ అన్నాడు. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కోహ్లిని అమీర్ అవుట్ చేసిన విషయం తెలిసిందే.
Read More »మిస్టర్ ఐపీఎల్ Suresh Raina
Team India Daring And Dashing Batsment సురేశ్ రైనా.. భారత క్రికెట్ జట్టు తరపున ఎన్నో మరపురాని ఇన్నింగ్స్లు ఆడాడు. చిరుత లాంటి ఫీల్డింగ్తో ఔరా అనిపించాడు. చెన్నై తరపున ఐపీఎల్, ఛాంపియన్స్ లీగ్ కలిపి అత్యధిక రన్స్, హాఫ్ సెంచరీలు, ఫోర్లు, సిక్సర్ల రికార్డు ఈ లెఫ్ట్ హ్యాండర్ పేరు మీదనే ఉన్నాయి. మిస్టర్ ఐపీఎల్ అని బిరుదు తెచ్చుకున్నాడు. ధోనీకి అత్యంత సన్నిహితుడైన రైనా.. అతడు …
Read More »ఆటగాళ్లు యంత్రాలు కాదు
టీమిండియా FullTime కెప్టెన్ రోహిత్ శర్మ ఈరోజు తొలిసారి మైదానంలోకి దిగనున్నాడు. ఈరోజు రాత్రి 7గంటలకు న్యూజిలాండ్, భారత్ మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా.. ఈ సిరీస్ నుంచి కొంతమంది సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడంపై రోహిత్ మాట్లాడాడు. ‘వర్క్లోడ్ మేనేజ్ చేయడం ముఖ్యం. మన ఆటగాళ్లు యంత్రాలు కాదు. రోజూ స్టేడియాలకు తిరగలేరు. వారికి కొంత సమయం కావాలి. ఫ్రెష్నస్ అవసరం’ అని రోహిత్ అన్నాడు.
Read More »Team India వన్డే కెప్టెన్ గా రోహిత్ శర్మ..?
టీమిండియా వన్డే కెప్టెన్ కోహ్లి భవిష్యత్తుపై చర్చలు జరపాలని బీసీసీఐ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ భారం తగ్గించి అతడు బ్యాటింగ్ పై దృష్టిపెట్టేందుకే బీసీసీఐ ఈ ఆలోచన చేస్తోందట. ఈ మేరకు బోర్డు అధికారి ఒకరు చెప్పారు. వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా సిరీస్ కు ముందే కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి వైదొలగాలని బీసీసీఐ కోరనుందట. కోహ్లి ఇప్పటికే 3 టీ 20 కెప్టెన్ తప్పుకున్నాడు.
Read More »T20 World Cup Final కి ముందు కివీస్ కు పెద్ద షాక్
T20 ప్రపంచ కప్ ఫైనల్ కు ముందు న్యూజిలాండు పెద్ద షాక్ తగిలింది. కివీస్ వికెట్ కీపర్ Batsmen డెవాన్ కాన్వే జట్టుకు దూరమయ్యాడు. ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో స్టంప్ ఔటైన తర్వాత కాన్వే చేతితో బ్యాట్ ను గట్టిగా గుద్దాడు. దీంతో అతని అరచేతి ఎముక విరిగింది. ఫలితంగా అతను ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్తో పాటు ఇండియా టూరూ దూరమయ్యాడు. ఇప్పటికే ఆ జట్టు పేసర్ …
Read More »న్యూజిలాండ్ ఘన విజయం
T20 వరల్డ్ కప్ లో భాగంగా సెమీస్‌కు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన పోరులో న్యూజిలాండ్ సమిష్టిగా సత్తాచాటింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసి నాకౌట్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ ఫలితంతో అఫ్గాన్‌తో పాటు టీమ్‌ఇండియా సెమీస్ దారులు మూసుకుపోయాయి. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 124 పరుగులు చేసింది. నజీబుల్లా జద్రాన్ (48 బంతుల్లో …
Read More »నేడు స్కాట్లాండ్‌తో టీమిండియా మ్యాచ్
టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా నేడు స్కాట్లాండ్‌తో తలపడనుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 07:30 గంటలకు ప్రారంభం కానుంది. పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాలతో డీలాపడ్డ టీమిండియా.. అఫ్ఘానిస్థాన్‌పై నెగ్గి టోర్నీలో తొలి విజయం నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో భారత్ సెమీస్ అవకాశాలు సాంకేతికంగా ఇంకా సజీవంగానే ఉన్నాయి. స్కాట్లాండ్, నమీబియా మ్యాచ్‌ల్లో భారీ విజయాలపై భారత్ కన్నేసింది. నెట్ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకోవాలని …
Read More »