Home / Tag Archives: game news (page 20)

Tag Archives: game news

‘అలాంటివారివల్లే ప్రపంచం ఇంత అందంగా ఉంటోంది

ఒకప్పటి Team India  బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తన సహృదయతను మరోసారి చాటుకున్నాడు. రోడ్డు ప్రమాదానికి గురైన తన స్నేహితురాలిని కాపాడిన ట్రాఫిక్‌ పోలీసును వ్యక్తిగతంగా కలిసి థ్యాంక్స్‌ చెప్పాడు. ఇటీవల సచిన్‌ ఫ్రెండ్‌ ఒకరు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ పోలీసు వెంటనే స్పందించి ఆమెను ఆటోలో జాగ్రత్తగా ఆసుపత్రికి చేర్చాడు. దాంతో ఆ మహిళకు ప్రాణాపాయం తప్పింది. …

Read More »

వన్డే కెప్టెన్సీ తొలగింపుపై సునీల్ గవాస్కర్ Hot Comments

టీమిండియా క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్సీ తొలగింపుపై విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించాడు. వన్డే కెప్టెన్సీ తొలగింపు విషయంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కోహ్లి చెప్తున్న దానికి ఎక్కడా పొంతన లేదు. ఈ వివాదానికి తెరపడాలంటే వారిద్దరూ మీడియా ముందుకు వచ్చి.. వివరించాలి. అలాగే, సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ కూడా కోహ్లిని ఎందుకు తప్పించాల్సి వచ్చిందో చెప్పాలి’ అని అన్నాడు.

Read More »

వన్డే కెప్టెన్సీ మార్పుపై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా వన్డే కెప్టెన్సీ మార్పుపై విరాట్ కోహ్లికి బీసీసీఐ చెప్పాల్సిన అవసరం లేదని మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నాడు. ‘కోహ్లిలా సెలెక్టర్లు క్రికెట్ ఆడకపోవచ్చు. కానీ కెప్టెన్ను నిర్ణయించే హక్కు వారికుంటుంది. తమ నిర్ణయం గురించి ఎవరికీ చెప్పాల్సిన పని లేదు. ఇది కోహ్లికే కాదు ప్రతి ఆటగాడికి వర్తిస్తుంది. ఈ వివాదం కోహ్లి టెస్ట్ కెప్టెన్సీపై ప్రభావం చూపదని ఆశిస్తున్నా’ అని కపిల్దేవ్ వ్యాఖ్యానించాడు.

Read More »

వెస్టిండీస్ జట్టులో కరోనా కలకలం

పాకిస్తాన్ పర్యటనలో ఉన్న వెస్టిండీస్ జట్టులో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే ముగ్గురు ప్లేయర్లకు కరోనా సోకగా తాజాగా మరో ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. ప్లేయర్లు హోప్, హుసేన్, గ్రీప్తో పాటు అసిస్టెంట్ కోచ్, టీమ్ ఫిజీషియన్కు వైరస్ సోకిందని ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అంతకుముందు కాట్రెల్, మేయర్స్, ఛేజ్కు పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ టీంలో కరోనా సోకిన వారి సంఖ్య 8కి చేరింది.

Read More »

లియాండ‌ర్ పేస్‌తో కిమ్ శ‌ర్మ

టెన్నిస్ లెజెండ్ లియాండ‌ర్ పేస్‌తో .. కిమ్ శ‌ర్మ రిలేష‌న్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. అయితే ఆ ఇద్ద‌రూ ఇటీవ‌ల అమృత్‌స‌ర్‌లోని గోల్డెన్ టెంపుల్‌కు వెళ్లారు. దానికి సంబంధించిన ఫోటోల‌ను కిమ్ శ‌ర్మ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. బాయ్‌ఫ్రెండ్ లియాండ‌ర్‌తో దిగిన ఫోటోల‌కు కిమ్ క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. ఇక్క‌డ క‌లిగే ఫీలింగ్ మ‌రెక్క‌డా ఉండ‌ద‌ని, గోల్డెన్ టెంపుల్‌కు వెళ్ల‌డం దీవెన‌లుగా భావిస్తున్న‌ట్లు కిమ్ త‌న పోస్టులో చెప్పింది. …

Read More »

టెస్టుల్లో 400 వికెట్ల‌ను త‌న ఖాతాలో వేసుకున్ననాథ‌న్ లియ‌న్

ఆస్ట్రేలియా స్పిన్న‌ర్ నాథ‌న్ లియ‌న్ అరుదైన ఘ‌న‌త‌ను అందుకున్నాడు. టెస్టుల్లో 400 వికెట్ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. బ్రిస్బేన్‌లో ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో ఈ అరుదైన మైలురాయిని అత‌ను అందుకున్నాడు. డేవిడ్ మ‌ల‌న్‌ను ఔట్ చేయ‌డంతో 34 ఏళ్ల నాథ‌న్ లియ‌న్ ఖాతాలో 400 వికెట్లు చేరాయి. ఆస్ట్రేలియా త‌ర‌పున లియ‌న్ 101వ‌ టెస్టు ఆడుతున్నాడు. అయితే 400 వికెట్లు దాటిన క్రికెట‌ర్ల‌లో లియ‌న్ 16వ బౌల‌ర్‌ కావ‌డం …

Read More »

యాషెస్ సిరీస్‌లో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘనవిజయం

యాషెస్ సిరీస్‌లో భాగంగా జ‌రిగిన తొలి టెస్టులో 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా నెగ్గింది. ఇంగ్లండ్ త‌న రెండ‌వ ఇన్నింగ్స్‌లో 297 ర‌న్స్‌కు ఆలౌటైంది. కేవ‌లం 20 ప‌రుగుల ల‌క్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 5.1 ఓవ‌ర్ల‌లో ఆ టార్గెట్‌ను చేరుకున్న‌ది. దీంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. సెంచ‌రీ కొట్టిన ట్రావిస్ హెడ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద‌క్కింది. స్కోరు బోర్డు ఇంగ్లండ్ 147 & …

Read More »

147 పరుగులకు కుప్పకూలిన ఇంగ్లండ్

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ‌ధ్య తొలి టెస్టు ఆరంభ‌మైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. అయితే తొలి రోజే ఆ జ‌ట్టు కేవ‌లం 147 ర‌న్స్‌కు ఆలౌటైంది. ఆస్ట్రేలియా కెప్టెన్‌, స్పీడ్ బౌల‌ర్ ప్యాట్ క‌మ్మిన్స్ తొలి ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను త‌క్కువ స్కోర్‌కే క‌ట్ట‌డి చేశాడు. ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్ తొలి బంతికే.. రోరీ బ‌ర్న్స్ క్లీన్ బౌల్డ‌య్యాడు. …

Read More »

ముంబై ఇండియన్స్ 4గుర్నే తీసుకుంది..

ఐపీఎల్ లో 5 సార్లు టైటిల్ సాధించిన ముంబై ఇండియన్స్ నలుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. రోహిత్ శర్మ (రూ.16 కోట్లు), బుమ్రా (రూ.12 కోట్లు), సూర్య కుమార్ యాదవ్ (రూ.8 కోట్లు), పొలార్డ్ (రూ. 6 కోట్లు)ను రిటైన్ చేసుకుంటున్నట్లు ఆ ఫ్రాంఛైజీ ప్రకటించింది. IPL 2022 మెగా వేలం కోసం ముంబై దగ్గర రూ.48 కోట్లు ఉన్నాయి.

Read More »

పంజాబ్ వాళ్లనే తీసుకుంది ఎందుకు..?

పంజాబ్ కింగ్స్ కేవలం ఇద్దరు ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. ఆ ఇద్దరు భారత ప్లేయర్లే కావడం విశేషం. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (రూ.14 కోట్లు), బౌలర్ అర్జీదీప్ సింగ్ (రూ.4 కోట్లు)లను తమతోనే ఉంచుకుంటున్నట్లు ఆ ఫ్రాంఛైజీ ప్రకటించింది. కేఎల్ రాహుల్, ఇతర ప్లేయర్లను రిలీజ్ చేసింది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat