సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ క్వింటన్ డీకాక్ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. భారత్ తో జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు డీకాక్ ప్రకటించాడు. వన్డేలు, టీ20లు ఆడనున్నట్లు ఈ 29 ఏళ్ల వికెట్ కీపర్ తెలిపాడు. కాగా, ఇప్పటివరకు 54 టెస్టులు ఆడిన డీకాక్.. 3,300 రన్స్ చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 22 …
Read More »భారత్ 174 రన్స్ కి ఆలౌట్
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు 2వ ఇన్నింగ్సులో భారత్ 174 రన్స్ కి ఆలౌట్ అయ్యింది. పంత్ (34), KL రాహుల్(23), రహానే (18) తప్ప మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే ఔటయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబడ, మార్కో చెరు 4 వికెట్లు తీయగా.. ఎంగిడికి 2 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి భారత్ 304 రన్స్ ఆధిక్యంలో ఉండగా.. ఈ మ్యాచ్లో గెలవాలంటే సౌతాఫ్రికా 305 …
Read More »ఇర్ఫాన్ పఠాన్ ఇంటికి వారసుడోచ్చాడు
భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మరోసారి తండ్రయ్యాడు. తనకు మరో కుమారుడు జన్మించినట్లు పఠాన్ వెల్లడించాడు. కీలక ఆల్రౌండర్గా టీమ్ ఇండియాకు ఎన్నో విజయాలు అందించిన ఇర్ఫాన్.. 2016లో హైదరాబాద్ మోడల్ సాఫా బైగ్ ను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇప్పటికే కుమారుడు (ఇమ్రాన్ ఖాన్ పఠాన్) ఉన్నాడు. తమ రెండో కుమారుడికి సులేమాన్ ఖాన్ అని పేరు పెట్టినట్లు పఠాన్ వెల్లడించాడు.
Read More »రిషబ్ పంత్ అరుదైన రికార్డు
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అరుదైన రికార్డు సృష్టించాడు. తక్కువ టెస్టు మ్యాచ్లో 100 మందిని ఔట్ చేసిన భారత కీపర్ గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో పంత్.. ధోని, సాహా రికార్డులను బ్రేక్ చేశాడు. ధోనీ, సాహా 36 టెస్టుల్లో ఈ ఘనత సాధించగా పంత్ కేవలం 26 టెస్టుల్లోనే 100 మందిని ఔట్ చేశాడు. ఇక కేవలం 21 టెస్టుల్లోనే 100 మందిని ఔట్ చేసిన …
Read More »యాషెస్ టెస్టు సిరీస్ ఆసీస్ కైవసం
ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్ లో ఆస్ట్రేలియా మరో 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే 3-0 తేడాతో కైవసం చేసుకుంది. తాజాగా మూడో టెస్టులో ఇన్నింగ్స్ 14 పరుగుల తేడాతో ఘనవిజయం సొంతం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్ ENG 185 రన్స్ చేయగా AUS 267 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో ENG 68 రన్స్కో కుప్పకూలింది. తొలి మ్యాచ్ ఆడుతున్న ఆసీస్ బౌలర్ బోలాండ్ 6 వికెట్లు పడగొట్టి …
Read More »యాషెస్ సిరీస్ లో ఇంగ్లండ్ చెత్త రికార్డు
యాషెస్ సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ టీం టెస్టుల్లో చెత్త రికార్డును నమోదు చేసింది. ఒక క్యాలెండర్ ఇయర్లో టెస్టుల్లో ఎక్కువ ఓటములు చవిచూసిన జట్టుగా బంగ్లాదేశ్ సరసన చేరింది. 2003లో బంగ్లాదేశ్ ఆడిన 9 మ్యాచ్ 9 ఓడిపోగా 2021లో ENG 15 మ్యాచ్ 9 ఓడిపోయింది. ఆస్ట్రేలియాలో ఆడిన చివరి 13 టెస్టుల్లో ఇంగ్లండ్ ఒక్కసారి కూడా గెలవలేదు. ఇక 2021లో టెస్టుల్లో ENG ప్లేయర్లు 54 సార్లు …
Read More »భారత ఓపెనర్ రాహుల్ మరో రికార్డు
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ అదరగొడుతున్నాడు. సఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సౌతాఫ్రికాలో టెస్టుల్లో సెంచరీ చేసిన రెండో భారత ఓపెనర్ గా రాహుల్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు 2007లో వసీమ్ జాఫర్ కేప్ టౌన్లో సెంచరీ బాదాడు. అలాగే టెస్టుల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికాలో సెంచరీ చేసిన తొలి భారత ఓపెనర్గా రికార్డు సృష్టించాడు.
Read More »కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు ద్వారా కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక సార్లు టాస్ గెలిచిన కెప్టెన్ గా నిలిచాడు. నిన్నటి మ్యాచ్లో టాస్ గెలిచిన కోహ్లి.. ఇప్పటివరకు మొత్తం 68 టెస్టులకు 30 మ్యాచ్ టాప్ నెగ్గాడు. దీంతో అజారుద్దీన్ పేరిట ఉన్న 29 సార్ల టాస్ రికార్డును కోహ్లి అధిగమించాడు. కాగా కోహ్లి టాస్ నెగ్గిన 3 30 …
Read More »పేసర్ శ్రీశాంత్ మళ్లీ ఎంట్రీ
ఐపీఎల్ లో స్పాట్ ఫిక్సింగ్ చేశాడన్న ఆరోపణలతో 9 ఏళ్లపాటు క్రికెట్ కి దూరమైన టీమిండియా పేసర్ శ్రీశాంత్ మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత కేరళ తరపున రంజీ క్రికెట్ ఆడనున్నట్లు ట్వీట్ చేశాడు. వచ్చే రంజీ సీజన్ కోసం కేరళ క్రికెట్ బోర్డు ప్రకటించిన 24 మంది ప్లేయర్ల లిస్టులో శ్రీశాంత్ పేరు కూడా ఉంది. రంజీల్లో చోటు దక్కడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.
Read More »Cricket బెట్టింగ్ ని చట్టబద్ధం చేయాలి- రవిశాస్త్రి
పన్ను పరంగా చూస్తే బెట్టింగ్.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం తెచ్చిపెడుతుందని, భారతదేశంలో బెట్టింగ్ ని చట్టబద్ధం చేస్తే బాగుంటుందని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఒక మీడియా కార్యక్రమంలో బెట్టింగ్ పై రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ రంగాన్ని ఎంతగా అణచివేయాలని చూసినా కుదరదని అన్నాడు. ప్రస్తుతం ప్రపంచం అనుసరిస్తున్న మార్గమిదే అని రవిశాస్త్రి చెప్పాడు.
Read More »