గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న స్పైస్ జెట్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. మార్గమధ్యంలో విమానంలో పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఫ్లైట్‌లో మొత్తం 86 మంది ప్యాసింజర్స్ ఉన్నారు.
Read More »లవ్‌లో అర్జున్‌రెడ్డి-రష్మిక.. మాల్దీవులు టూర్ వైరల్!
విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇందుకు తగ్గట్టు వీరిద్దరూ ముంబయి ఎయిర్‌పోర్టులో తళుక్కుమన్నారు. రష్మిక ముందుగా ఎయిర్‌పోర్టుకు చేరుకొని ఫొటోలకు పోజిచ్చింది. కొంత సమయం తర్వాత విజయ్ చేరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ఇద్దరూ కలిసి మాల్దీవులు ట్రిప్‌కు వెళ్తున్నారని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. లైగర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఖుషి …
Read More »విమానంలో గుక్కపట్టిన పాపాయి.. గుండెలకు హత్తుకున్న సిబ్బంది
పసిపిల్లల బోసి నవ్వులు చూస్తే ఆ ఆనందమే మాటల్లో చెప్పలేం. అదే ఏడిస్తే ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకు ఏడుస్తున్నారో తెలీదు. అదే ప్రయాణంలో వారు గుక్కపట్టి ఏడిస్తే.. ఏమైందా అని ఓ టెన్షన్ అయితే.. చుట్టు పక్కల వారు ఏమనుకుంటారా అని మరో టెన్షన్. తాజాగా ఇలాంటి ఓ సంఘటన విమానంలో చోటు చేసుకుంది. ఓ పసిబిడ్డ గుక్క పట్టి ఏడ్వడంతో ఆ సిబ్బంది చేసిన పనికి …
Read More »విమానం ఆకాశంలో ఉండగానే పైలట్ల ఫైటింగ్
విమానం ఆకాశంలో ఉండగానే ఇద్దరు పైలట్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కాలర్లు పట్టుకుని మరీ పంచ్‌ల వర్షం కురిపించుకున్నారు. విమానం కాక్‌పిట్‌లోనే ఇలా జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో చోటుచేసుకుంది. ఎయిర్‌ఫ్రాన్స్‌కు చెందిన విమానం జెనీవా నుంచి ఫ్రాన్స్‌లోని పారిస్‌కు బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత కాక్‌పిట్‌లో ఉన్న పైలట్, కోపైలట్ మధ్య గొడవ జరిగింది. దీంతో వాళ్లిద్దరూ పిడిగుద్దులు కురిపించుకున్నారు. …
Read More »విమానంలో ఎవరూ చూడని వింత ఘటన..!
ధర్మం బాబయ్య అనే మాట గుడిమెట్ల దగ్గరో లేక ట్రాఫిక్ కూడళ్ల వద్దనో వింటుంటాం. కానీ, వింతగా విమాన ప్రయాణంలోనూ ఇటువంటి మాట వినపడుతోంది. అవును, మీరు చదివింది నిజమే. ఈ సంఘటన నిజంగానే చోటు చేసుకుంది. ఇటీవల పాకిస్థాన్ నుంచి బయల్దేరిన ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో ఓ బిచ్చగాడు కనిపించడంతో ప్రయాణికులు షాక్ తిన్నారు. ప్లాస్టిక్ కవర్ ముందుపెట్టి డబ్బులు అడగడం మొదలు పెట్టడంతో విమాన సిబ్బంది అప్రమత్తమయ్యారు. …
Read More »