కరోనా ఎఫెక్ట్ పేరుతో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌పై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు కరోనా సాకుతో ఎన్నికలు వాయిదా వేశామని చెబతూనే.. మరోవైపు అధికారులను తప్పిస్తున్నారని మండిపడ్డారు. నిష్పాక్షికంగా ఉండాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విచక్షణ కోల్పోయారని అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే ఆయన సామాజిక వర్గానికి చెందిన రమేష్‌కుమార్‌ను …
Read More »టీడీపీ నేతల వలసలపై మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు…!
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైసీపీలో చేరుతున్న సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కనీసం చంద్రబాబు ప్రతిపక్ష హోదా కూడా నిలుపుకునేటట్లు లేరని, టీడీపీ నుంచి మరో 10 మంది ఎమ్మెల్యేలు వైసీపీలోకి వచ్చినా ఆశ్చర్యం లేదని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నామినేషన్లు వేయనివ్వకుండా అరాచకం చేస్తుందంటూ చంద్రబాబు …
Read More »శ్రీకాళహస్తిలో బరితెగించిన జనసేన కార్యకర్తలు.. వైసీసీ దళిత కార్యకర్తపై హత్యాప్రయత్నం..!
ఏమంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ రాష్ట్రాన్ని మరో బీహార్‌లా మార్చేస్తున్నారని విమర్శించాడో కాని..మరుసటి రోజే జనసైనికులు బీహారీ గ్యాంగ్‌లా రెచ్చిపోయారు. వైసీపీ కార్యకర్తపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ..టీడీపీ, జనసేన పార్టీలు పథకం ప్రకారం హింసాకాండ రగిలిస్తున్నాయి. కావాలనే వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టడం..తర్వాత వైసీపీ నేతల దాడులు, అరాచకం అంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు మీడియా మందుకు వచ్చి ప్రభుత్వంపై బురద జల్లడం పనిగా …
Read More »విశాఖలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ..మాజీ ఎమ్మెల్యే రాజీనామా..!
అధికార, పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా విశాఖలో పరిపాలనా రాజధానిని ఏర్పాటు చేస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి గ్రామాల రైతులతో గతమూడు నెలలుగా ఆందోళనలు చేయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మాజీ మంత్రి గంటాతో సహా ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జ్‌లతో సహా కీలక నేతలంతా విశాఖలో రాజధాని ఏర్పాటును స్వాగతిస్తూ ఓ తీర్మానం ఆమోదించి చంద్రబాబుకు పంపారు. …
Read More »మాచర్ల ఘటనపై టీడీపీ రాజకీయం..మంత్రి కన్నబాబు ఫైర్..!
మాచర్ల ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలపై ఏపీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. తాజాగా కాకినాడ వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీడియాతో కన్నబాబు మాట్లాడుతూ చంద్రబాబు మాచర్ల ఘటనపై స్పందించారు. తొలుత సీఎం జగన్‌పై మంత్రి కన్నబాబు ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సంస్కరణలు వైఎస్సార్‌సీపీని ఒక చారిత్రక పార్టీగా తీర్చిదిద్దబోతున్నాయని పేర్కొన్నారు. పట్టుదల కలిగిన నాయకుడు పార్టీని …
Read More »చంద్రబాబు విమర్శలపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్..!
స్థానిక ఎన్నికల వేళ..చంద్రబాబుకు పులివెందుల టీడీపీ నేత సతీష్ రెడ్డి షాక్ ఇచ్చారు. తాజాగా పార్టీకి రాజీనామా చేసిన సతీష్ రెడ్డి కార్యకర్తల సమావేశంలో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. 20 ఏళ్లుగా వైయస్ కుటుంబంతో పోరాడుతున్న పార్టీలో తగిన గౌరవం లేదని, చంద్రబాబుతో గ్యాప్ పెరిగిందని సతీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సతీష్ రెడ్డి రాజీనామాపై వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. టీడీపీకి రాజీనామా చేసిన సతీష్ రెడ్డి …
Read More »స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ రాజకీయం.. వైసీపీ నేత సజ్జల కౌంటర్..!
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఏ ఎన్నికలు అయినా మద్యం ఏరులై పారుతుంది. నోట్ల కట్టలతో ఓటర్లను ప్రలోభపెడుతుంటారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం, ధన ప్రభావం ఇంకాస్త ఎక్కువగానే కనిపిస్తుంటోంది. అయితే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బులు, మద్యాన్ని పంచిన అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటిస్తామని సీఎం జగన్ హెచ్చరించారు. అంతే కాదు …
Read More »చంద్రబాబుకు వరుస షాక్‌లు.. మరో టీడీపీ మాజీ మంత్రి రాజీనామా…!
స్థానిక సంస్థల ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే టీడీపీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ అయిన కడప జిల్లా కీలక నేత రామసుబ్బారెడ్డితో పాటు మరో సీనియర్ నేత పాలకొండ్రాయుడు పార్టీకి గుడ్‌బై చెప్పి త్వరలోనే వైసీపీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ టీడీపీ గుడ్‌బై చెప్పారు. ఇటీవల శాసన మండలిలో జరిగిన …
Read More »టీడీపీ కుట్రలపై మంత్రి కన్నబాబు ఫైర్…!
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని గ్రామాల రైతులతో గత 80 రోజులుగా అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేయడాన్ని చంద్రబాబు సహించలేకపోతున్నాడు. అందుకే ఎల్లోమీడియాతో కలిసి విశాఖ, కర్నూలుపై పదేపదే విషం కక్కుతున్నాడు. దీంతో ఆగ్రహించిన ఉత్తరాంధ్ర ప్రజలు ప్రజా చైతన్యయాత్ర పేరుతో విశాఖలో అడుగుపెట్టాలని చూసిన …
Read More »టీడీపీ డబుల్‌గేమ్‌పై మండిపడిన వైవి సుబ్బారెడ్డి..!
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై టీడీపీ చేస్తున్న కుటిల రాజకీయంపై టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. తాజాగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైవి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు విజయఢంకా మోగించడం తధ్యమని ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 9 నెలల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ …
Read More »