Home / Tag Archives: fire (page 17)

Tag Archives: fire

రాపాక ను పదే పదే అవమానిస్తున్న పవన్..ఇది కరెక్టేనా.?

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆ పార్టీ లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ ను సరిగ్గా గౌరవించడం లేదని కనీసం పట్టించుకోవడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో విశాఖలో ఏర్పాటు చేసిన సభ అనంతరం పలు జిల్లాలకు సంబంధించి ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పవన్ గౌరవించుట ఆయనకు సరైన స్థానం కల్పించలేదు. తాజాగా కూడా ఇసుక సంబంధించి గవర్నర్ బిశ్వభూషణ్ కు వినతిపత్రం …

Read More »

స్పీకర్ తమ్మినేని సీతారామ్‌‌ను అసభ్య వ్యాఖ్యలతో దారుణంగా కించపర్చిన టీడీపీ వెబ్‌సైట్…!

రాజకీయంగా ఎంతటి శత్రువైనా రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉంటే వారిని గౌరవించడం సంప్రదాయం. అయితే టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రం ప్రత్యర్థి పార్టీల నాయకులు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నా సరే వారిపై బురద జల్లేందుకు…వారిపై వ్యక్తిగతం దూషింపజేసేందుకు కూడా వెనుకాడడని తాజాగా ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌పై తెలుగు దేశం ఆన్‌లైన్ దినపత్రిక రాసిన అనుచిత కథనం బట్టి అర్థమవుతోంది. నవంబర్ 11, సోమవారం ఎడిషన్‌లో నాడు పదవుల కోసం గుడ్డలూడదీసుకుంది …

Read More »

అయోధ్య తీర్పుపై పచ్చమీడియా ఛానల్ బరితెగింపు..సర్వత్రా విమర్శలు..!

దేశ ప్రజలు తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూసిన అయోధ్య కేసుపై సుప్రీంకోర్ట్ ఇవాళ తుదితీర్పు వెలువరించింది. సున్నితమైన రాజజన్మభూమి – బాబ్రీమసీదు వివాదంపై తీర్పు ఎలా ఉన్నా అన్ని వర్గాల ప్రజలు సంయమనం పాటించాలని…దేశ ప్రధాని మోదీ దగ్గర నుంచి సీఎంలు, మతపెద్దల వరకూ అందరూ పిలుపునిచ్చారు. జాతీయ మీడియా కూడా సున్నితమైన ఈ అంశంపై చాలా జాగరూకతతో ప్రసారాలు అందించాయి. ఎక్కడా ఏ వర్గాన్ని రెచ్చగొట్టకుండా జాగ్రత్త వహించాయి. …

Read More »

దేవినేని అబద్ధపు ప్రచారాలపై మండిపడిన వైసీపీ ఎమ్మెల్యే..!

 2019 సార్వత్రిక ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో టీడీపీ ఘోర పరాజయం ఎదుర్కొంది..కేవలం రెండంటే రెండే సీట్లను గెల్చుకుంది..అయితే అన్ని నియోజకవర్గాల కంటే..అందరిని తీవ్ర ఉత్కంఠకు గురి చేసిన నియోజకవర్గం..మైలవరం. ఇక్కడ మంత్రిగా అధికారం చెలాయించిన దేవినేని ఉమపై వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ సంచలన విజయం సాధించారు. అయితే ఎన్నికలకు ముందు నాడు మంత్రిగా ఉన్న దేవినేని ఉమ ఆదేశాల మేరకు పోలీసులకు కవర్లలో డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ కృష్ణప్రసాద్‌పై …

Read More »

టీటీడీలొ రమణ దీక్షితులు రీ ఎంట్రీపై చంద్రబాబు అక్కసు..!

తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులును టీటీడీ ఆగమ సలహాదారునిగా జగన్ సర్కార్ నియమించింది. అయితే టీటీడీలో రమణ దీక్షితులు రీ ఎంట్రీ ఇస్తే చంద్రబాబు ఉలిక్కిపడుతున్నాడు. తాజాగా చిత్తూరు పర్యటనలో ఉన్న చంద్రబాబు రమణ దీక్షితులు, సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తిరుమల ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎన్నో ఆరోపణలు వచ్చిన ఆయనను ఆగమ శాస్త్ర సలహాదారుడిగా నియమించటం ఏంటి అని చంద్రబాబు అసహనం వ్యక్తం …

Read More »

మీ మనవడిని తెలుగు మీడియంలో చదివిస్తావా నారా తాత..!

ఏపీలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌మీడియంను ప్రవేశపెడుతూ…సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాలకు చెందిన పిల్లలు ఆంగ్లమాధ్యమంలో చదువుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలనే సమున్నత ఆశయంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌తో సహా, పచ్చమీడియాధిపతులు అమ్మ భాషకు అన్యాయం అంటూ గగ్గోలు పెడుతున్నారు. గత ఐదేళ్లు పాలించిన చంద్రబాబు రాష్ట్రంలో …

Read More »

చంద్రబాబును అడ్డంగా బుక్ చేసిన టీడీపీ మాజీ మంత్రి..!

టీడీపీ సీనియర్ నేత, అయ్యన్నపాత్రుడు గత ఐదేళ్లు నర్సీపట్నం ఎమ్మెల్యేగా, మంత్రిగా అధికారం చెలాయించాడు. అధికారంలో ఉన్నామనే ధీమాతో, తమను ఎవరూ అడ్డుకోలేరనే అహంకారంతో అయ్యనపాత్రుడు, ఆయన తనయుడు స్వయంగా డ్రగ్స్, గంజాయి మాఫియాలను ప్రోత్సహించారని వైసీపీ నేతలు అప్పట్లో తీవ్ర విమర్శలు చేశారు. కాగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడు ఓటమి పాలయ్యారు. అయితే తాజాగా అయ్యన్నపాత్రుడు ప్రస్తుత రాజకీయాలపై స్పందించాడు. రాజకీయాలు చాలా కాస్ట్‌లీగా మారిపోయాయి. ఇప్పుడు …

Read More »

టీడీపీ అధినేతపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైర్..!

ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లోకేష్ మంగళగిరిలో ఇసుక కొరతపై నాలుగు గంటల పాటు నిరాహారదీక్ష చేస్తే..పవన్ కల్యాణ్ వైజీగ్‌‌లో రెండున్నర కి.మీ. లాంగ్ మార్చ్ చేశాడు. లాంగ్ మార్చ్ అంటే నడిచాడని కాదు…తన కారు మీద నిలబడి అభిమానులకు అభివాదం చేస్తూ, కార్ మార్చ్ …

Read More »

చంద్రబాబు మహిళా కమిషన్‌ చూస్తూ ఊరుకోదు..!

మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచే విధంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారంటూ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. మద్యనిషేధంపై హేళనగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. రాష్ట్రంలో బెల్టు షాపులు ఎత్తివేయడం వల్ల నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. అయినప్పటికీ చంద్రబాబు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని… మహిళలు ప్రశాంతంగా ఉంటే ఆయనకు ఇష్టం లేనట్లుగా కనిపిస్తుందని విమర్శించారు. ఆయన హయాంలో ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో …

Read More »

జనసేనానిపై కత్తి మహేష్ షాకింగ్ కామెంట్స్..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి చెప్పరాని పదజాలంతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఏపీ రాజధానిని పులివెందులలో, హైకోర్టును కర్నూలులో పెట్టుకోవాలంటూ పవన్ కల్యాణ్ జగన్‌పై వ్యంగంగా వ్యాఖ్యలు చేశారు. పవన్ వ్యాఖ్యలపై స్పందించిన కత్తి మహేష్ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. ఏరా పవన్ కల్యాణ్ అంటూ సంబోధిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి అగ్గి రగిస్తున్నాయి. రాజధాని, హైకోర్ట్‌లపై రాయలసీమను ఉద్దేశించి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat