తెలంగాణ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో మంటలు చెలరేగాయి. దేశ రాజధాని ఢిల్లీ నుండి తెలంగాణ రాష్ట్ర రాజధానిమహానగరం హైదరాబాద్ వస్తున్న ట్రైన్ నంబరు 12724 తెలంగాణ ఎక్స్ ప్రెస్ బోగీలో మంటలు చెలరేగాయి. దీంతో మహారాష్ట్రలోని నాగ్ పూర్ జంక్షన్ సమీపంలో రైలు నిలిచిపోయింది. దీంతో ఆగ్నిమాపక సిబ్బంది ఆ మంటలను ఆదుపు చేసే పనిలో ఉన్నారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Read More »Fire accident: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో భవనంలో అస్థిపంజరం గుర్తింపు
Fire accident follow up: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో భవనంలోని మొదటి అంతస్తులో ఒక అస్థిపంజరాన్ని అధికారులు గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన రోజు…..భవనంలో చిక్కుకుపోయిన ముగ్గురిలో ఆ అస్థిపంజరం ఎవరిదనేది ఇంకా తెలియలేదు. అంతకుముందు ప్రమాదం జరిగిన దక్కన్ మాల్ సమీపంలోని నల్లగుట్ట ప్రాంతంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. ప్రమాదం జరగడంతో భయాందోళనకు గురైనట్లు స్థానికులు వాపోయారు. ప్రమాదానికి గురైన భవనం కూలిపోతే తీవ్రంగా …
Read More »Fire Accident twist: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో కీలక మలుపు
Fire Accident twist: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో కీలక మలుపు తిరిగింది. డెక్కన్ స్పోర్ట్స్ దుకాణంలో మంటలు చెలరేగడానికి కారణం…విద్యుదాఘాతం కాదని విద్యుత్ శాఖ అధికారి తెలిపారు. విద్యుదాఘాతం వల్లే మంటలు చెలరేగాయన్న వార్తలను విద్యుత్ అధికారులు ఖండించారు. మంటలు వ్యాపించే సమయంలో మీటర్లలో విద్యుత్ సరఫరా ఉందని వెల్లడించారు. ఒక వేళ విద్యుదాఘాతమే జరిగి ఉంటే సబ్‌స్టేషన్‌లో ట్రిప్ అయ్యేదని….మీటర్లు, తీగలు పూర్తిగా కాలిపోయేవని వివరించారు. ఘటనకు …
Read More »Fire Accident: సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం
Fire Accident: సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్ నల్లగుట్ట వద్ద డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదంలో దుకాణంలోని వస్తువులు పూర్తిగా బూడిదయ్యాయి. మూడు అగ్నిమాపక యంత్రాలతో మంటలు అదుపు చేస్తున్నారు. ప్రమాదం జరగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలను ప్రధాన రహదారి వైపు దారి మళ్లించారు. …
Read More »ఘోరం: నడిరోడ్డుపై కాలిబూడిదైన బస్సు.. 21 మంది సజీవదహనం!
పాకిస్థాన్‌లోని కరాచీకి సమీపంలోని ఎం-9 మోటార్ వే వద్ద బుధవారం రాత్రి ఘోర బస్సు ప్రమాదం జరిగింది. నడిరోడ్డుపై బస్సులో తీవ్రంగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా కాలిపోవడంతో 21 మంది సజీవదహనమయ్యారు. మరో 10 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. బస్సులో ప్రయాణికులంతా ఇటీవల పాకిస్థాన్‌లో ముంచెత్తిన వరదల్లో చిక్కుకున్న బాధితులు. పాకిస్థాన్‌లో ఇటీవల వరదలు ముంచెత్తడంతో విపత్తు సమయంలో ఆ వరద బాధితులను మోటార్ వే సమీపంలో ఆశ్రయం …
Read More »సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి..!
సికింద్రాబాద్‌లోని రూబీ హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఏడుగురు మరణించగా పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. తాజాగా మరో వ్యక్తి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 8కి చేరింది. మరణించినవారు, గాయపడిన వారిలో ఏపీ వాసులు ఉన్నారు. గాయపడిన వారిని సిటీలోని అపోలో, యశోద హాస్పిటల్స్‌కి తరలించారు. మృతులు వీరే.. ఈ ఘటనలో విజయవాడ రామవరప్నాడుకు చెందిన అల్లాడి …
Read More »ఫైర్‌తో అట్లుంటది మరి.. బెడిసికొట్టిన స్టంట్!
ఏ పని చేసినా ఆచితూచి చేయమంటారు పెద్దలు. ఏదో చేయాలని ఓవరాక్షన్ చేస్తే మొదటికే నష్టం జరుగక తప్పదు. ఇలాంటి ఘటనే ఒకటి వినాయక మండపంలో జరిగింది. ఓ వ్యక్తి తన విన్యాసాలతో అందర్ని ఆకట్టుకోవాలని చివరికి తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. వినాయకచవితి సందర్భంగా సూరత్‌లోని పర్వతా పాటియా ప్రాంతంలో కొందరు యువకులు గణనాథుణ్ని మండపంలో కొలువుతీర్చేందుకు విగ్రహాన్ని తీసుకొస్తూ ఆనందంగా డ్యాన్సులు చేశారు. …
Read More »మెట్రో స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం..
మెట్రో స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 90 వాహనాలు కాలిపోయాయి. ఢిల్లీలోని జామియా నగర్ మెట్రోస్టేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఎలాంటి ప్రాణనష్టం మాత్రం జరగలేదు. 10 కార్లు, ఒక బైక్, 80 ఈ-రిక్షాలతో పాటు మరికొన్ని వాహనాలు దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే 11 ఫైరింజన్లు ఘటనాస్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పేశాయి. మంటలు ఎందుకు వచ్చాయనే విషయంపై పోలీసులు విచారణ …
Read More »తిరుమల ఘాట్ రోడ్డులో బస్సులో మంటలు
తిరుమల ఘాట్ రోడ్డులో పెద్ద ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి కొండపైకి వెళ్తున్న టీటీడీ ధర్మరథం బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎగువ ఘాట్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. ధర్మరథం బస్సు డ్రైవర్ వెంటనే అలర్ట్ అయి బస్సును లింక్ రోడ్డులో ఆపేయడంతో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. మంటలు చెలరేగినపుడు బస్సులో భక్తులెవరూ లేరు. బస్సు ఇంజిన్‌లో …
Read More »బోయిగూడ అగ్నిప్రమాదం -ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
తెలంగాణ రాష్ట్ర రాజధాని పరిధిలో హైదరాబాద్ జంట నగరాల్లోని సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బోయిగూడలో తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఓ ప్లాస్టిక్ గోదాంలో షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా గోదాంలో మంటలు చెలరేగడంతో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున్న మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే.. ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకున్న 11 మంది కార్మికులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ప్రమాదం నుంచి ఒక కార్మికుడు మాత్రమే ప్రాణాపాయ …
Read More »