తెలుగు సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యమైన కథా చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ సాయిపల్లవి.. ఇప్పుడు తెలుగులో విరాట పర్వం, శ్యామ్ సింగరాయ్ చిత్రాల్లో నటిస్తుంది. భారీ చిత్రాల్లో నటిస్తున్న సాయిపల్లవి ఓ ఎక్స్‌పెరిమెంట్‌కు తెర తీస్తుందట. తమిళంలో చేయబోయే ఓ సినిమాలో సాయిపల్లవి కమెడియన్ సరసన నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. సమాచారం మేరకు తమిళంలో కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న కాళి వెంకట్ జోడీగా సాయిపల్లవిని నటింప …
Read More »సినిమా థియేటర్లకు గుడ్‌న్యూస్
దేశంలోని సినిమా థియేటర్ల ఓనర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 1 నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకోవచ్చని చెప్పింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. సినిమాలు, థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో 100 శాతం సీట్లను నింపుకోవడానికి అనుమతి ఇస్తున్నట్లు అందులో స్పష్టం చేసింది. గతేడాది అక్టోబర్‌లోనే థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చినా.. ఇప్పటి వరకూ కేవలం 50 …
Read More »గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన నటి హర్షిత వెంకటేష్
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నటుడు ప్రీతమ్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి ఈరోజు జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటిన బుల్లితెర నటి హర్షిత వెంకటేష్.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటడం చాలా ముఖ్యమని భవిష్యత్ తరాల కోసం మనందరం బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. మనకు స్థలం లేని పక్షంలో టెర్రస్ గార్డెన్స్, హౌస్ …
Read More »భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్న పూజా హెగ్డే
మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం `ఆచార్య`. మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ `సిద్ధ` పాత్రలో కనిపించబోతున్నాడు. మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే చెర్రీ సరసన నటించే హీరోయిన్ గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. సినిమాలో కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ ఆ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందట. దీంతో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేను ఈ పాత్ర కోసం సంప్రదించినట్టు …
Read More »కరోనా వ్యాక్సిన్ పై ఉపాసన సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కామినేని కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నారు. శుక్రవారం వ్యాక్సిన్ తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వ్యాక్సిన్ తీసుకున్నందుకు గర్వంగా భావిస్తున్నానని, ఫ్రంట్ లైన్ వర్కర్లంతా ముందుకు వచ్చి సురక్షితమైన వ్యాక్సిన్ తీసుకోవాలని ఉపాసన సూచించారు. మహమ్మారిపై ఒక జాతిగా మనమంతా ఐక్యంగా పోరాటం చేయాలన్నారు.
Read More »నక్క తోక తొక్కిన ప్రగ్యా
యువహీరో వరుణ్ తేజ్ నటించిన ‘కంచె’ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ బాలీవుడ్ సినిమా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కే ‘అంతిమ్’లో సల్మాన్ కు జోడీగా ప్రగ్యా నటించనుందని సమాచారం. కాగా ప్రస్తుతం బోయపాటి-బాలకృష్ణ మూవీలో ఈమె నటిస్తోంది
Read More »దుమ్ము లేపుతున్న ‘ఆచార్య’ టీజర్
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్ర టీజర్‌ను శుక్రవారం (జనవరి 29) సాయంత్రం 4గంటల 5 నిమిషాలకు చిత్రయూనిట్ విడుదల చేసింది.
Read More »మద్యం మత్తులో నటుడు సమీర్ అలియాస్ అమర్ వీరంగం
మద్యం మత్తులో బుల్లితెర నటుడు సమీర్ అలియాస్ అమర్ వీరంగం సృష్టించాడు. తాగిన మైకంలో ఇద్దరు మహిళలపై దౌర్జన్యానికి దిగాడు. రాత్రి 9 గంటలకు మహిళల ఇంటికెళ్లి మరీ వేధించాడు. అసభ్య పదజాలంతో మహిళలను సమీర్ దూషించాడు. అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించాలన్నందుకు ఇలా రెచ్చిపోయాడని బాధితులు చెబుతున్నారు. సమీర్‌తో పాటు మరో నలుగురు దాడికి పాల్పడ్డారు. మణికొండలో జరిగిన ఈ ఘటనపై ఆ మహిళలిద్దరూ రాయదుర్గం పోలీసులకు …
Read More »నక్క తోక తొక్కిన హాట్ యాంకర్
బుల్లితెరపై ఒకపక్క యాంకరింగ్ తో మరో పక్క తన అందంతో తెలుగు ప్రేక్షకులను ఆలరిస్తున్న హాట్ బ్యూటీ అనసూయ మరో స్పేషల్ ఐటెం సాంగ్ లో నటించనున్నట్లు తెలుస్తుంది. తాజాగా ప్రత్యేక గీతంలో నర్తించేందుకు ఈ ముద్దుగుమ్మ ఓకే చెప్పిందట. ప్రముఖ నిర్మాత బన్నీవాసు నిర్మిస్తున్న `చావు కబురు చల్లగా` సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్ చేస్తోందట.కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా డైరెక్టర్ కౌశిక్ రూపొందిస్తున్న `చావు కబురు …
Read More »సీపీని కలిసిన ప్రభాస్ .. ఎందుకంటే..?
టాలీవుడ్ స్టార్ హీరో… బాహుబలితో విశ్వఖ్యాతి చెందిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న సలార్ చిత్రం రామగిరి మండలం ఓసీపీ-2లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా రామగుండంకు వచ్చిన ఆయన సీపీని కలిశారు. ప్రభాస్ సీపీ కార్యాలయానికి రావడంతో ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. సలార్ చిత్రంలో భాగంగా బొగ్గు గని ప్రాంతంలో …
Read More »