అఖిల్ అక్కినేనితో నటిస్తున్న ‘ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో స్టాండప్ కమెడియన్గా పూజా హెగ్దే కన్పించనుంది. సన్నివేశాలకు అవసరమైనంత వరకే తన స్టాండప్ స్కిల్స్ చూపించాల్సి ఉంటుందని ఇందుకోసం చాలా హోంవర్క్ చేశానని చెప్పింది. మరే సినిమా కోసం ఈ స్థాయిలో హోంవర్క్ చేసి శ్రమించలేదని పూజా వెల్లడించింది. జీఎ2 బ్యానర్పై బన్నీ వాస్, డైరెక్టర్ వాసు వర్మ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించనున్నారు.
Read More »కియారా అద్వానీ తెగ బిజీ
కరోనా బారిన పడి కోలుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం RRR మూవీతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీలో హీరోయిన్గా కియారా అద్వానీ ఫిక్స్ అయ్యింది. తాజాగా ఈ మూవీకి సైన్ చేసిన ఈ అమ్మడు.. తన డేట్స్ కూడా కేటాయించిందట. ప్రస్తుతం ఆచార్య మూవీతో కొరటాల శివ బిజీగా ఉండగా.. ఈ మూవీ షూటింగ్ పూర్తైన వెంటనే ఎన్టీఆర్తో మూవీని …
Read More »రాశీ ఖన్నా సంచలన నిర్ణయం
కరోనా కష్టకాలంలో హీరోయిన్ రాశీఖన్నా తనకు సాధ్యమైనంత వరకూ అనాథల ఆకలి తీరుస్తోంది. ముంబైలో రోడ్లపై ఆకలితో అలమటిస్తున్న వారికి ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి సాయం చేస్తోందట. అయితే ఎలాంటి ప్రచారం లేకుండానే ఆమె.. సైలెంట్గా అన్నార్థులను ఆదుకుంటోందట.
Read More »అనుపమ తనదైన శైలీలో రంజాన్ శుభాకాంక్షలు
పవిత్ర రంజాన్ సందర్భంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం యువతిలా ఈద్ ముబారక్ తెలుపుతూ ఆకర్షణీయ లుక్లో అలరించారు. అనుపమ తన స్టన్నింగ్ ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దీనిపై ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Read More »జర్నలిస్టు TNR కి అండగా చిరు
ప్రముఖ నటుడు,యాంకర్ జర్నలిస్ట్ TNR మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. TNR భార్యా పిల్లలను ఫోన్లో పరామర్శించారు చిరు.. తక్షణ ఖర్చుల కోసం రూ.లక్ష సాయం చేశారు. ‘TNR ఇంటర్వ్యూలను ఎన్నో చూశా. ఆయన ఇంటర్వ్యూ చేసే విధానం బాగుంటుంది. పట్టుదలతో ఎదిగిన ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఎలాంటి అవసరం వచ్చినా మీ కుటుంబానికి నేనుంటా’ అని చిరు చెప్పారు. అటు హీరో సంపూర్ణేష్ బాబు …
Read More »జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనాకు గురయ్యారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా చెబుతూ.. ఆయన ట్వీట్ చేశారు. ‘‘నేను కొవిడ్ 19 బారిన పడ్డాను. దయచేసి ఎవరూ బాధపడకండి. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాను. నేను మరియు నా ఫ్యామిలీ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉండి.. డాక్టర్స్ సమక్షంలో కరోనా ప్రొటోకాల్స్ పాటిస్తున్నాము. కొద్దిరోజులుగా నన్ను కాంటాక్ట్ అయినవారంతా.. టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరూ క్షేమంగా …
Read More »కంగనా రనౌత్ కి ఇన్‌స్టాగ్రామ్ భారీ షాక్
బాలీవుడ్ అందాల రాక్షసి.. వివాదస్పద నటి కంగనా రనౌత్ అకౌంట్‌ను ట్విట్టర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ షాక్ నుంచి కాంట్రవర్సీ క్వీన్ బయట పడక ముందే, మరో ప్రధాన సోషల్ మీడియా మాధ్యమ ఇన్‌స్టాగ్రామ్ ఆమెకు షాకిచ్చింది. వివరాల్లోకి వెళితే రెండు రోజుల ముందు తాను కరోనా బారిన పడ్డానంటూ కంగన పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కంగన తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తుందంటూ విమర్శలు …
Read More »మామిడి పండ్లను పంపుతున్న పూజా హెగ్డే
సినీ ఇండస్ట్రీలోని తన సన్నిహితులకు హీరోయిన్, అందాల రాక్షసి పూజా హెగ్దే మామిడి పండ్లు పంపుతోంది. కర్ణాటకలోని మంగళూరు వద్ద ఆమెకు మామిడి తోట ఉండగా.. ఈ సారి మంచి దిగుబడి వచ్చింది. దీంతో పరిశ్రమలో తెలిసిన వారికి మామిడి పండ్లు పంపుతుండగా.. తొలిరోజు ఒకరిద్దరు నిర్మాతలు, దర్శకులకు ఈ పండ్ల గిఫ్టులు అందగా, అందుకోవాల్సిన వారు ఇంకా చాలామందే ఉన్నారట.
Read More »కరోనా ఎఫెక్ట్ – మహేష్ బాబు పిలుపు
కరోనా నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హీరో మహేశ్ బాబు సూచించారు. ‘కరోనా తీవ్రమవుతోంది. బయటకు వచ్చేటప్పుడు మాస్క్ ధరించండి. అవసరమైతేనే బయటకు రండి. కరోనా బారినపడితే ఏ లక్షణాలతో బాధపడుతున్నారో చూసుకోండి. వైద్యుల సలహా మేరకు మాత్రమే ఆస్పత్రికి వెళ్లండి. దీంతో అవసరమైన వారికి పడకలు అందుతాయి. ఈ విపత్కర పరిస్థితుల నుంచి మరింత దృఢంగా తయారవుతాం. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండి’ అని మహేశ్ ట్వీట్ చేశారు.
Read More »పెళ్ళిపై ఛార్మీ క్లారిటీ
తాను పెళ్ళికి సిద్ధమయ్యాయని వచ్చిన వార్తలను హీరోయిన్, నిర్మాత ఛార్మి ఖండించింది. “ఇప్పుడు నా జీవితంలో మంచి దశలో ఉన్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో పెళ్లి చేసుకునే తప్పును నేను ఎప్పటికీ చేయను” అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్తో తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని స్పష్టం చేసింది. ఛార్మి ప్రస్తుతం పూరి కనెక్ట్ సహనిర్మాతగా ఉంటూ ప్రొడక్షన్ బాధ్యతలు చూసుకుంటోంది.
Read More »