ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సెలబ్రెటీలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మంచు మనోజ్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో తెలిపాడు. “నాకు కరోనా నిర్ధారణ అయ్యింది. నన్ను గత వారం నుంచి కలిసిన వారందరూ టెస్ట్ చేయించుకోండి. జాగ్రత్తలు తీసుకోండి. నా గురించి ఆందోళన చెందవద్దు. క్షేమంగా ఉన్నాను. మీ ప్రేమ, ఆశీర్వాదాలు నాతోనే ఉన్నాయి” అని ట్విట్టర్లో పేర్కొన్నాడు.
Read More »Junior NTR సరసన సమంత
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ త్వరలో హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది రెగ్యులర్ షూటింగ్కు వెళ్లనుంది. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన సమంతను ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది. కొరటాల ‘జనతా గ్యారేజ్ లో సామ్ హీరోయిన్ గా నటించడంతో మరోసారి ఎన్టీఆర్ …
Read More »అల్లు రామలింగయ్య స్వాతంత్ర్య సమరయోధుడు
తన తాతయ్య స్వాతంత్ర్య సమరయోధుడని టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ అన్నాడు. ‘మా అమ్మ వాళ్ల నాన్న అల్లు రామలింగయ్య స్వాతంత్య్ర సమరయోధుడనే విషయం తక్కువమందికే తెలుసు. ఆ రోజుల్లో ఆయన హక్కులపై పోరాటం చేశారు. అందుకు 15 రోజులకుపైగా ఆయన్ని జైలులో పెట్టారు. ఈ విషయం మా కుటుంబసభ్యుల్లో కొద్ది మందికి మాత్రమే తెలుసు’ అని చరణ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ‘RRR’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చరణ్ …
Read More »నటుడు మాణిక్య వినాయగం (73) కన్నుమూత
ప్రముఖ గాయకుడు, నటుడు మాణిక్య వినాయగం (73) కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. అన్ని భాషల్లో కలిపి 800లకు పైగా పాటలు పాడారు. వేల సంఖ్యలో ఆధ్యాత్మిక, జానపదాలను ఆలపించారు. ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ మూవీలోని ‘పట్టుపట్టు చెయ్యే పట్టు’తో టాలీవుడ్ ప్రేక్షకుల్ని విశేషంగా అలరించారు.
Read More »సినిమా టికెట్ల రేట్ల వివాదంపై హీరో నాని సంచలన వ్యాఖ్యలు
ఏపీలో సినిమా టికెట్ల రేట్ల వివాదంపై హీరో నాని మరోసారి స్పందించాడు. ‘వకీల్సాబ్ సినిమా అప్పుడే అందరూ ఏకతాటిపైకి వచ్చుంటే బాగుండేది. ఈ సమస్యే మొదలయ్యేది కాదు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకమత్యం లేదు. సినిమా టికెట్ల రేట్లపై ఇదివరకు నా అభిప్రాయం మాత్రమే చెప్పాను. దాన్ని చీల్చి పెద్ద ఇష్యూ చేశారు. సమస్య అనేది నిజం. సమస్య వచ్చినప్పుడు అందరూ ఒక్కటి కావాలి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
Read More »‘Rx 100’ కాంబో మళ్లీ వస్తోందా..?
తెలుగులో ఘనవిజయం సాధించిన ‘Rx 100’ కాంబో వస్తోందా..?..ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వచ్చి చక్కర్లు కొడుతోంది. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ గుమ్మకొండ – పాయల్ రాజ్ పుత్ హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘Rx 100’. బోల్డ్ కంటెంట్‌తో రొమాంటిక్ లవ్‌స్టోరిగా వచ్చిన ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ సాధించింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు దర్శకుడు అజయ్ భూపతి..హీరోహీరోయిన్లు కార్తికేయ …
Read More »వేణు శ్రీరాంకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్ ప్రైజ్ గిప్ట్
ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం ‘వకీల్ సాబ్’ చిత్ర దర్శకుడు వేణు శ్రీరాంకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ గిఫ్ట్ పంపి సర్‌ప్రైజ్ ఇచ్చారు. మూడేళ్ళ తర్వాత పవన్ రీ ఎంట్రీ మూవీకి వేణు శ్రీరాం దర్శకత్వం వహించారు. ఇది ఆయనకి దర్శకుడిగా మూడవ సినిమా. గత చిత్రాలు భారీ సక్సెస్ కాకపోయినా మేకింగ్ మీద ఉన్న నమ్మకంతో పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రానికి …
Read More »దర్శకుడు KS సేతుమాధవన్ (90) కన్నుమూత
దక్షిణ భారత ప్రముఖ దర్శకుడు KS సేతుమాధవన్ (90) కన్నుమూశారు. వయో సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చెన్నైలోని నివాసంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1961లో మలయాళంలో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 60కి పైగా చిత్రాలను తెరకెక్కించారు. ఇక తెలుగులో 1995లో వచ్చిన ‘స్త్రీ’ సినిమాను సేతుమాధవన్ డైరెక్ట్ చేశారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు.
Read More »త్వరలో బంగార్రాజు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు,మన్మధుడు అక్కినేని నాగార్జున, నాగచైతన్య లీడ్ రోల్స్ పోషించిన చిత్రం ‘బంగార్రాజు’. నాగ్ సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. చైతన్యకు జోడీగా కృతి శెట్టి సందడి చేయనుంది. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్నారు. కల్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నాడు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాకు కొనసాగింపీ …
Read More »గ్రీన్ఇండియా చాలెంజ్ లో బిగ్ బాస్ 5 విన్నర్ వి.జె సన్నీ…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా జర్నలిస్ట్ కాలనీ లోని జి.హెచ్.ఎం.సి పార్క్ లో మిత్రులతో కలిసి మొక్కలు నాటిన బిగ్ బాస్ 5 విన్నర్ వి.జె సన్నీ…ఈ సందర్భంగా వి.జె సన్నీ మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని , గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి కార్యక్రమం అద్బుతమని …
Read More »