ఆంధ్రప్రదేశ్ సీఎం, అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు .రాష్ట్రంలో అన్నదాతల రక్షణకు ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాకో PS ఏర్పాటు చేసి… వ్యవసాయ అంశాల్లో మోసాలు జరిగితే రైతుల అండగా నిలిచేలా చూడాలన్నారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను, న్యాయపరమైన చిక్కులను సత్వరమే పరిష్కరించడానికి ఈ పోలీసు స్టేషన్లు ఉపయోగపడాలన్నారు సీఎం జగన్. రైతుల కోసం స్పెషల్ డెస్క్ …
Read More »రైతులకు మద్ధతు ఇచ్చేవారు ఉగ్రవాదులే
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపే ప్రతి ఒక్కరూ ఉగ్రవాదులేనని వ్యాఖ్యానించింది. ట్రాక్టర్ల ర్యాలీలో ఉద్రిక్తతలపై స్పందించిన కంగనా రనౌత్. ఈ ఆందోళనలతో మనం ప్రపంచం ముందు నవ్వులపాలవుతున్నాం. దేశమంటే గౌరవం లేకుండా పోయింది. రైతులుగా పిలవబడుతున్న వారికి మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరూ ఉగ్రవాదులతో సమానం. వారిని జైల్లో వేయాలి’ అని అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read More »తెలంగాణ రాష్ట్ర రైతు బంధు పథకం రెండోరోజు 1,125 కోట్లు
తెలంగాణలో రైతుబంధు సాయం పంపిణీ వేగంగా కొనసాగుతున్నది. రెండోరోజు రెండెకరాల వరకు భూమి కలిగిన పట్టాదారులు 14.69 లక్షల మంది ఖాతాల్లో రూ. 1,125.31 కోట్లు జమచేశారు. తొలిరోజు ఎకరంలోపు భూమిఉన్న 16.04 లక్షల మంది రైతులకు రూ.494.11 కోట్లు అందజేసిన విషయం తెలిసిందే. రెండ్రోజుల్లో మొత్తం 30.73 లక్షల మంది పట్టాదారులకు రూ.1,619.42 కోట్లు పంపిణీ చేసింది. బుధవారం మూడెకరాల భూమి గల పట్టాదారుల ఖాతాల్లో రైతుబంధు సాయం …
Read More »సోమవారం నుండి రైతుబంధు
యాసంగి సీజన్ రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున రూ.7,300 కోట్ల నిధులు జమ చేయడానికి సిద్ధమైంది. ఈ యాసంగిలో దాదాపు 59.32 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని అందజేయనున్నారు. గతేడాది 57.62 లక్షల మంది పట్టాదారులకు రైతుబంధు సాయాన్ని పంపిణీ చేయగా.. ఈ సీజన్‌లో 1.70 లక్షల మంది …
Read More »పొలాలు పిలుస్తున్నాయి
చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈసారి తెలంగాణ పంట దిగుబడి రికార్డు స్థాయిలో పెరిగింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) దేశవ్యాప్తంగా కోటి పదిహేనువేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే, అందులో 64.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఒక్క మన రాష్ట్రం నుంచే సేకరించింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సేకరించిన ధాన్యం 31.50 లక్షల మెట్రిక్ టన్నులు కావడం గమనార్హం. క్షుద్ర రాజకీయ పార్టీలు కొన్నింటికి …
Read More »తెలంగాణలో రైతుబంధు మార్గదర్శకాలు ఇవే
తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు సాయం విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. వారం, పది రోజుల్లోనే ఈ నగదును రైతులందరికీ బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఇందుకనుగుణంగా మంగళవారం మధ్యాహ్నం వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎకరానికి రూ.5వేలు చొప్పున రైతుబంధు సాయం అందించనున్నారు. బడ్జెట్ ప్రతిపాదనల సమయంలో జనవరి …
Read More »తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్
రైతుబంధు పథకం యథాతథంగా కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రైతు బంధు పథకంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకూ 100కు వంద శాతం రైతు బంధు పథకం కొనసాగిస్తామని చెప్పారు. వర్షాకాలం పంటకు కూడా రూ. 7 వేల కోట్లు ఇస్తామని తెలిపారు. అసెంబ్లీలో చెప్పిన విధంగా రూ. 25 వేల వరకూ రుణం ఉన్న రైతులందరికీ మాఫీ చేస్తాన్నారు. …
Read More »పంట రుణాలను తీసుకున్న రైతులకు తీపి కబురు
కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి విదితమే.అయితే లాక్ డౌన్ కారణంతో దేశంలోని రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురును అందించింది. ఈ క్రమంలో పంట రుణాలను తీసుకున్న రైతులు మే ముప్పై ఒకటో తారీఖులోగా చెల్లించేలా అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రూ.3లక్షల లోపు పంట రుణాలను తీసుకున్న రైతులకు లబ్ధి చేకూరనున్నది.మార్చి 1నుండి …
Read More »తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ భరోసా
‘వరి..కోటి 5 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. ప్రతి వరి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. మొక్కజొన్నకు ప్రస్తుతం గిట్టుబాటు ధర లేదు.. అయినా కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తాం. రూ.3,200 కోట్లు మార్క్‌ఫెడ్‌కు హామీ ఇచ్చాం. మొక్కజొన్న ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని’ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. 40 లక్షల ఎకరాల్లో వరి పంట, 14 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సిద్ధంగా ఉంది. రైతులు …
Read More »కరోనా ఎఫెక్ట్ -రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్తను ప్రకటించారు.శుక్రవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పంట చేతికోచ్చే సీజన్.అందుకే రైతులెవరూ ఆగంమాగం అవ్వద్దు.. ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుంది.మీ ఇంటికోచ్చే ప్రభుత్వం కొంటుంది.కనీస మద్ధతు ధరతోనే ప్రతి పంటను ప్రభుత్వం కొంటుంది.పంటను కొనే సమయంలోనే ప్రతి రైతు యొక్క పాస్ బుక్,అకౌంటు నెంబర్లకు సంబంధించి పూర్తి వివరాలను తీసుకుంటుంది.డబ్బులను చెక్కుల రూపంలో రైతులకు అందజేస్తాం.. మీరు …
Read More »