రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన పీసీసీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు,మేనేని సత్యనారాయణ రావు (ఎం ఎస్ ఆర్) మృతి పట్ల రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ సంతాపం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా వాసిగా ఈ ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన మానవతావాది, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు ఎమ్మెస్సార్, ఎంపీగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఆర్టీసీ చైర్మన్ గా ముక్కుసూటి మనిషిగా సమస్యల …
Read More »వైసీపీ మాజీ మంత్రి మహమ్మద్ జానీ మృతి
ఏపీ అధికార వైసీపీకి చెందిన మాజీ మంత్రి మహమ్మద్ జానీ ఇవాళ కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. స్వగృహంలోనే చనిపోయారు. ఆయన స్వస్థలం గుంటూరు. ఇక్కడి నుంచే పలుమార్లు పోటీచేసి నెగ్గిన ఆయన.. ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ ఛైర్మన్ గా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి, జనార్థన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రి వర్గాల్లో.. వాణిజ్య, చక్కెర శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు.
Read More »మాజీ మంత్రి అజ్మీరా చందులాల్(66) మృతి
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత,మాజీ మంత్రి అజ్మీరా చందులాల్(66) మృతి చెందారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వరంగల్ జిల్లా ములుగు (మం) జగ్గన్నపేటలో జన్మించిన ఆయన తెలంగాణ రాష్ట్ర టూరిజం& సాంస్కృతికశాఖకు తొలిమంత్రిగా సేవలందించారు. దివంగత మాజీ సీఎం,టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ కేబినెట్లోనూ గిరిజనశాఖ మంత్రిగా పనిచేశారు. ములుగు నుంచి 3సార్లు ఎమ్మెల్యేగా, 2సార్లు ఎంపీగా గెలిచారు. కరోనాకు చికిత్స …
Read More »పి వి గౌరవాన్ని పెంచుదాం- మాజీ మంత్రి జోగు రామన్న
సురభి వాణి దేవి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మన తెలంగాణ భూమి పుత్రుడు మన మాజీ ప్రధాని పీవీ నర్సింహ రావు గారి గౌరవాన్ని పెంచుతామని మాజీ మంత్రి MLC ఎన్నికల ఇంచార్జి జోగు రామన్న అన్నారు మంచాల మండల కేంద్రంలో MLC కో ఆర్డినేటర్ ల సమావేశంలో ముఖ్య అతిధిగా విచ్ఛేసిన జోగురామన్న గారు గ్రామాల వారిగా ఇంచార్జి లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఆ సందర్భంగా …
Read More »మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ వైసీపీ సర్పంచ్ అభ్యర్థి అప్పన్నను బెదిరించిన కేసులో అచ్చెన్నను అదుపులోకి తీసుకున్నరు పోలీసులు. అనంతరం ఆయన్ని కోటబొమ్మాళి PSకు తరలించారు. అటు అప్పన్నను పరామర్శించేందుకు అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కాసేపట్లో నిమ్మాడకు రానున్నారు.
Read More »సీఎం జగన్ కు మాజీ మంత్రి యనమల వార్నింగ్
ఏపీలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు అధికారులను సహకరించకుండా చేస్తూ వైసీపీ అధినేత,రాష్ట్ర సీఎం జగన్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. ఏ ప్రభుత్వం శాశ్వతం కాదని అధికారులు గుర్తించాలని సూచించారు. నోటిఫికేషన్ వచ్చాక విధుల్లో పాల్గొనమని చెప్పటం సరికాదని మండిపడ్డారు. స్థానిక పాలన అందించటంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ అంశంపై పునరాలోచన చేయాలన్నారు
Read More »మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు శ్రీకాకుళం జిల్లా రాజాంలో పోలీసులు అరెస్ట్ చేశారు. రామతీర్థం క్షేత్రాన్ని పరిశీలించేందుకు ఇటీవల వచ్చిన వైసీపీ ఎంపీ విజయసాయి కారుపై దాడి ఘటనలో కళా వెంకట్రావును అరెస్ట్ చేశారు. చెప్పులు విసిరిన ఘటనలో కళా అనుచరులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారించనున్నారు.
Read More »జగన్ కు లోకేష్ వార్నింగ్
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కళా వెంకటరావు అరెస్టును నారా లోకేశ్ ఖండించారు రామతీర్థంలో రాముడి విగ్రహం తల ఎత్తుకెళ్లిన వారిని పట్టుకోలేకపోయిన చేతకాని సర్కారు అత్యంత సౌమ్యుడైన వెంకటరావు గారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అధికారం అండతో ఇంకెంత మంది బీసీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయిస్తావు జగన్?’ అని ట్వీట్ చేశారు
Read More »మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్ట్.
ఏపీలో కృష్ణా జిల్లాలోని గొల్లపూడి సెంటర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ నేత కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా దీక్షకు యత్నించారు. TDP నేత దేవినేని ఉమ. కోవిడ్ నేపథ్యంలో ధర్నాకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు అనంతరం ఆందోళన చేస్తున్న ఉమను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలతో ఆ ప్రాంతమంతా రణరంగంలా మారింది. దీంతో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు.
Read More »మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు బెయిల్ నిరాకరణ
ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రవీణ్ రావు కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి,టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియకు బెయిల్ నిరాకరించింది. సికింద్రాబాద్ కోర్టు. 3 రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతించింది ప్రస్తుతం చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంది అఖిలప్రియ. సీన్ రీ- కక్షతో పాటు, కేసులో ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో కోర్టు బెయిల్ …
Read More »