కురుక్షేత్ర యుద్ధం అని ఈటెల మాట్లాడుతున్నారు.. ఏడు సంవత్సరాలు మంత్రి పదవిలో ఉన్నప్పుడు కురుక్షేత్ర యుద్ధం గుర్తుకు రాలేదా? అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై ఫైర్ అయ్యారు..ఆత్మగౌరవం అంటే పేద వాడు మంచిగ బ్రతకడమే.. మాట్లాడితే బీసీ అంటున్న ఈటెల… నీ వ్యాపార భాగస్వాముల్లో ఎంత మంది బిసిలు ఉన్నారు?బిసి అని చెప్పుకునే హక్కు ఈటెలకు లేదు.ఈటెల రాజేందర్ పదవికి రాజీనామా …
Read More »హుజూరాబాద్ బీజేపీలో వర్గపోరు
తెలంగాణలోని హుజూరాబాద్ బీజేపీలో వర్గపోరు మొదలైంది. బుధవారం హుజూరాబాద్ ఇన్చార్జ్‌గా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి తన అనుచరులతో భేటీ కారున్నారు. కోవిడ్ కారణంగా మూడు నెలలుగా నియోజకవర్గానికి ఆయన దూరంగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీలోకి ఈటల రాజేందర్ రాకతో కాకరేగుతోంది. ఈటల చేరికను పెద్దిరెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. మూడు నెలల తర్వాత ఆయన ఇవాళ హుజూరాబాద్‌కు వస్తున్నారు. కార్యర్తలు, అనుచరులు, సన్నిహితులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం భవిష్యత్ కార్యాచారణపై …
Read More »MLA పదవీకి ఈటల రాజీనామా
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి నేడు రాజీనామా చేశారు. గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళ్ళులర్పించిన అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మేట్‌లో ఉన్న తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి ఈటల అందజేశారు. కాగా.. నేటి సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. 14న జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రత్యేక విమానంలో …
Read More »ఈటల రాజీనామాకు ముహూర్తం ఖరారు
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవి రాజీనామాకు ముహూర్తం ఖరారైంది. రేపు ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు. ఈ నెల 14న ఈటల బీజేపీలో చేరతారని ఇప్పటికే ఆ పార్టీ ముఖ్యనేతలు వెల్లడించిన సంగతి తెలిసిందే. శనివారం నాడు మొదట.. నగరంలోని గన్‌పార్క్ దగ్గర రేపు అమరవీరుల స్థూపానికి ఈటల నివాళులు అర్పించనున్నారు. అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి …
Read More »మాజీ మంత్రి ఈటలకు ఎమ్మెల్యే గువ్వల వార్నింగ్
అసైన్డ్ భూముల్లో దందాలు చేసుకుంటూ.. కోట్లకు పడగలెత్తిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ఎవరూ కాపాడలేరు అని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పేర్కొన్నారు. టీఆర్ఎస్ఎల్పీలో గువ్వల బాలరాజు మీడియాతో మాట్లాడారు. అసైన్డ్ భూములు లాక్కున్నారని ఫిర్యాదులు చేసిన వారిని ఈటల భయభ్రాంతులకు గురి చేశారు. పేదలను పూర్తి స్థాయిలో వాడుకొని, వారిపైనే నిందలు మోపుతున్నారు. ఇవన్నీ గ్రహించిన తర్వాతే సీఎం చర్యలకు పూనుకున్నారు. ఇప్పటి నుంచి ఎక్కడ మాట్లాడినా …
Read More »మాజీ మంత్రి ఈటలకు పల్లా కౌంటర్
ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి చట్ట వ్యతిరేకమైన దేవాదాయ భూములు, అసైన్డ్ భూములను ఎలా కొంటారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. నేడు ఆయన మీడియా సమక్షంలో.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. వచ్చే పది రోజుల్లో బీజేపీలో ఈటల కనుమరుగవుతారని వ్యాఖ్యానించారు. ధాన్యం సేకరణ అనేది కచ్చితంగా ప్రభుత్వం చేయాల్సిన పని కాదన్నారు. ఈటల ధాన్యం కొనమంటే సీఎం కేసీఆర్ వద్దన్నారంటూ …
Read More »సీఎం జగన్ కు లోకేష్ సలహా
ఏపీలో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని మాజీ మంత్రి,ఎమ్మెల్సీ నారా లోకేశ్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరో 3 వారాల్లో పరీక్షలు ప్రారంభం కానున్నందున కరోనా ఉద్ధృతి దృష్ట్యా అందరినీ పాస్ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి లేఖ రాశారు. తెలంగాణ సహా 12 రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షలను రద్దు చేశాయని గుర్తు చేశారు. విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్నారని, హైకోర్టు ఆదేశాలు లేదా ప్రతిపక్ష ఆందోళనల …
Read More »ఈటల ఒక మేకవన్నె పులి : మంత్రి గంగుల
ఈటల రాజేందర్ ఒక మేకవన్నె పులి. బలహీన వర్గాల ముసుగులో ఉన్న పెద్ద దొర. ఆయన హుజురాబాద్‌కు వెళ్తే బీసీ.. హైదరాబాద్‌కు వస్తే ఓసీ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు.అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డితో, కిరణ్ కుమార్‌రెడ్డితో తాను మాట్లాడాను అని ఈటల చెబుతున్నారు. కేవలం దేవరయాంజల్ భూముల కోసమే ఆయన మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం గురించి …
Read More »నేడు ఈటల కీలక ప్రకటన
తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలతో ఇకపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగే ఉద్దేశం ఆయనకు లేదని సమాచారం. ఇవాళ హుజూరాబాద్లో అనుచరుల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. తర్వాత హైదరాబాద్కు వచ్చి స్పీకర్ను కలిసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన లేఖను అందజేస్తారని తెలిసింది.
Read More »హైకోర్టుకు మాజీ మంత్రి ఈటల కుటుంబం
తమ భూముల్లో చట్ట విరుద్ధంగా సర్వే చేశారని హైకోర్టులో ఈటల రాజేందర్ భార్య, కొడుకు, జమునా హేచరీస్ పిటిషన్ వేశారు. మెదక్ కలెక్టర్ ఇచ్చిన నివేదిక తప్పుల తడకగా ఉందని, అచ్చంపేటలో తమ భూముల్లో అక్రమంగా సర్వే చేశారని పేర్కొన్నారు. తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా విచారణ జరిపిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. తమ భూముల్లో జోక్యం చేసుకోకుండా అధికారులకు ఆదేశాలివ్వాలన్నారు. ఇది నేడు విచారణకు వచ్చే అవకాశముంది.
Read More »