Ys Sharmila YSRTP పార్టీ పెట్టడం వెనక అసలు కారణం ఎంటో చెప్పారు మాజీ మంత్రి,బీజేపీ నేత డీకే ఆరుణ . ఆమె మీడియా తో మాట్లాడుతూ “కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధ్య అవగాహన ఉంది.. ఎన్నికల సమయంలో మాత్రమే వారు ఓట్ల కోసం వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తారని ఆమె వ్యాఖ్యానించారు. పోలవరం ముంపు గ్రామాల్లో కనీస వసతులు …
Read More »TRSలో చేరిన BJP నేతలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నమ్మకద్రోహానికి పాల్పడుతోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లాలోని బేలలో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే రామన్న సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో సీసీఐని సందర్శించిన కేంద్ర మంత్రులు సిమెంట్ పరిశ్రమ ప్రారంభిస్తామని చెప్పినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు.సీసీఐ ప్రారంభానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ …
Read More »AP BJPకి షాక్
ఏపీ మాజీ మంత్రి, బీజేపీ నేత రావెల కిశోర్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ రాజీనామా లేఖను ఏపీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజుకు పంపించారు. తన వ్యక్తిగత కారణాలతోనే బీజేపీని వీడుతున్నానని, పార్టీ నేతలు అన్యథా భావించవద్దని ఆయన తన రాజీనామా లేఖలో విజ్ఞప్తి చేశారు. ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న రావెల… కొన్ని నెలల …
Read More »పార్టీ మార్పుపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ . సంచలన వ్యాఖ్యలకు నిలయం ఆయన. తాజాగా కోమటిరెడ్డి బ్రదర్స్ అయిన భువనగిరి ఎంపీ,మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరతారు. అందులో భాగంగానే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానమంత్రి నరేందర్ మోదీని కలిశారు అని కూడా వార్తలు ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటుగా అటు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించాయి. …
Read More »టీడీపీలో విషాదం
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ ఎంపీ యడ్లపాటి వెంకటరావు (102) కన్నుమూశారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని తన కూతురు నివాసంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. తెనాలి సమీపంలోని బోడపాడులో 1919లో జన్మించిన ఈయన.. 1967, 1978లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1978-80 మధ్య వ్యవసాయశాఖ మంత్రిగా చేశారు. 1983లో దివంగత మాజీ ముఖ్యమంత్రి …
Read More »మళ్లీ తెరపైకి ఎమ్మెల్యే ఈటల రాజేందర్
దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగిన రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసైని అవమానించే రీతిలో ప్రవర్తించారని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. రాజ్ భవన్ కు రాకుండా కేసీఆర్ ప్రగతి భవన్లో వేడుకలు జరుపుకోవడం గవర్నర్ వ్యవస్థను అవమానించడమేనని ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన పదవులను రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం ప్రభుత్వం తరఫున ఒక సీనియర్ మంత్రిని కూడా పంపించలేదని విమర్శించారు.
Read More »TDP నేత పరిటాల శ్రీరామ్ కి కరోనా
ఏపీలో అనంతపురం జిల్లా రాప్తాడు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ఇటీవల తల్లి సునీతతో కలసి ధర్మవరం నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనను కలసిన వారందరూ జాగ్రత్తగా ఉండాలని, లక్షణాలుంటే టెస్టులు చేసుకోవాలని శ్రీరామ్ సూచించారు.
Read More »మగబిడ్డకు జన్మనిచ్చిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె భర్త భార్గవ్ రామ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అఖిలప్రియ తల్లి శోభనాగిరెడ్డి జయంతి రోజునే బాబు పుట్టడంతో భూమా కుటుంబం సంబరాలు చేసుకుంటోంది. శోభనాగిరెడ్డి మరణంతో అఖిలప్రియ రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరారు. ఆ తర్వాత మంత్రి …
Read More »మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన సీనియర్ నేత,మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదైంది. సీఎం జగన్, పలువురు మంత్రులపై అసభ్య పదజాలంతో విమర్శలు చేశారంటూ గుంటూరు జిల్లా నకరికల్లు(మ) కండ్లగుంట మాజీ సర్పంచ్ కోటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రులను ఉద్దేశించి పరుష పదజాలంతో అయ్యన్న వ్యాఖ్యలు చేయడం సరికాదని ఫిర్యాదులో కోటేశ్వరరావు పేర్కొన్నారు.
Read More »జగన్ పై లోకేష్ విమర్షల వర్షం
ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత,సీఎం జగన్ పాలనలో రాష్ట్రం ఆత్మహత్యల ప్రదేశ్ మారిపోయిందని మాజీ మంత్రి టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు. ఉద్యోగం రాలేదని కర్నూలు జిల్లాకు చెందిన యువకుడు వీరాంజనేయులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.. వైసీపీ ప్రభుత్వం అతడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 2.30 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరిన లోకేశ్.. యువకులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు.
Read More »