ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు టిడ్కో ఇళ్ల వద్ద సెల్ఫీ తీసుకోవడం సిగ్గుచేటని మంత్రి జోగి రమేష్ అన్నారు. “చంద్రబాబుకు దమ్ముంటే.. గడప గడపకు వెళ్లి డ్వాక్రా మహిళలకు ఏం చేశావో, రైతుల రుణమాఫీ చేశావా? అని అడిగుదాం” అని మంత్రి ఛాలెంజ్ చేశారు. ప్రజలకు మేలు చేశాము కాబట్టే వాళ్ళ ఇళ్ళకు వెళుతున్నామని చెప్పారు. పైరవీలు లేకుండా డబ్బులు నేరుగా ఎకౌంట్లలోకి …
Read More »జగన్ కు పాలించే అనుభవం ఇంకా రాలే- వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ఏపీ ముఖ్యమంత్రి .. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఆ పార్టీకి చెందిన నేత.. ఆదోని అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి ఇంకా అనుభవం రాలేదని చెప్పారు. మరో ఐదేళ్లు అవకాశం ఇస్తే అనుభవం వస్తుందని ఆయన చెబుతున్నారు. వైసీపీ అధిష్టానంపై నేతలు, కార్యకర్తలకు అసంతృప్తి ఉన్నమాట వాస్తవమేనని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయిప్రసాద్ …
Read More »ఏపీలో లోకేష్ వర్సెస్ ఎమ్మెల్యే కేతిరెడ్డి
ఏపీలో అధికార వైసీపీకి చెందిన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి,ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన నేత.. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేష్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫాం హౌస్ అక్రమ నిర్మాణమంటూ మాజీ మంత్రి నారా లోకేష్ గూగుల్ మ్యాప్ ను విడుదల చేశారు. లోకేష్ మ్యాప్ ఫేక్ అంటూ సోషల్ మీడియాలో ఎమ్మెల్యే కేతిరెడ్డి లేఖను పోస్ట్ చేశారు. ఇదే అసలైనదంటూ అంటూ …
Read More »2024 సార్వత్రిక ఎన్నికలే బాబుకు చివరి ఎన్నికలు
ఏపీలో రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఇవే చివరి ఎన్నికలని జోస్యం చెప్పారు. 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న బాబు రాష్ట్రానికి ఏమి చేశారో చెప్పలేరని ఎద్దేవా చేశారు.టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు.. మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ ఏం చేశారో చెబుతారు కానీ, తాను ఏం చేసింది …
Read More »మహిళల గురించి మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు
ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన వైసీపీ ఓడిపోతే మొదటి బుల్లెట్ మహిళలకే తగులుతుందని వైసీపీ సీనియర్ నేత.. ప్రస్తుత మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకుంటే మీ చేతిని మీరే నరుకున్నవారవుతారని ఆయన చెప్పారు. కొంగున డబ్బుంటేనే మీ వెంట భర్త ఉంటాడని హితవు పలికారు. ప్రభుత్వం మహిళలకు సహాయం చేయడం కొందరికి ఇష్టం లేదు. వైసీపీ పోవాలని వారు …
Read More »అసెంబ్లీ ఎన్నికల బరిలో అశోక్ గజపతిరాజు
ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన అత్యంత సీనియర్ నేత అశోక్ గజపతిరాజు మళ్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత 2014లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి, కేంద్రమంత్రిగా ఆయన పనిచేశారు. అయితే ఆ తర్వాత ఆయన 2019లో పోటీకి దూరంగా ఉన్నారు. ఆయన కూతురు అదితి విజయనగరం అసెంబ్లీ సీటు నుంచి పోటీచేసి, ఓడిపోయారు. మళ్లీ గజపతిరాజు …
Read More »పుట్టపర్తిలో వేడెక్కిన రాజకీయం
ఏపీలో పుట్టపర్తిలో అధికార పార్టీ అయిన వైసీపీ.. ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. అభివృద్ధిపై పేటెంట్ హక్కులు మాకే ఉన్నాయంటూ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ చెబుతున్నారు. తాము వచ్చాకే అభివృద్ధి జరిగిందంటున్నారు ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమంటూ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి సవాల్ విసిరారు. సత్తెమ్మ ఆలయం వద్ద తేల్చుకుందామంటూ పల్లె ప్రతిసవాల్ చేశారు. అలర్టైన పోలీసులు ఆలయం …
Read More »ఏపీలో బీజేపీ జాతీయ కార్యదర్శి వాహనంపై దాడి
ఏపీ అమరావతిలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు యాక్షన్ మొదలు పెట్టారు. తాళ్లాయపాలెంలో నిందితుడు దున్న నితిన్ ను అరెస్టు చేశారు. అతనే వాహనంపై రాయి విసిరినట్లు పోలీసులు పేర్కొన్నారు. రాజధాని రైతులకు మద్దతు ప్రకటించేందుకు అమరావతి వెళ్తుండగా మూడు రాజధానుల మద్దతుదారులు సత్య కుమార్ వాహనంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read More »ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కి అస్వస్థత
ఏపీలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. నియోజకవర్గంలోని తన నివాసంలో ఉండగా గుండెనొప్పి రావడంతో వైద్యులను పిలిపించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స అందిస్తున్నారు.. అయితే మరింత మెరుగైన చికిత్స కోసం చెన్నై తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత నెలలో కూడా గుండెలోని వాల్వ్ బ్లాక్ కావడంతో చికిత్స అందించారు.
Read More »వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరికపై మంత్రి జయరాం క్లారిటీ
ఏపీ అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ కూడా ప్రధానప్రతిపక్షమైన టీడీపీలో చేరే ప్రసక్తే లేదంటున్నారు మంత్రి గుమ్మనూరు జయరాం. 2024 ఎన్నికల్లోనూ ప్రస్తుత ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగనే ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశువుల సంతలో కొన్నట్టు కొనడం ఆనాటి నుంచి వస్తున్న ఆనవాయితీ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. …
Read More »