Home / Tag Archives: errabelli dayaker rao (page 37)

Tag Archives: errabelli dayaker rao

మహిళా సంఘాలకు 18 వేల కోట్ల రుణాలు

మహిళా సంఘాలకు బ్యాంకులు ఇచ్చే రుణాలను క్రమపద్ధతిలో చెల్లిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సెర్ప్‌, స్త్రీనిధి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలకు రూ.18,069 కోట్ల రుణాలను అందించనున్నట్టు వెల్లడించారు. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో గ్రామీణ ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చే రుణాల వార్షిక ప్రణాళికను విడుదల …

Read More »

ఎస్సారెస్పీ, దేవాదుల నీటిని అందించడంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష

జనగామ జిల్లా పాలకుర్తి నియోజక వర్గంలోని పలు గ్రామాలకు ఎస్సారెస్పీ, దేవాదుల నీటిని అందించడంపై హన్మకొండ కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు. నవాబుపేట, ఉప్పుగల్లు, రిజర్వాయర్ల పూర్తి, మండలాల వారీగా నీటి సరఫరా, గ్రామాల వారీగా సమస్యలను చర్చించారు. సాధ్యమైనంత వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసి నీరు అందించాలని అధికారులను ఆదేశించారు.సమావేశంలో నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, …

Read More »

నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండండి

నాలుగు విడతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి సాధించిన ఫలితాలు ఇప్పుడు ప్రజల అనుభవంలోకి వస్తున్నాయని, తత్ఫలితంగా రాష్ట్రంలోని అనేక గ్రామాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని, ఇదే వరుసలో ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. పాలకుర్తి మండల సర్వసభ్య సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యఅతిథిగా …

Read More »

బీబీ నగర్ – టోల్ గేట్ మధ్య రోడ్డు ప్రమాదంపై మంత్రి ఎర్రబెల్లి విచారం

హైదరాబాద్ వరంగల్ ప్రధాన రహదారిపై బీబీ నగర్ టోల్గేట్ మధ్య ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ట్రాలీ ఢీ కొట్టిన ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా డ్రైవర్ పక్క సీట్ లో ఉన్న మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. కాగా జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం లోని పలు కార్యక్రమాలకు హాజరు కావడానికి అదే దారిలో వెళ్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, …

Read More »

వేసవిలో నీటి ఎద్దడి లేకుండా పకడ్బందీ చర్యలు : మంత్రి ఎర్రబెల్లి

వేసవిలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా నూటికి నూరు శాతం సురక్షిత మంచి నీటిని అందించాలి. సీఎం కేసీఆర్‌ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను అదేశించారు. శుక్రవారం వేసవిలో మంచి నీటి సమస్యల మీద ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల పై సంబంధిత అధికారులు, సర్పంచులతో హైదరాబాద్ మిషన్ భగీరథ కార్యాలయం నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

ఓరుగల్లులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటిస్తున్నారు. వరంగల్‌, హనుమకొండ, నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వరంగల్ మహా నగరపాలక సంస్థ కార్యాలయంలో అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.8 కోట్లతో నిర్మించిన స్మార్ట్‌ రోడ్లను, రూ.2 కోట్లతో నిర్మించిన కౌన్సిల్‌ హాల్‌ను, రంగంపేటలో రూ.1.50 కోట్లతో ఆధునీకరించిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. పోతననగర్‌ వైకుంఠ ధామం అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. …

Read More »

కుల వివక్ష పై ఆనాడే పోరాటం చేసిన మహానుభావుడు పూలే

జీవితంలో తాను చెప్పింది ఆచరించిన గొప్ప మనిషి వ్యక్తి విద్యావేత్త, సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. పూలే జయంతి ని పురస్కరించుకుని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో పూలే చిత్ర పటానికి పలువురు వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకులు తదితరులతో కలిసి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కుల వివక్ష …

Read More »

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి….

వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్  తన పుట్టినరోజు సందర్బంగా రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారితో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్దన్నపేట నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ అరూరి విశాల్, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, …

Read More »

మండలి చైర్మన్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర శాస‌న మండలి చైర్మ‌న్ గా రెండోసారి  ఏక‌గ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి గారిని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు గారు శుభాకాంక్ష‌లు, తెలిపి అభినందించారు. శాస‌న మండ‌లిలో మంగ‌ళ‌వారం ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో మంత్రి మాట్లాడారు. చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి గారు త‌న‌కు 30 ఏండ్లుగా తెలుస‌ని, వారు సుదీర్ఘంగా రాజ‌కీయాల్లో ఉన్నార‌ని, మూడు సార్లు ఎంపీగా, రెండుసార్లు …

Read More »

ప్రగతి భవన్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సీఎం క్యాంప్ కార్యాలయం ప్రగతి భవన్ లో జరిగిన 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి తో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పాల్గొన్నారు. సీఎం గారు జాతీయ జెండా ను ఆవిష్కరించగా, మంత్రి ఆ జాతీయ జెండాకు వందనం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat