సంస్థ నిర్వాహణ లో భాగంగా వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటిస్తున్న కంపెనీల జాబితాలో ఈకామర్స్ సంస్థ మీషో కూడా చేరింది. ఖర్చు తగ్గించుకునేందుకు, లాభాలను సాధించడానికి గానూ 251 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ఈ సంస్థ ప్రతినిధి నిన్న శుక్రవారం వెల్లడించారు. మొత్తం ఉద్యోగుల్లో ఇది దాదాపు 15 శాతానికి సమానం. ఉద్యోగాల నుంచి తొలగించిన వారికి మీషో వ్యవస్థాపకుడు, సీఈవో విదిత్ ఆత్రే ఈమెయిల్ పంపించారు.ఈ …
Read More »Politics : తెలంగాణా ఉద్యోగులపై ప్రశంసలు కురిపించిన ఎమ్మెల్సీ కవిత..
Politics టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల కోసం మాట్లాడారు ఈ సందర్భంగా పలు విషయాలు మాట్లాడుకుంటూ వచ్చిన కవిత వచ్చే ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని అందుకు కారణం ఉద్యోగులు ఉపాధ్యాయులు అంటూ చెప్పుకొచ్చారు.. సీఎం కేసీఆర్ గన్ అయితే, ప్రభుత్వ ఉద్యోగులు బుల్లెట్లు అన్నారు.. 2023 నూతన సంవత్సరం సందర్భంగా టీఎన్జీవో డైరీ ఆవిష్కరణ సభలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. …
Read More »భారతీయులకు ఎలాన్ మస్క్ షాక్
ట్విట్టర్‌లో ఎలాన్ మస్క్ యాజమాన్యం కింద ఉద్యోగాల కోత భారీస్థాయిలో కొనసాగుతున్నది. భారత్‌లో ఉన్న 200 మందికిపైగా ఉద్యోగుల్లో మెజారిటీ ఉద్యోగులకు గుడ్ బై చెప్పారు. మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ విభాగాలను పూర్తిగా తొలగించిన మస్క్.. ఇంజినీరింగ్, సేల్స్ విభాగాల్లోనూ ఉద్యోగులను తొలగించారు. కంపెనీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు కోత తప్పడం లేదని మస్క్ తన సందేశంలో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కనీసం 3,700 పైచిలుకు ఉద్యోగాలు ఊడిపోతాయని అంచనా వేస్తున్నారు.
Read More »‘3 నెలలకు ఒకసారి ప్రమోషన్.. ఇన్ టైంలో జీతం’..!
ప్రముఖ ఐటీ సంస్థ విప్రో మీడియాలో వస్తున్న వార్తలను కొట్టిపారేసింది. సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి రావాల్సిన ఉద్యోగుల వేతనాల పెంపును నిలిపే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. గత త్రైమాసికంలో సంస్థ లాభాలు తగ్గడం వల్ల ఉద్యోగుల వేరియబుల్ పే ను కంపెనీ నిలిపివేస్తున్నట్లు మీడియాలో వార్తలు చక్కర్లకొట్టాయి. దీనికి స్పందించిన సంస్థ ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో వెనకడుగు వేయడం లేదని ప్రకటించింది. ఇప్పటికే మొదటి దశ ప్రమోషన్ల …
Read More »ఏపీ ఆర్టీసీ ఉద్యోగులందరికీ Good News
ఏపీ ఆర్టీసీ ఉద్యోగులందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఆర్టీసీ ఉద్యోగులందరికీ సెప్టెంబర్ 1 నుంచి కొత్త పీఆర్సీ వేతనాలు అందుతాయని ఆ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. డీజిల్, నిర్వహణ భారం పెరగడంతో సంస్థ మనుగడ కోసం విధిలేని పరిస్థితుల్లో బస్సు ఛార్జీలను పెంచాల్సి వచ్చిందని, దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. సంస్థ …
Read More »ఉద్యోగులకు గూగుల్ షాక్
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్.. ఉద్యోగుల తొలగింపునకు సిద్దమైనట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇటీవల క్యూ2 వార్షిక ఫలితాల్లో సంస్థ ఆదాయం తగ్గడంపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగుల పనితీరును ప్రశ్నించారు. దీంతో వచ్చే వార్షిక ఫలితాల నాటికి పర్ఫార్మెన్స్ బాగాలేని ఉద్యోగులను గూగుల్ తొలగిస్తుందని పలు పత్రికలు కథనాలు ప్రచురిస్తున్నాయి. ప్రస్తుతం గూగుల్ నియామకాలను నిలిపివేసింది.
Read More »హైదరాబాద్ మెట్రో బంపర్ ఆఫర్..
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులు గుడ్ న్యూస్. మెట్రో రైలు యాజమాన్యం బంపర్ ఆఫర్ ప్రకటించింది. హైదరాబాద్ మెట్రో రైలులో ‘సూపర్ సేవర్ కార్డు’తో కొత్త ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. మెట్రో ఎండీ కె.వి.బి రెడ్డి దీన్ని ప్రారంభించారు. ఈ కార్డుతో ఏడాదిలో 100 రోజుల్లో కేవలం రూ.59కే రోజంతా ప్రయాణించవచ్చని మెట్రో వర్గాలు తెలిపాయి. ఈ సూపర్ సేవర్ కార్డుతో ఆయా రోజుల్లో హైదరాబాద్ సిటీలో ఎక్కడి నుంచి …
Read More »ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త
ఏపీలో అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2015 సవరించిన పేస్కేలు ప్రకారం మినిమం టైం స్కేలు వర్తింపజేస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు.. కాంట్రాక్టు మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులు(ఇద్దరు పిల్లలకు) ఇస్తామంది. కాంట్రాక్టు ఉద్యోగులు ఎవరైనా ప్రమాదవశాత్తూ/కరోనాతో చనిపోతే కుటుంబ సభ్యులకు 5 లక్షలు, సహజ మరణానికి ౯ 2 లక్షలు ఇస్తారు.
Read More »విప్రో కంపెనీ ఉద్యోగులకు బంఫర్ ఆఫర్
ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ అయిన విప్రో కంపెనీ ఉద్యోగులకు ఈ ఏడాది రెండోసారి జీతం పెరగనుంది. జూనియర్ ఉద్యోగులకు జీతాలను పెంచుతున్నామని.. బ్యాండ్ B3 ఉద్యోగుల (అసిస్టెంట్ మేనేజర్ మరియు దిగువస్థాయి)కు పెరిగే జీతాలు సెప్టెంబర్ 1 నుంచి అమలవుతాయని సంస్థ తెలిపింది. 2021 జనవరిలోనే ఒకసారి వీరి జీతాలు పెరగ్గా.. తాజాగా మళ్లీ పెరగనున్నాయి. మొత్తం కంపెనీ ఉద్యోగుల్లో బ్యాండ్ B3 కేటగిరీ వారు 80శాతం వరకు …
Read More »బ్రేకింగ్ న్యూస్..సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇక ఇంటి నుంచే..ఎందుకంటే?
భాగ్యనగరంలో ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకరికి రావడంతో అందరూ భయబ్రాంతులకు గురవురుతున్నారు. ఇది ఇలా ఉండగా తాజాగా మరో ఇద్దరికీ ఈ వ్యాధి సోకినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో బాగంగానే ఒకరు మైండ్ స్పేస్ 20వ అంతస్తులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా అనుమానిస్తున్నారు. దాంతో అందులో స్టాఫ్ అందరికి ఇంటికి వెళ్ళిపోమని చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలను మూసివేస్తున్నారని..ఇక …
Read More »