సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి జయసుధ ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. గతంలో ఆమె ప్రాతినిధ్యం వహించిన సికింద్రాబాద్ నియోజకవర్గంలో క్రిస్టియన్ ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఈసారి కూడా అక్కడ నుంచే పోటీ చేయించాలని కాషాయ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. కాగా జయసుధ సమకాలీనురాలు, మరో ప్రముఖ సినీ నటి జయప్రద అధికార బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్టీఆర్ హయాంలో టీడీపీ …
Read More »తెలంగాణలో మొత్తం ఓటర్లు 3,03,56,894
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఓటర్ల జాబితా-2022 ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈమేరకు మొత్తం ఓటర్లు 3,03,56,894 మంది ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 1,52,56,474, మహిళా ఓటర్లు 1,50,98,685, ఇతర ఓటర్లు 1,735 మంది ఉన్నారు. ఇక 18-19 ఏళ్ల మధ్య ఓటర్ల సంఖ్య 1,36,496గా ఉండగా.. 2021తో పోలిస్తే మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 2 లక్షలు పెరిగింది.
Read More »తమిళనాడు స్థానిక పంచాయతీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ సత్తా
తమిళనాడులో డీఎంకే పార్టీ స్థానిక పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటింది. తొమ్మిది జిల్లాల్లో జరిగిన గ్రామీణ ఎన్నికల్లో డీఎంకేతో పాటు కూటమి పార్టీలు విజయకేతనం ఎగురవేశాయి. అక్టోబర్ 6, 9 తేదీల్లో ఆ ఎన్నికలు జరిగాయి. పంచాయతీ ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ డీఎంకే కూటమి అన్ని పంచాయత్‌లను నెగ్గినట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకేపై ఆ పార్టీ ఆధిక్యంలో ఉన్నది. ఇతర జిల్లాల్లో జరిగిన ఎన్నికల్లో …
Read More »సెప్టెంబర్ 30న దేశ వ్యాప్తంగా ఉప ఎన్నికలు
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి అభ్యర్థనను కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు అంగీకరించింది. బెంగాల్‌లో మమతాబెనర్జి బరిలో దిగాలని భావిస్తున్న భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి సెప్టెంబర్ 30న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా బెంగాల్లోని షంషేర్‌గంజ్, జాంగీర్‌పూర్ అసెంబ్లీ స్థానాలకు, ఒడిశాలోని పిప్లీ అసెంబ్లీ స్థానానికి కూడా సెప్టెంబర్ 30న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ ఉపఎన్నికల్లో పోలైన ఓట్లను అక్టోబర్ 3న లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నట్లు కేంద్ర …
Read More »విజయ్ సైకిల్ పై ఎందుకోచ్చాడో తెలుసా..?
ఈ రోజు మంగళవారం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కోలివుడ్ టాప్ హీరో విజయ్ దళపతి పోలింగ్ బూత్‌కు సైకిల్‌పై వచ్చి తన ఓటు వేయడంపై సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో చర్చ జరుగుతోంది. ఒక పార్టీకి వ్యతిరేకంగానే ఆయన ఇలా సైకిల్‌పై వచ్చి ఓటేశారని, ఎవరిని ఓడించాలో చెప్పకనే చెప్పారని నెటిజెన్లు చర్చించుకుంటున్నారు. దేశంలో ఇప్పటికే తీవ్ర స్థాయిలో అధికమై, ఇంకా పెరుగుతూ పోతున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగానే …
Read More »2జీ, 3జీ, 4జీ లకు సరికొత్త నిర్వచనం చెప్పిన అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడు రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాట 2జీ, 3జీ, 4జీ ఉన్నాయని తెలిపారు. 2జీ అంటే రెండు తరాల మారన్ కుటుంబం, 3జీ అంటే మూడు తరాల కరుణానిధి కుటుంబం, 4జీ అంటే నాలుగు తరాల గాంధీ కుటుంబమని వ్యాఖ్యానించారు. తమిళనాడులో రానున్న ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్, డీఎంకేలపై అమిత్ షా మండిపడ్డారు
Read More »ఎలాంటి హైదరాబాద్ కావాలో నిర్ణయించుకోండి-మంత్రి కేటీఆర్ గారు
గడిచిన ఆరేళ్లలో నగరంలో ఎలాంటి అశాంతి, అభద్రతా భావం లేదని, శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం ఎప్పడూ రాజీపడలేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎలాంటి హైదరాబాద్ కావాలో పారిశ్రామిక వేత్తలు నిర్ణయించుకోవాలని సూచించారు. అభివృద్ధి హైదరాబాద్ కావాలా? అరాచకాల హైదరాబాద్ కావాలా? ప్రజలు ఆలోచించాలన్నారు. ప్రజా శ్రేయస్సు కోరే ప్రభుత్వం కావాలా? మతాల పేరుతో కిరికిరిలు పెట్టేవారు కావాలో ఆలోచించాలన్నారు. హైదరాబాద్‌లో మత ఘర్షణలు లేవని, ప్రాంతీయ విభేదాలు లేవన్నారు. …
Read More »ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో గెలిచింది వీళ్లే..
ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల ఎన్నికల ఫలితాల ఉత్కంఠ వీడింది. అధికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు నలుగురు విజయం సాదించారు. ఒక్కొక్కరికి 38 తొలి ప్రాదాన్యత ఓట్లు వచ్చాయి. కాగా టీడీపీ అభ్యర్ధి వర్ల రామయ్య కు 17ఓట్లు మాత్రమే వచ్చాయి. వారి ఓట్లు నాలుగు చెల్లలేదు. ముగ్గురు తిరుగుబాటు ఎమ్మెల్యేలతో పాటు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని పొరపాటు కారణంగా చెల్లలేదని …
Read More »బాబూ… ఆరు వారాలు కాదు, 60 వారాల తర్వాతైనా నీ అడ్రసు గల్లంతే !
స్థానిక ఎన్నికల విషయంలో ట్విట్టర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. కరోనా వ్యాప్తి పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి వాయిదా వేయడంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్వయంగా సీఎం జగన్ ప్రెస్‌మీట్ పెట్టి కరోనా పేరు చెప్పి ఎన్నికలు వాయిదా వేసే ముందు ఎవరినైనా సంప్రదించారా అని సూటిగా …
Read More »బ్రేకింగ్ న్యూస్..ఎన్నికల్లో పోటీచేయమని కె.ఈ.కృష్ణమూర్తి ప్రకటన
కర్నూల్ జిల్లాలో టీడీపీ ఖాళీ అయ్యెటట్లు ఉంది. భారీగా వైసీపీ లోకి వలసలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతుండటంతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ తెలుగుదేశం పార్టీని వీడారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేశారు. అయితే ఒకపక్క తన సొంత తమ్ముడే టీడీపీని వీడిన నేపద్యంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కె.ఈ.కృష్ణమూర్తి …
Read More »