తెలంగాణ రాష్ట్ర సర్కారు రైతన్నలకు శుభవార్తను తెలిపింది. రాష్ట్రంలో గత కొంతకాలంగా ఉన్న ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలిచిపోయి ఉన్న కొత్త పాసుపుస్తకాల పంపిణీ ప్రక్రియ త్వరలోనే తిరిగి మొదలు కానున్నది. అయితే రాష్ట్ర వ్యాప్తమ్గా మొత్తం 58లక్షల పాసుపుస్తకాలకు గాను ఇప్పటివరకు మొత్తం 55.6లక్షల పాసుపుస్తకాలను రెవిన్యూ శాఖ జిల్లాలకు పంపిణీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగిలిన పాసుపుస్తకాలను పంపిణీ చేయనున్నది రెవిన్యూ శాఖ.
Read More »ఏపీలో మే 27 అర్ధరాత్రి వరకు అమల్లో ఎన్నికల కోడ్.. ఎందుకంటే.?
ఈ నెల 27వ తేదీ అర్ధరాత్రి వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని సీఈవో ద్వివేది స్పష్టం చేశారు. తప్పనిసరి పరిస్థితిలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ పూర్తైన తర్వాత కూడా రీపోలింగ్ నిర్వహించే అవకాశాలున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ద్వివేదీ పేర్కొన్నారు. ఫలితం ఎటూ తేలకపోకపోతే ఈసీకి విచక్షణాధికారం ఉంటుందని ఆయన వెల్లడించారు. ఎక్కడైనా ఏదైనా ఈవీఎం మొరాయించి వీవీ ప్యాట్ లెక్కల్లో ఏదైనా తేడావస్తే మిగతా లెక్కింపుల్లో …
Read More »చంద్రబాబు తీరుపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్..
ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. బాబు కోట్లలో బిల్లులు క్లియర్ చేస్తున్నారని, బాబు చెప్పినట్లు వింటే అధికారులు పడక తప్పదన్నారు. ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి చంద్రబాబును కట్టడి చేయాలని, చంద్రబాబు చేసిన బదిలీలను ఈసీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Read More »పార్టీ శ్రేణులంతా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చిన వైసీపీ
తూర్పు గోదావరి జిల్లాలో యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతుందని వైసీపీ నేత పినిపే విశ్వరూప్ అమలాపురం ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా సైకిళ్లు పంపిణీ చేయడం పట్ల విశ్వరూప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలుగుదేశం పార్టీ నిబంధనలకు పాతరేస్తుందని తీవ్రంగా మండిపడ్డారు. అమలాపురం, రావులపాలెం, గోకవరంలో టీడీపీనేతలు సైకిళ్లు పంపిణీ చేస్తున్నారని, ఇవే కాకుండా కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పంపిణీ చేయడానికి సైకిళ్లను సిద్ధంగా ఉంచారని …
Read More »