తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు జనవరి22న జరగనున్న ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల గెలుపుకు ఎన్నారై తెరాస యుకే ప్రత్యేక కృషి చేస్తుందని అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మీడియాకు తెలిపారు. నేడు తెలంగాణ రాష్ట్రం నుండి వివిధ దేశాల్లో ఎంతో మంది ప్రవాసబిడ్డలు స్థిరపడ్డారని, నాటి తెలంగాణ ఉద్యమం నుండి నేటి వరకు కెసిఆర్ గారి వెంటే ఉంటూ వారి నాయకత్వాన్నీ బలపర్చుతున్నారని, అదే స్పూర్తితో నేటి మున్సిపల్ ఎన్నికల్లో సైతం మీ కుటుంబసభ్యులకి , మిత్రులకి ఫోన్ చేసి తెరాస అభ్యర్థుల గెలుపుకు కృషి చెయ్యాలని ఖండాంతరాల్లో నివసిస్తున్న ఎన్నారైలకు పిలుపునిచ్చారు. ఎన్నికలేవైనా ఎన్నారై తెరాస సభ్యులు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే, అలాగే నేటి మునిసిపల్ ఎన్నికల్లో సైతం ప్రత్యేక ప్రణాళికతో తెరాస అభ్యర్థుల గెలుపుకోసం లండన్ బృందం కృషిచేస్తుందని అశోక్ గౌడ్ తెలిపారు.
Read More »కేటీఆర్ కృషి…సిరిసిల్లలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు..!
చేనేత ఖిల్లా..సిరిసిల్ల ఇక చదువుల ఖిల్లాగా మారబోతుంది..సిరిసిల్ల ప్రజల చిరకాల కోరికను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నెరవేర్చబోతున్నారు. నేతన్నల బిడ్డలకు ఇంజనీరింగ్ విద్యను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. తాజాగా సిరిసిల్లలో జేఎన్‌టీయూకు అనుబంధంగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. రాష్ట్రంలోని పేరుగాంచిన ఇంజనీరింగ్ కళాశాలలకు తీసిపోని విధంగా అత్యున్నత ప్రమాణాలతో.. వచ్చే విద్యాసంవత్సరం(2020-21) నుంచే ఈ నూతన ఇంజనీరింగ్ కాలేజీని అందుబాటులోకి తీసుకురావాలని కేటీఆర్ …
Read More »