చిన్నపిల్లల వస్ర్తాల ఉత్పత్తిలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ కిటెక్స్ మనరాష్ట్రంలో తన పెట్టుబడిని రెండింతలు చేసింది. రూ.2,400 కోట్ల పెట్టుబడితో వరంగల్ టెక్స్‌టైల్ పార్కు, రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లిలోని సీతారామపురంలో కర్మాగారాలను వచ్చే ఏడాది ప్రారంభించనున్నది. కంపెనీల స్థాపన కోసం రాష్ట్రప్రభుత్వంతో శనివారం హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ్ణ హోటల్‌లో పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకొన్నది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కిటెక్స్ రాకతో ప్రపంచవ్యాప్తంగా అనేకమంది పెట్టుబడిదారులు …
Read More »హాస్టళ్లు, గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థులకు శుభవార్త
తెలంగాణ వ్యాప్తంగ ప్రత్యక్ష తరగతులకు దూరంగా ఉన్న హాస్టళ్లు, గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థులకు విద్యనందించడలో భాగంగా పాఠశాల విద్యాశాఖ కీలకనిర్ణయం తీసుకున్నది. ఈ విద్యార్థులకు సర్కారు స్కూళ్లల్లో పాఠాలు చెప్పించడమే కాకుండా అక్కడే వారికి మధ్యాహ్న భోజనాన్ని సైతం సమకూర్చాలని నిర్ణయించింది. ఇటీవలే పాఠశాల విద్యాశాఖ అధికారులు డీఈవోలకు ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. సెప్టెంబర్ 1 నుంచి రాష్టంలోని విద్యాసంస్థలు ప్రారంభంకాగా, విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్న విషయం …
Read More »ఉపాధ్యాయులందరికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు
గురుపూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్ది బాధ్యతగల పౌరులుగా తయారుచేసే బాధ్యత గురువులకు మాత్రమే దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలో విద్య అభివృద్ధి కోసం మెరుగైన సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. పేద విద్యార్థులకు నాణ్యమైన …
Read More »పాడి రైతులకు ఆర్థిక చేయూత అందించడమే లక్ష్యం
తెలంగాణ రాష్ట్రంలో పాడి పరిశ్రమ రంగాన్ని అభివృద్ధి చేయడం, పాడి రైతులకు ఆర్థిక చేయూత అందించడమే లక్ష్యంగా విజయ మెగా డెయిరీని నిర్మిస్తున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఏడాదిన్నరలోగా నిర్మాణం పూర్తిచేస్తామని, మెగా డెయిరీలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో రూ.250 కోట్లతో తెలంగాణ రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ఆధ్వర్యంలో …
Read More »తెలంగాణలో స్కూళ్లకు ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు
తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సంబంధించి వేసవి సెలవుల నిర్ణయంపై గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యా శాఖ అధికారులతో ఆదివారం ఉదయం సమీక్షించారని మంత్రి తెలిపారు. కరోనా విస్తరించిన …
Read More »తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వార్తిక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 2.20లక్షల మందికి ఈ స్టడీ మెటీరియల్ ఫ్రీగా ఇవ్వనున్నారు త్వరలో స్కూళ్లకు చేరనున్నాయి. ఇప్పటికే ఇంటర్ విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ ప్రకటించారు. tsbie.cgg.gov.inలో ఇంటర్ మెటీరియల్ పొందొచ్చు
Read More »