తెలంగాణలో టీఎస్ ఎంసెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ) నోటిఫికేషన్ తేదీ ఖరారు అయింది. వచ్చే నెల మార్చి మొదటి వారంలో విడుదల కానున్నది. దరఖాస్తుల స్వీకరణ కూడా మార్చి నుంచే ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తును జేఎన్టీయూ ముమ్మరం చేసింది. మే 7 నుంచి 14 వరకు ఎంసెట్ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం విదితమే. మే 7 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ విద్యార్థులకు, మే 12 నుంచి 14 …
Read More »IIIT విద్యార్థులకు అస్వస్థత.. విచారణకు మంత్రి ఆదేశం
బాసర ఆర్జీయూకేటీలో మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ దవాఖానకు తరలించాలని ఆర్జీయూకేటీ డైరెక్టర్, జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు
Read More »తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో సర్కారు బడులకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు సంబంధించి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమై చర్చించారు. పరస్పర బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 2,558 మంది ఉద్యోగులు, …
Read More »తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలకు లైన్ క్లియర్
తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలకు లైన్ క్లియరైంది. పదోన్నతులు లేకుండా కేవలం బదిలీలకే అవకాశం కల్పిస్తామని పదోన్నతుల అంశం కోర్టు పరిధిలో ఉండటంతో న్యాయ సలహా మేరకు బదిలీలు మాత్రమే నిర్వహిస్తామని బుధవారం సంఘ నేతలతో అధికారుల సమావేశం జరిగింది అని విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా వివిధ అంశాలపై చర్చించిన తర్వాత బదిలీలు మాత్రమే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. బదిలీలు మాత్రం జూన్ మూడో వారంలోనే నిర్వహించాలని.. ఈ నెల 21 …
Read More »టీఆర్‌ఎస్ పాలనలోనే గ్రామాలు శరవేగంగా అభివృద్ధి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్‌ఎస్ పాలనలోనే గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా.. బుధవారం జిల్లాలోని మహేశ్వరం మండలం గొల్లూరులో పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రా రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన మంత్రులు.. …
Read More »అమిత్ షా.. టూరిస్టులా వచ్చిపోతామంటే కుదరదు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణపై పర్యటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘాటుగా స్పందించారు. ఊరికే చుట్టపు చూపులా.. టూరిస్టులా వచ్చి పోతామంటే కుదరదు అని అమిత్ షా పర్యటనను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ప్రకటించాలని, విభజన హామీలను నెరవేర్చాలని సబిత డిమాండ్ చేశారు.టీఆర్ఎస్ ఎల్పీలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మంచి రెడ్డి కిషన్ రెడ్డి, జైపాల్ యాదవ్ లతో కలిసి …
Read More »వ్యవసాయం బాగుంటేనే అందరూ బాగుంటారు
వ్యవసాయం బాగుంటేనే అందరూ బాగుంటారు. సీఎం కేసీర్ తెలంగాణలో వ్యవసాయానికే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్‌లో సోమవారం నిర్వహించిన వానకాలం పంటల సాగు సన్నద్ధత- అవగాహన సదస్సులో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ నిరంతరం రైతుల అభ్యున్నతి కోసం ఆలోచిస్తున్నారని తెలిపారు. …
Read More »రాబోయే పదేండ్లలో 16 లక్షల ఉద్యోగాలు
ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి రంగంలో రాబోయే పదేండ్లలో రెండున్నర లక్షల కోట్ల ఆదాయం, 16 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తుందని, స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకుడు ఉన్నందునే ఇది సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని రావిర్యాల ఈ-సిటీలో రేడియంట్ ఎలక్ర్టానిక్స్ యూనిట్‌లో మరో నూతన …
Read More »పదో తరగతి, ఇంటర్, టెట్ నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల 6 నుంచి 24 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు మరియు పదో తరగతి పరీక్షలు మే 23 నుంచి 28 వరకు జరగనున్న సంగతి తెల్సిందే.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి, ఇంటర్, టెట్ నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా అన్ని జిల్లా కలెక్టర్లు, డీఈవోలు, ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాఠశాల …
Read More »TSRJC ఎంట్రన్స్ దరఖాస్తులకు గడవు పెంపు
తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకుగాను దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 30 వరకు పొడిగించారు. 2022–23 విద్యాసంవత్సరానికిగాను ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో చేరే విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రమణకుమార్ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల సౌకర్యార్థం ప్రవేశాల గడువును పెంచామని వెల్లడించారు.
Read More »