తెలంగాణలో ఉన్న అన్ని ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యాబోధన, మౌలిక వసతుల కల్పనకు ‘మన ఊరు-మన బడి’ పేరుతో కార్యక్రమం నిర్వహించనున్నది.. ఇందుకోసం రూ.7,289 కోట్లు కేటాయించనున్నారు .రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ స్కూళ్లలో రూ.7,300కోట్లతో మౌలిక వసతులు కల్పన ..మన ఊరు -మన బడి విధి విధానాలతో మారనున్న ప్రభుత్వ స్కూళ్లుఈ పథకంలో భాగంగా మూడేండ్లలో …
Read More »TSలో 1,130 గెస్ట్ లెక్చరర్ల ఖాళీలు భర్తీ
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకుల కొరత తీర్చేందుకు 1,130 గెస్ట్ లెక్చరర్ల ఖాళీలను భర్తీ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నియామకాల్లో నెట్, పీహెచ్ అభ్యర్థులకు తొలి ప్రాధాన్యం దక్కనుండగా, తర్వాతి ప్రాధాన్యం పీజీ పూర్తి చేసిన వారికి ఉంటుంది. అయితే ఈ పోస్టులకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడతాయని విద్యాశాఖ పేర్కొంది.
Read More »అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 వరకు ఫస్టియర్ పరీక్షలు
కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో వాయిదా పడిన తెలంగాణలోని ఇంటర్ ఫస్టియర్ పరీక్షల నిర్వహణపై ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది మే 5 నుంచి జరగాల్సిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను వాయిదావేసి.. విద్యార్థులందరినీ పైతరగతులకు ప్రమోట్‌చేసింది. అప్పట్లో ఫస్టియర్‌లో 4.35 లక్షల మంది పరీక్ష ఫీజు చెల్లించారు. ప్రస్తుతం సెకండియర్‌లో ఉన్న వీరందరికీ అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 వరకు ఫస్టియర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇంటర్‌బోర్డు ప్రకటించింది. …
Read More »తెలంగాణలో జూనియర్ కాలేజీల్లో లక్ష అడ్మిషన్లు
తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీలు అడ్మిషన్లపరంగా చరిత్ర సృష్టించాయి. ఇంటర్‌బోర్డు చరిత్రలో ఫస్టియర్‌లో అత్యధిక ప్రవేశాలు నమోదయ్యాయి. గురువారం వరకు 1,00,424 మంది విద్యార్థులు చేరారు. గతంలో ఫస్టియర్ అడ్మిషన్లు 90 వేల మంది మార్కు దాటినా, ఎప్పుడూ లక్షకు మించలేదు. ప్రవేశాల గడువును పెంచుతూ రెండుమూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. 2015కు ముందు ప్రతిఏటా సర్కారు కాలేజీల్లో 10 శాతం అడ్మిషన్లు తగ్గుతూ ఉండేది. ప్రత్యేక రాష్ట్రంలో …
Read More »తెలంగాణలో ఏడేండ్లలో..15,000 పరిశ్రమలు
తెలంగాణ రాష్ట్రంలో సమర్థ నాయకత్వం, సుస్థిర ప్రభుత్వం ఉండటంతో ఆర్థికాభివృద్ధి శరవేగంగా సాగుతున్నదని ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ఏడేండ్లుగా పల్లెలు, పట్టణాలు సమతుల అభివృద్ధి సాధిస్తున్నాయని చెప్పారు. పరిశ్రమల అనుకూల విధానాల వల్ల 15 వేల పరిశ్రమలకు పైగా రాష్ర్టానికి వచ్చాయని పేర్కొన్నారు. వ్యవసాయం, పారిశ్రామికీకరణ సమానస్థాయిలో శరవేగంగా దూసుకుపోతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమర్థ నాయకత్వంలో సుస్థిర ప్రభుత్వం ఉన్నందు వల్లనే ఇది …
Read More »చెరువుల్లోకి మురుగునీరు పోకుండా ప్రత్యేక ట్రంక్ లైన్-మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలు వచ్చినా ముంపు సమస్య తలెత్తకుండా సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి సీఎం కేసీఆర్ జీహెచ్‌ఎంసీకి రూ.800 కోట్లు కేటాయించారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. చెరువులు, ఖాళీ స్థలాలు కబ్జా కాకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. రూ.2 కోట్ల వ్యయంతో బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్‌గూడ కోమటికుంట, పోచమ్మకుంట సుందరీకరణ పనులకు, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని …
Read More »టీఆర్‌ఎస్ నాయకుడు హఠాన్మరణం
తెలంగాణ రాష్ట్రంలోని బాలాపూర్‌కు చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు సింగిరెడ్డి చంద్రపాల్‌రెడ్డి(41) గురువారం ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. ఆయనకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. గత అసెంబ్లీ/పార్లమెంట్ ఎన్నికల సమయంలో మంత్రి సబితారెడ్డి వెన్నంటి ఉంటూ అన్ని కార్యక్రమాల్లో, ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో టీఆర్‌ఎస్ పథకాలు, మంత్రి సబితారెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేసేవారు. కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ రియల్ …
Read More »తెలంగాణ అభివృద్ధి దేశానికి ఆదర్శం
తెలంగాణలో ప్రణాళికాబద్ధంగా పట్టణాలు, గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం బడంగ్‌పేట, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో రూ.2.70 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. సుల్తాన్‌పూర్‌లో రూ.12 లక్షలతో పైపులైన్, బాలాజీనగర్‌లో రూ.12 లక్షలతో డ్రైనేజీ పైపులైన్, మల్లాపూర్‌లో రూ.21 లక్షలతో ఓపెన్ జిమ్, రూ.31 లక్షలతో మల్లాపూర్‌లో ఎంఆర్‌సీ బిల్డింగ్, ఆనంద్‌నగర్‌లో రూ.15 లక్షలతో డ్రైనేజీ పైప్‌లైన్, వెంకటాపూర్‌లో రూ.12.50 లక్షలతో బాత్ రూమ్స్, …
Read More »