తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈక్రమంలోనే తుదిశ్వాస విడిచారు. తన తండ్రి అంత్యక్రియలు స్వగ్రామం కరీంనగర్ జిల్లా కమలాపూర్లో ఈరోజు బుధవారం నిర్వహించనున్నట్లు ఈటల తెలిపారు.
Read More »బీజేపీలో ఈటలది బానిస బతుకు: బాల్క సుమన్
మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. తిన్నింటి వాసాలను ఆయన లెక్కబెడుతున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, కేపీ వివేకానంద్‌తో కలిసి సుమన్ మీడియాతో మాట్లాడారు. ఈటల రాజేందర్‌విశ్వాసఘాతకుడని తీవ్రస్థాయిలో ఆయన ఆరోపించారు. ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఈటల అవినీతికి పాల్పడ్డాడని.. రాబోయే ఎన్నికల్లో ఆయన ఓటమి ఖాయమని చెప్పారు. …
Read More »అడ్డంగా దొరికిపోయిన ఈటల
అడ్డగోలు అబద్ధాలను ప్రచారం చేయడం.. అడ్డంగా దొరికిపోవడం బీజేపీ నేతలకు అలవాటైపోయింది. బీజేపీ నేతల్లో ఈటల రాజేందర్ రెండాకులు ఎక్కువే చదివినట్టున్నారు. కొన్నాళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా వెలగబెట్టిన ప్రబుద్ధ నేత.. ఓట్లకోసం చౌకబారు ప్రచారానికి తెగబడ్డారు. గ్యాస్‌బండపై రూ.291 రాష్ట్ర ప్రభుత్వ వాటాగా వస్తున్నదంటూ నోటికొచ్చిన అబద్ధమాడుతున్నారు. ప్రచారం ఒక్కో గ్యాస్‌బండపై రాష్ట్ర ప్రభుత్వానికి రూ.291 పన్నువాటాగా వస్తున్నదని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఈ …
Read More »Huzurabad లో BJPకి ఎదురీత..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యులపట్ల వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాగ్రహం పెల్లుబికుతున్నది. హుజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంగా ఓటు అడిగేందుకు బీజేపీ నాయకులు తమ ఇంటికి రావొద్దని ప్రజలు ఖరాఖండిగా చెబుతున్నారు. ఆదివారం హుజూరాబాద్ పట్టణవాసులు తమ ఇంటి ముందు ‘ఓటు కోసం బీజేపీ నాయకులు రావొద్దు.. మా ఓట్లు టీఆర్‌ఎస్‌కే’ అని ఉన్న బోర్డులను ఏర్పాటుచేసుకొన్నారు. 27వ వార్డులో ప్రతీ ఇంటి ఎదుట గేట్లకు ఏర్పాటుచేసిన బోర్డులు బీజేపీపై వ్యతిరేకతకు పరాకాష్ఠగా …
Read More »ఈటలపై ఎమ్మెల్యే సుమన్ ఫైర్
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. తనపై భూకబ్జా ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే తప్పులు బయటపడుతాయనే రాజీనామా చేసి ఉప ఎన్నిక తెచ్చారు. విభజన హామీలను తుంగలో తొక్కి బీజేపీ తెలంగాణను మోసం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆసరా పెన్షన్ పథకాలతో పేద, మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి …
Read More »గెల్లుకు జైకొడుతున్న హుజురాబాద్ ప్రజలు
హుజూరాబాద్ ఉప ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీఆర్‌ఎస్‌కు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతున్నది. సకల జనం టీఆర్‌ఎస్‌కు జై కొడుతున్నది. ఆదివారం హుజూరాబాద్‌లో మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన 60 మంది పాన్‌షాప్ యజమానులు.. గెల్లు గెలుపుకోసం కృషిచేస్తామని తెలిపారు. బీజేపీకి చెందిన 30 మంది యువకులు జమ్మికుంటలో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కమలాపూర్ మండలం గూడూరుకు చెందిన యువకులు పరకాల …
Read More »హుజూరాబాద్ లో దళితబంధు పథకం యూనిట్ల పంపిణీ ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం యూనిట్ల పంపిణీ ప్రారంభమైంది. దళితబంధు ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారుల్లో నలుగురికి గురువారం ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో యూనిట్లను అందించారు. ఈ నలుగురిలో ఇద్దరు ట్రాక్టర్లు, ఒకరు ట్రాన్స్‌పోర్టు, మరొకరు ట్రావెల్ వాహనాన్ని ఎంపిక చేసుకొన్నారు. …
Read More »మాజీ మంత్రి ఈటల కొత్త ఎత్తుగడ
హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు వస్తున్న ఆదరణతో బెంబేలెత్తిపోయిన ఈటల రాజేందర్ తాజాగా దళితులను రెచ్చగొట్టి సొమ్ము చేసుకొనేందుకు కుయుక్తులు పన్నుతున్నట్టు తేలిపోయింది. బీజేపీ జెండా, ఈటల బొమ్మ ఉంటుంది. కానీ వాహనం మాత్రం నీలిరంగులో ఉంటుంది. ఎక్కడా బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకుల ముఖాలు మచ్చుకు కూడా కనిపించవు. ఈ వాహనాలను బుధవారమే రంగంలోకి దింపారు. బుధవారం సాయంత్రం శంభునిపల్లి గ్రామానికి రంగుమార్చుకొన్న ప్రచార రథాలు చేరుకొన్నాయి. వాడవాడల్లో తిరుగుతూ.. దళితబంధు …
Read More »ఈటల పై హుజూరాబాద్ ప్రజలు అగ్రహాం
‘బీజేపీ కలర్ మారింది. కొత్త కలరేసుకుని వచ్చిన్రు. ఇంటింటికీ తిరుగుతన్రు. నాైల్గెదు కార్లేసుకుని ఊళ్లకత్తే ఊకుంటమా ఏంది? తప్పుడు ప్రచారాలను అడ్డుకుంటం. అడ్డుకున్నం. ఎల్లగొట్టినం’.. హుజూరాబాద్‌లో రంగుమార్చిన బీజేపీ రాజకీయంపై స్థానిక దళితుల్లో పెల్లుబికిన ఆగ్రహం ఇది. తనది ఎర్రరంగు సిద్ధాంతమని చెప్పి.. కాషాయ రంగు పార్టీలో చేరిన ఈటల నీలిరంగు ప్రచార వాహనాలను గ్రామాలకు పంపించడంపై ప్రజలు తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. నీలిరంగు వాహనం.. దానిపై మోదీ సహా బీజేపీ …
Read More »పూటకోమాట..ఇదీ మాజీ మంత్రి ఈటల నైజం
ఇదీ బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ నైజం. ఏదైనా పథకం వస్తే అది తన ఘనత. లేకుంటే.. అది కేసీఆర్ వైఫల్యం. ఇదీ ఆయనగారు చెప్తున్న సందేశం. పదవి ఇస్తే కేసీఆర్ ఏం చేసినా మాట్లాడడు. క్యాబినెట్‌లో ఆయా పథకాల ఆమోదంపై చర్చ వచ్చినప్పుడు కూడా పెదవి విప్పడు. పదవి నుంచి తీసేయగానే.. సమిష్టి బాధ్యతను కూడా మరిచి.. తాను ఆమోదించిన వాటినే తీవ్రస్థాయిలో తప్పు పడతాడు …
Read More »