‘గుజరాత్‌లో రూ.600 పింఛన్ ఇయ్యనోళ్లు హుజూరాబాద్‌లో మాత్రం రూ.3వేలు ఇస్తరట. అక్కడ ఇయ్యనోళ్లు ఇక్కడ ఇస్తరా? గీ బీజేపీ మ్యానిఫెస్టో చూస్తుంటే నవ్వాలో, ఏడ్వాలో అర్థమైతలే’ అని ఆర్థికమంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. అన్ని సర్వేల్లో గెల్లు శ్రీనివాస్ గెలుస్తాడని తెల్వడంతో ఓడిపోతామనే భయంతో బీజేపీవాళ్లు సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంటలో నిర్వహించిన ధూంధాంకు టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్, …
Read More »పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఈ కనీస సోయి కూడా లేనట్టుంది
అబద్ధమాడినా అతికినట్టుండాలి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఈ కనీస సోయి కూడా లేనట్టుంది.. అందుకే ఏకంగా తెలంగాణ అమరవీరులను కేసీఆర్.. టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా స్మరించుకోలేదంటూ నీచమైన ప్రచారానికి ఒడిగట్టారు. టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశాన్ని ప్రపంచంలోని కోట్లమంది తెలంగాణ వాదులు ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. కేసీఆర్ ఏం మాట్లాడారో.. సభలో ఏం జరిగిందో కండ్లారా చూశారు. సమావేశం ఘనంగా జరిగిన తీరు చూసి రేవంత్‌కు ఏం మాట్లాడాలో పాలుపోలేదేమో.. …
Read More »ఈటల రాజేందర్ అబద్ధాల పరాకాష్ట
వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయిందట! ఇప్పుడు ఈటల కూడా వంద అబద్ధాలు ఆడుతూ ఏదోవిధంగా గట్టెక్కాలని చూస్తున్నాడు. అబద్ధాలను ప్రచారం చేయడం.. అడ్డంగా దొరికిపోవడం ఆయనకేకాదు.. ఆయన పార్టీ బీజేపీ నేతలకు అలవాటైపోయింది. అందరికంటే రాజేందర్ రెండాకులు ఎక్కువే చదివినట్టున్నారు. కొన్నాళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా వెలగబెట్టిన ఈ నేత.. ఓట్లకోసం చౌకబారు ప్రచారానికి తెగబడ్డారు. టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన్నాటినుంచీ తన ఉనికిని కాపాడుకోవడం …
Read More »మీ ఓటు ఎటువైపు.. కుట్టు మిషన్లకా.. కళ్యాణలక్ష్మికా..?
మీ ఓటు ఎటువైపు.. కుట్టు మిషన్లకా.. కళ్యాణలక్ష్మికా..? అరవై రూపాయాల గోడ గడియారానికా.. కేసీఆర్ కిట్‌కా..? రూపాయి బొట్టుబిళ్లకా.. రూ.2016 పెన్షన్లకా..? అని మంత్రి హరీశ్‌రావు ఓటర్లను ఉద్దేశించి అడిగారు. వీటిలో ఏది ఉపయోగమో ఆలోచించాలని ఓటర్లకు ఆయన సూచించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని దమ్మక్కపేటలో యాదవ భవన నిర్మాణ పనులకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. గెల్లు శ్రీను ఉద్యమకారుడు. 20 ఏండ్లు …
Read More »