తెలంగాణలో సింగరేణి ఎన్నికలపై హైకోర్టు విచారణ 21కి వాయిదా వేసింది. సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఇంధన కార్యదర్శి హైకోర్టులో వేసిన పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం మారిన నేపథ్యంలో పోలింగ్ ఏర్పాట్లకు, సిబ్బంది నియామకానికి మరికొంత సమయం కావాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈరోజు(సోమవారం) విచారించాల్సి ఉండగా 21వ తేదీకి వాయిదా వేశారు. ఈనెల 27వ తేదీని ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయించిన క్రమంలో ఎన్నికలను …
Read More »మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అరెస్ట్
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండు పది రోజులు కూడా గడువక ముందే విపక్షాలకు చెందిన నాయకులపై నిర్బంధాలు ప్రారంభమయ్యాయి. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో అధికార కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహిస్తున్నది. దీంతో నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత గువ్వల బాలరాజును పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి అచ్చంపేట వెళ్తుండగా వెల్దండ వద్ద అడ్డుకున్న పోలీసులు.. మాజీ ఎమ్మెల్యేను పీఎస్‌కు తరలించారు.విషయం …
Read More »మేడిగడ్డ ప్రాజెక్టు పై విచారణ
కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈరోజు తన నివాసంలో నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.రాష్ట్రంలో ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలన్నారు. ఇతర రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ వద్ద …
Read More »కాళేశ్వరం ప్రాజెక్టుపై సిటింగ్ జడ్జితో విచారణ
తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై సిటింగ్ జడ్జితో పాటు అంతర్జాతీయ, జాతీయస్థాయి నిపుణులతో ఒక టెక్నికల్ కమిటీని వేసి విచారణ జరిపించాలని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి ట్వీట్ చేశారు. ‘ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటివరకు ఎన్ని నీళ్లు ఇచ్చారు. ఎంత కరెంటు బిల్లు కట్టారు. ఖర్చుకు తగ్గ ఫలితం వస్తుందా? ఇంకా ఎంత పెట్టుబడి పెట్టాలి? అనే విషయాలు తేల్చాలి. …
Read More »మంగళవారం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి మంగళవారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలువురు కాంగ్రెస్ పెద్దలతో సమావేశం కానున్నారు. ప్రభుత్వంలో మిగిలిన ఆరు మంత్రి పదవుల విషయంపై ఆ రోజున క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ఆశావహులు అధిష్ఠానం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
Read More »అభ్యంతరకరమైన పదాలను గవర్నర్ ప్రసంగంలో నుంచి తొలగించాలి
తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలోని పలు అంశాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం నుంచి కొన్ని పదాలను తొలగించాలని ఎమ్మెల్సీ కవిత సవరణలను ప్రతిపాదించారు. అయితే, శాసనమండలి తొలి రోజే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నారు.ఈ నేపథ్యంలో శనివారం నాడు శాసనమండలి ఆవరణలో కవిత మీడియాతో మాట్లాడుతూ….అభ్యంతరకరమైన పదాలను గవర్నర్ ప్రసంగంలో నుంచి తొలగించాలంటూ తాను …
Read More »సత్తుపల్లిలో నూతన గ్రంథాలయ భవన పూజా కార్యక్రమం
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నూతన గ్రంథాలయ భవన పూజా కార్యక్రమంలో పాల్గొని రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి గారి సొంత ఖర్చులతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని జిల్లా గ్రంథాలయ అధికారులకు అందించిన రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి గారు, సండ్ర వెంకటవీరయ్య .. సత్తుపల్లికి గ్రంథాలయాన్ని గొప్ప అన్ని హంగులతో కూడిన ఆధునిక దేవాలయంగా అందించాము.రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి.రాజ్యసభ సభ్యుడుగా సత్తుపల్లి …
Read More »సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ భేటీ
తెలంగాణ రాష్ట్ర సీఎం ఎనుముల రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ జూబ్లీహిల్స్ నివాసంలో ఆదివారం సమావేశమయ్యారు.కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామరాజన్ సీఎం రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆర్థికపరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క,శాసనసభ వ్యవహారాలు,ఐటీ శాఖ మంత్రి …
Read More »రేవంత్ రెడ్డి ఢిల్లీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు. ఢిల్లీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి’ అని ఎద్దేవా చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అని, హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ రిప్లై ఇచ్చారు. తనను ఎన్నారై అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కామెంట్ చేశారని.. ఎన్నారైని …
Read More »ప్యానల్ స్పీకర్లుగా రేవూరి ప్రకాశ్ రెడ్డి, బాలూనాయక్, కౌసర్ మొయియుద్దీన్, కూనంనేని సాంబశివరావు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్నికాంగ్రెస్ సభ్యుడు రామ్మోహన్‌రెడ్డి ప్రతిపాదించారు. దానిపై సభ్యులు ప్రసంగిస్తున్నారు. కాగా, ప్రతిపక్ష నాయకుడిగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. అదేవిధంగా ప్యానల్ స్పీకర్లుగా రేవూరి ప్రకాశ్ రెడ్డి, బాలూనాయక్, కౌసర్ మొయియుద్దీన్, కూనంనేని సాంబశివరావు పేర్లను స్పీకర్ ప్రకటించారు.
Read More »