చలికాలంలో చాలా మందికి దగ్గు, జలుబు, తుమ్ములు, కఫం వంటి సమస్యలు వస్తాయి. ఈ కింది జాగ్రత్తలు పాటిస్తే ఉపశమనం పొందవచ్చు. 1. తేనెలో అల్లం కలుపుకుని తాగాలి. 2. పావు స్పూన్ మిరియాల పొడిని తేనెలో కలిపి తరచూ తీసుకోవాలి. 3. వేడినీటిలో పసుపు వేసుకుని ఆవిరిపట్టాలి. 4. వేడినీటిలో అల్లం ముక్కలు ఉడకబెట్టి, కొద్దిగా చక్కెర వేసుకుని తాగాలి. 5. మిరియాలు, ధనియాలు కషాయంగా చేసుకుని తాగాలి.
Read More »పొద్దున లేవగానే టీ తాగుతున్నరా..?
పొద్దున లేవగానే దాదాపు అందరూ టీ తాగుతుంటారు. అయితే టీ.. మీ బరువు పెరుగుదలకు కారణమని తెలుసా? సాధారణంగా కప్పు టీలో 126 కేలరీలు ఉంటాయి. టీలో కలిపే పాలు, చక్కెర వల్ల కేలరీలు పెరుగుతాయి. ఇక రోజులో 1-5 సార్లు చాయ్ తాగే వారి శరీరంలో సుమారు 600 కేలరీలు చేరతాయి. దీంతో బరువు పెరిగి ఊబకాయం బారిన పడతారు. అయితే టీలో పాలు తగ్గించుకుని, బెల్లం వేసుకోవడం …
Read More »పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగాలంటే?
పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగాలంటే? పిల్లలకు రోజూ ఒక ఉడికించిన గుడ్డు తినిపించాలి ఆకుకూరలు, మునక్కాడలు, కొత్తిమీర ఎక్కువగా పెట్టాలి చిన్నారులకు ఇచ్చే ఆహారంలో పసుపు ఉండేలా చూసుకోండి బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, వాల్ నట్స్ వంటివి ఎక్కువ అందించాలి ఫ్రూట్ యోగర్ట్, రైతా రూపంలో పిల్లలు పెరుగు తినేలా చూడండి చాక్లెట్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్న ఎక్కువగా తినిపించకూడదు ముఖ్యంగా పిల్లలు రోజూ తగినంత నిద్రపోయేలా చూడాలి
Read More »ఈ లక్షణాలుంటే రక్తహీనత మీకున్నట్లే..?
రక్తహీనతను తెలియజేసే కొన్ని లక్షణాలను గమనిస్తూ ఉండండి. ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాలు తగ్గితే అలసట వచ్చేస్తుంది. రక్తహీనత, ఐరన్ లోపంతో ఏకాగ్రత లోపిస్తుంది. కండరాలు అలసిపోయి, నొప్పులు వేధిస్తాయి. జ రక్తప్రవాహం, రక్తకణాలు తగ్గడం మూలంగా చర్మం పాలిపోతుంది. మూత్రం గులాబీ లేదా ఎరుపు రంగులోకి మారుతుంది. తరచూ ఇన్ఫెక్షన్లు వచ్చినా రక్తహీనత ఉన్నట్లే. ఈ సమస్యలు కనిపిస్తే.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
Read More »గోంగూరతో లాభాలెన్నో..?
గోంగూరతో రక్త ప్రసరణ మెరుగుపడి రక్తపోటు అదుపులో ఉంటుంది. గోంగూరను తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చు. దీనిలోని విటమిన్ A వల్ల కంటికి సమస్యలు తొలగిపోతాయి. గోంగూరలోని B కాంప్లెక్స్, C విటమిన్లతో దంత సమస్యలు తగ్గుతాయి. గోంగూరలో ఫోలిక్ యాసిడ్, మినరల్స్ అధికం. యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయి. దగ్గు, ఆయాసం, తుమ్ములుంటే గోంగూర సహజ ఔషధంలా పనిచేస్తుంది. రేచీకటి ఉన్నవారు తరచూ గోంగూర తీసుకోవాలి.
Read More »రోగనిరోధకశక్తిని ఇలా పెంచుకోండి
రోజూ ఉదయాన్నే గ్రీన్ టీ తాగాలి రోజూ తేనె తాగడం అలవాటు చేసుకోవాలి విటమిన్ సి ఉన్న పండ్లు, కూరగాయాలు తీసుకోవాలి జీడిపప్పు, బాదం, వేరుసెనగ, ఆవాలు, వెల్లుల్లి, నువ్వులు తినాలి చిలగడదుంపలు తినడం వల్ల దానిలో ఉండే.. బీటాకెరోటిన్ అనే పదార్థం ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతూ ఇమ్యూనిటీని పెంచుతుంది పుట్టగొడుగులను తీసుకోవాలి
Read More »అరటిపండ్లు కవర్లో పెడితే..?
అరటిపండ్లు కవర్లో పెడితే పాడైపోతాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే బయటకు తీసి విడివిడిగా ఉంచాలి. ఆకుకూరలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే పేపర్లో చుట్టి పెట్టాలి. బంగాళదుంపలు చల్లని నీటిలో వేసినట్లయితే వాటి తొక్క సులువుగా ఊడిపోతుంది. కోడిగుడ్లు ఉడికించి తరువాత వాటిని ఒక డబ్బాలో వేసి ఊపాలి. ఇలా చేయడం వల్ల కోడిగుడ్ల పెంకులన్నీ పగులుతాయి.
Read More »ఆలస్యంగా నిద్రపోతే..?
సాధారణంగా ఆలస్యంగా నిద్రపోతే, లేట్ గా మేల్కొంటారు. దీంతో నిద్రను ప్రభావితం చేసే విటమిన్-డి శరీరానికి తగినంత అందదు. విటమిన్-D లోపం డిప్రెషన్కు దారితీస్తుంది. ఇది నిద్ర నాణ్యతపై ఎఫెక్ట్ చూపిస్తుంది. పగటిపూట నిద్రపోవాలనిపించడం డిప్రెషన్ సంకేతాలలో ఒకటి. ఆందోళన, డిప్రెషన్ నిద్రను తగ్గిస్తాయి. వీటికి తోడు.. మైగ్రేన్, ఆర్థరైటిస్ వంటి సమస్యలు వస్తాయి. సో.. స్లీప్ సైకిల్ని సరిగ్గా మేంటేయిన్ చేయండి.
Read More »కివీ పండ్లపై కేంద్రం సంచలన నిర్ణయం
ఇరాన్ నుంచి కివీ పండ్ల దిగుమతిని కేంద్రం నిషేధించింది. తెగుళ్లు సోకిన కివీ పండ్లు దిగుమతి అవుతుండటంతో నిషేధించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి దేశంలోకి వచ్చిన 22 సరుకుల్లో తెగులు ఉన్న పండ్లను గుర్తించినట్లు చెప్పారు. దీంతో కివీ పండ్లను పంపొద్దని ఇరాన్కు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. అయినా ఆ పండ్లు దిగుమతి అవుతుండటంతో నిషేధం విధించినట్లు తెలిపారు.
Read More »మీకు ఐరన్ లోపమా..?
శరీరంలో ఐరన్ లోపముంటే రక్తహీనత వస్తుంది. దీంతో అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. ఐరన్ లోపాన్ని అధిగమించేందుకు కింది పదార్థాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 1. బచ్చలి కూర, పాలకూర 2. అలసందలు 3. బెల్లం 4. ఉసిరికాయ 5. నానబెట్టిన ఎండుద్రాక్ష
Read More »