మహారాష్ట్ర తరహాలోనే తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ నేత సువేందు అధికారి జోస్యం చెప్పారు. మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండేతో కలిసిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, తెలంగాణలోనూ మహారాష్ట్రలో ఉన్నట్లే బుజ్జగింపు రాజకీయాలున్నాయని, ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సువేందు అన్నారు.
Read More »వంట గ్యాస్ సిలిండర్ పై సామాన్యులకు షాక్
డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండ్ ధర మరోసారి పెరిగింది. గృహావసరాల కోసం వినియోగించే 14.2 కేజీల సిలిండర్‌పై రూ.50 పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో రూ.1055గా ఉన్న గ్యాస్ బండ ధర రూ.1105కు చేరింది. ఢిల్లీలో రూ.1003గా ఉన్న సిలిండర్ ధర రూ.1053కు చేరింది. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి అదేవిధంగా ఐదు కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.18 పెరిగింది. అయితే …
Read More »సీఎం షిండేకు ఆయన సతీమణి లతా వినూత్నంగా స్వాగతం
మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏక్‌నాథ్ షిండే తొలిసారి థానేలోని తన నివాసానికి వెళ్ళిన ఆయనకు గ్రాండ్‌గా వెల్కమ్ దక్కింది. డ్రమ్స్‌తో ఆయనకు స్వాగతం పలికారు. అయితే ఆయన భార్య లతా ఏక్‌నాథ్ షిండే బ్యాండ్ వాయిస్తూ భర్తకు వెల్కమ్ చెప్పింది. స్వంత ఇంటికి సీఎం ఏక్‌నాథ్ వస్తున్న నేపథ్యంలో ఆయన నివాసం వద్ద బ్యాండ్‌ను సెటప్ చేశారు. ఈ సందర్భంగా ఏక్‌నాథ్ సతీమణి లతా కూడా బ్యాండ్ …
Read More »కేరళ సీఎం ను తుపాకీతో కాల్చేస్తా-మాజీ ఎమ్మెల్యే సతీమణి ఉషా
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను తుపాకీతో కాల్చేస్తాని ఆ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జి సతీమణి ఉషా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త అయిన జార్జిని లైంగిక వేధింపుల కేసులో అరెస్టు చేయడం వెనుక సీఎం విజయన్ హస్తం ఉంది. అందుకే ఆయనను తుపాకీతో కాల్చేస్తానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. లైంగిక ఆరోపణల కేసులో జార్జిని మొన్న శనివారం పోలీసులు అరెస్టు చేశారు.. …
Read More »ప్రధాని మోదీ ప్రశంసలు అందుకోవడం నాకు గర్వం –
ప్రధానమంత్రి నరేందర్ మోదీ తనను ప్రశంసించడం పట్ల టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ ఉబ్బితబ్బిబవుతోంది. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీని ‘భారత క్రికెట్‌కు రెండు దశాబ్దాలు సేవ చేశావు. ఎంతో ప్రతిభ ఉంటే తప్ప ఇది సాధ్యంకాదు. నీ ప్రతిభా సామర్థ్యాలు ఔత్సాహిక క్రీడాకారులకు స్ఫూర్తినిస్తాయి’ అని ప్రధాని కొనియాడారు. దీనికి రాజ్ స్పందిస్తూ ‘నాతోపాటు లక్షలాది మందికి మార్గదర్శకంగా నిలిచే ప్రధానినుంచి ఆ ప్రశంసలు అందుకోవడం …
Read More »BJP కి చుక్కలు చూయిస్తున్న TRS Social Media
తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చిన సందర్భంలో నిన్న శనివారం సాయంత్రానికి ట్విటర్ ట్రెండింగ్‌లో ‘మోదీ మస్ట్ అన్సర్’ హ్యాష్‌ట్యాగ్ నంబర్ వన్‌గా నిలిచింది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా రాక సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానాలు చెప్పాలంటూ ‘మోదీ మస్ట్ ఆన్సర్’ హ్యాష్‌ట్యాగ్‌తో పెద్దఎత్తున పోస్టులు చేశారు. గంట సమయంలోనే 60వేలకు …
Read More »శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కి బంపర్ ఆఫర్
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ముగిసిపోయిందనుకున్న దానికి సంబంధించిన మరికొన్ని రాజకీయ ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. గువహటిలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని రెబెల్ గ్రూపులోకి రావాలని తనకూ ఆఫర్ ఇచ్చినా తాను తిరస్కరించానని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వెల్లడించారు. తాను బాలాసాహెబ్ ఠాక్రే అనుయాయుడని చెబుతూ ఆ ప్రతిపాదనను తోసిపుచ్చానని చెప్పారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని అందుకే తాను ఈడీ ఎదుట ఆత్మవిశ్వాసంతో విచారణకు హాజరయ్యానని రౌత్ …
Read More »ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ సవాల్
రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలంగాణ పర్యటన సందర్భంగా హైదరాబాద్ మహనగరంలోని జలవిహార్‌లో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ప్రస్తుత ప్రధాన మంత్రి మోదీ ఈరోజు రాష్ట్రానికి వస్తున్నారు. మరో రెండు రోజులు పాటు ఉండి …
Read More »నాకో లవ్ లెటర్ అందింది-శరద్ పవార్
మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ పడిపోయిన రోజే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఐటీ నోటీసులు వచ్చాయి. నిన్న రాత్రి తనకు ఆదాయపు పన్ను విభాగం నుంచి నోటీసులు అందాయని ఆయన తన అధికారక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ‘నాకో లవ్ లెటర్ అందింది. 2004, 09, 14, 20 ఎన్నికల్లో నేను సమర్పించిన అఫిడవిట్లకు సంబంధించి ఐటీ నుంచి ప్రేమ లేఖ వచ్చింది’ అని తెలిపారు. కేంద్రానికి …
Read More »నేటి నుండి ప్లాస్టిక్ వాడితే 5 ఏళ్ల జైలు & రూ. లక్ష వరకు జరిమానా
దేశంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ రోజు అంటే జులై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 50మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ ను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటారు. కేంద్ర సర్కారు విధించిన నియమ నిబంధనలను ఉల్లంఘించిన వారికి 1986 ఎన్వరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 5 ఏళ్ల …
Read More »