తమిళనాడులో ఐటీ శాఖ (ఆదాయపు పన్ను) దాడులు కలకలం సృష్టించాయి. ఆ రాష్ట్ర విద్యుత్, అబ్కారీ మంత్రి సెంథిల్ బాలాజీ నివాసంతోపాటు 40 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నై , కరూర్ , కోయంబత్తూర్ తోపాటు వివిధ ప్రాంతాల్లోని ఆయన కార్యాలయాలు, ఆస్తులపై అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మంత్రి దగ్గరి బంధువులు, పలువురు కాంట్రాక్టర్ల ఇండ్లలో కూడా సోదాలు చేస్తున్నారు.
Read More »సీఎం స్టాలిన్ కు సీఎం కేసీఆర్ ఫోన్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తమిళ నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి,డీఎంకే అధినేత ఎం.కే. స్టాలిన్ కు ఫోన్ చేశారు. మంగళవారం ఫోన్ చేసిన సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి స్టాలిన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయురారోగ్యాలు,సుఖసంతోషాలతో కలకాలం జీవించాలని.. కోరుకున్న లక్ష్యాలను సాధించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.ఈ సందర్భంగా తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ కు ముఖ్యమంత్రి స్టాలిన్ కృతజ్ఞతలు తెలిపారు.
Read More »“కలైంజర్” కరుణానిధి కన్నుమూత..
తమిళనాడు మాజీ సీఎం ,డీఎంకే అధినేత కలైంజర్ కరుణానిధి గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెల్సిందే.. దీంతో ఆయన చెన్నై నగరంలోని కావేరి ఆసుపత్రిలో దాదాపు పదకొండు రోజులుగా చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు.ఈరోజు మంగళవారం సాయంత్రం ఆరు గంటల పదినిమిషాలకు తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి..
Read More »కరుణానిధి ఆరోగ్యం అత్యంత విషమం..అప్రమత్తమైన పోలీసులు
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని చెబుతున్న కావేరి ఆసుపత్రి వైద్యులు మంగళవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వెల్లడించారు. అవసరమైన వైద్యం అందించినా ఆయన ఆరోగ్యం మెరుగుపడటం లేదని పేర్కొన్నారు. దీంతో కరుణానిధి అభిమానులు, డీఎంకే …
Read More »