తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అత్యంత జటిలంగా మారిన హైకోర్టు విభజన ఎట్టకేలకు సాకారమైంది. నాలుగున్నరేండ్లుగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, టీఆర్‌ఎస్ ఎంపీలు, తెలంగాణ న్యాయాధికారులు, న్యాయవాదులు, ఉద్యోగులు చేస్తున్న పోరాటం ఫలించింది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలోనే హైకోర్టును విభజిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా హైకోర్టు ఉండాలని చెప్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 214తోపాటు, ఏపీ పునర్విభజన చట్టం-2014 ప్రకారం …
Read More »