ఏలూరు జిల్లాలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ.25లక్షల పరిహారం అందజేయనుంది. ఫ్యాక్టరీ యాజమాన్యం తరఫున పరిహారం అందిస్తామని మంత్రి తానేటి వనిత చెప్పారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన బాధితుల్ని ఆంధ్రా హాస్పిటల్‌లో మంత్రి పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పోరస్‌ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చాలా బాధాకరమని.. బాధితుల పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఘటనపై విచారణకు ఆదేశించామని.. అవసరమైతే ఫ్యాక్టరీని …
Read More »DMK MP ఇళంగోవన్ కుమారుడు రాకేష్ రోడ్డు ప్రమాదంలో మృతి
తమిళనాడు రాష్ట్ర అధికార పార్టీ అయిన డీఎంకే రాజ్యసభ సభ్యుడు ఇళంగోవన్ కుమారుడు రాకేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పుదుచ్చేరి నుంచి చెన్నై వస్తుండగా కారు అదుపుతప్పి డివైడరు ఢీకొట్టింది. ప్రమాదంలో రాకేష్ అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇళంగోవన్ తమిళనాడు సీఎం ఎం.కే స్టాలిన్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన కుమారుడి మరణవార్త తెలియడంతో సీఎం సహా పార్టీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం …
Read More »ఉక్రెయిన్ లో చనిపోయిన నవీన్ గురించి బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్లో చనిపోయిన నవీన్ మృతదేహం తరలింపుపై కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యుద్ధ ప్రాంతం నుంచి బతికున్న వారిని తీసుకురావడం సవాల్ తో కూడుకున్న పని అని, మృతదేహాన్ని తేవడం ఇంకా కష్టమని చెప్పాడు. విమానంలో మృతదేహం ఎక్కువ స్థలం ఆక్రమిస్తుందని, ఆ ప్లేసులో 10 మంది కూర్చోవచ్చంటూ పేర్కొన్నాడు. గత 4 రోజులుగా నవీన్ డెడ్ బాడీ కోసం కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు.
Read More »సూపర్ స్టార్ కృష్ణ ఇంట్లో విషాదం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు ,సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడైన రమేష్ బాబు (56) అనారోగ్యంతో మృతి చెందారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనని హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రమేశ్‌బాబు మృతి చెందినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు. రమేష్ బాబు మృతితో టాలీవుడ్ …
Read More »దర్శకుడు KS సేతుమాధవన్ (90) కన్నుమూత
దక్షిణ భారత ప్రముఖ దర్శకుడు KS సేతుమాధవన్ (90) కన్నుమూశారు. వయో సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చెన్నైలోని నివాసంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1961లో మలయాళంలో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 60కి పైగా చిత్రాలను తెరకెక్కించారు. ఇక తెలుగులో 1995లో వచ్చిన ‘స్త్రీ’ సినిమాను సేతుమాధవన్ డైరెక్ట్ చేశారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు.
Read More »డాక్టర్ రాజశేఖర్‌కి పితృవియోగం
యాంగ్రీ హీరోగా టాలీవుడ్‌లో టాప్ క్రేజ్ తెచ్చుకున్న డాక్టర్ రాజశేఖర్‌కి పితృవియోగం కలిగింది.రాజశేఖర్ తండ్రి వరదరాజన్ గోపాల్(93) సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న గోపాల్ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.వరదరాజన్ గోపాల్ చెన్పై డీసీపీగా రిటైర్ అయ్యారు. వరదరాజ గోపాల్‌కు ఐదుగురు సంతానం కాగా.. ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హీరో రాజశేఖర్, వరదరాజన్ గోపాల్‌కు రెండో సంతానం.శుక్రవారం ఉదయం …
Read More »ఉత్తేజ్ ఇంట విషాదం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం నెలకొంది. ఉత్తేజ్ భార్య పద్మావతి అనారోగ్యంతో కన్నుమూశారు. బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. ఉత్తేజ్ కి చెందిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నిర్వహణలో ఆమె కీలకంగా వ్యవహరించేవారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్, ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉత్తేజ్- పద్మావతి దంపతులకు చేతన, పాట అనే ఇద్దరు పిల్లలున్నారు.
Read More »బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి కన్నుమూత
ఏపీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ చెన్నై అపోలో ఆస్పత్రిలో మృతి చెందగా.. ఆయన మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం తెలియజేశారు. ‘రామచంద్రారెడ్డి సిద్ధాంతాలకు కట్టుబడిన నేత. ఆయనతో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. రామచంద్రారెడ్డి కుటుంబసభ్యులకు నా సానుభూతి’ అని వెంకయ్యనాయుడు అన్నారు. అటు సోమువీర్రాజు కూడా సంతాపం తెలియజేశారు.
Read More »మాజీ ఎంపీ మాగంటి బాబు ఇంట్లో మరో విషాదం
ఏపీకి చెందిన మాజీ ఎంపీ మాగంటి బాబు ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన రెండో కుమారుడు రవీంద్ర నాథ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హైదరాబాద్-బంజారాహిల్స్ రోడ్ నం.2లోని హయత్ ప్లాజాలో చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. రవీంద్రనాథ్ను అపోలోకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతికి కారణాలు తెలియలేదు. కాగా ఇటీవలే మాగంటి పెద్ద కుమారుడు రాంజీ అనారోగ్యంతో మృతి చెందారు.
Read More »రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఎం.నరసింహం (94) కన్నుమూత
భారతీయ బ్యాంకింగ్ సంస్కరణల పితామహుడు, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఎం.నరసింహం (94) కన్నుమూశారు. కరోనాతో హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు RBI ప్రతినిధి ఒకరు తెలిపారు. 1977 మే నుంచి నవంబర్ మధ్య నరసింహం RBI గవర్నర్ బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందు ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. వరల్డ్ బ్యాంక్, IMFలో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించారు.
Read More »