తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత,సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. అందుకే బీజేపీ కార్యకర్తలపై దాడులు, నాయకులపై తప్పుడు కేసులు పెడుతూ కేసీఆర్ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడని వ్యాఖ్యానించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా… టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజానీకం బంగాళాఖాతంలో కలపడం ఖాయమని విజయశాంతి హెచ్చరించారు
Read More »TRSలో చేరిన BJP నేతలు
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలానికి చెందిన 50 మంది బీజేపీ నాయకులు శుక్రవారం రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. నిజామాబాద్‌లోని ఎమ్మెల్యే ఇంటిలో నిర్వహించిన కార్యక్రమంలో వారికి టీఆర్‌ఎస్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
Read More »బీజేపీ నేతలపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అభివృద్ధిపై భాజపా నేతలు దేవాలయాల్లో ప్రమాణాలు ఆపేసి అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అభినందిస్తుందే తప్ప… పైసా సాయం చేయలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని కోరినా కేంద్రం పెడచెవిన పెట్టిందన్నారు.
Read More »నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలలో భారీ మెజారిటీయే లక్ష్యం
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలలో భారీ మెజారిటీయే లక్ష్యం… జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో సమావేశాలు..నియోజకవర్గాల వారీగా నేతలకు భాద్యతలు. మాజీ ఎంపీ కవిత అభ్యర్థిత్వానికి మద్దతుగా, టీఆర్ఎస్ వైపు నిలుస్తున్న కాంగ్రెస్, బీజేపీ ల స్థానిక ప్రజాప్రతినిధులు పోలింగ్ నాటికి 90% ఓటర్లు టీఆర్ఎస్ వైపు ఉండే అవకాశం… అక్టోబర్ 9 న జరగనున్న నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందేందుకు పకడ్బందీ వ్యూహం రచించింది …
Read More »