తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్న బీజేపీని తామే ఓడిస్తామని ఏఎంఐఎం అధినేత..హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. తెలంగాణలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని తన పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సారి ఎక్కువ సీట్లలో పోటీ చేయబోతున్నట్లు ఓవైసీ వెల్లడించారు. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి.. బీజేపీ విస్తరించాలని ప్లాన్ వేస్తోందని ఆరోపించారు. తాము కర్ణాటక, రాజస్థాన్లో పోటీ చేస్తామని …
Read More »నిజామాబాద్‌లో పసుపు బోర్డు పెట్టేదిలేదు- కేంద్ర ప్రభుత్వం
తెలంగాణలో నిజామాబాద్‌లో పసుపు బోర్డు పెట్టేదిలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇప్పటికే ఏర్పాటుచేసిన సుగంధ ద్రవ్యాల (స్పైసెస్) బోర్డు రీజినల్ ఆఫీస్‌తో సరిపెట్టుకోవాలని సూచించింది. దేశంలోనే అత్యధికంగా పసుపు పండిస్తున్న తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయంచేసింది. వంద రోజుల్లో బోర్డు సాధిస్తామంటూ ఓట్లు దండుకొని.. గెలిచిన తర్వాత మాయమాటలు చెప్తూ మభ్యపెడుతున్న ఎంపీ ధర్మపురి అర్వింద్, రాష్ట్ర బీజేపీ నేతల బండారం పార్లమెంట్‌సాక్షిగా బట్టబయలైంది. వారివన్నీ బోగస్ హామీలని తేలిపోయింది. …
Read More »టీఆర్ఎస్ లోకి వలసలు
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. జిల్లాలోని ఆర్మూరు మండలానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఇరు పార్టీలకు చెందిన నాయకులు గులాబీ కండువా కప్పుకున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లుగా వారు తెలిపారు
Read More »బీజేపీలో పావులు కదుపుతున్న బండి సంజయ్ వర్గం
తెలంగాణ బీజేపీలో ఆధిపత్య రాజకీయాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. రాష్ట్ర బీజేపీ మీద పట్టుకోసం బండి వర్గం – కిషన్ రెడ్డి వర్గం నువ్వా నేనా పావులు కదుపుతున్నారు. తెలంగాణ అధికారంలోకి వస్తే కిషన్ రెడ్డి తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు చేసిన వ్యాఖ్యలు పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలకు అద్దం పడుతోంది. మరోవైపు రాజా సింగ్ బండి సంజయ్ వర్గంలో చేరడంతో చలికాలంలో …
Read More »తెలంగాణ బీజేపీ రథసారధి ఎవరు..?
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధినేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే డా. కే లక్ష్మణ్ ను త్వరలోనే ఈ పదవీ నుండి తప్పించనున్నారా..?. ఈ పదవీలో కొత్తవార్ని నియమించనున్నారా..?. అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ జాతీయ వర్గాలు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ పార్టీ అధినేతగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. మరో వారం పదిరోజుల్లో ఎవరనేది బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధినేత ఎవరన్నదే ప్రకటిస్తారు అని …
Read More »