ఈ మధ్య ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. రైలు ప్రమాధాలు, రోడ్డు ప్రమాధాలు మరి ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా మరో ఘోర ప్రమాదం జరిగింది. ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్ వేపై కన్నౌజ్ సమీపంలో ఓ బస్సు 9 మంది విద్యార్థుల పైకి దూసుకెళ్లింది. ఈ విషాద ఘటనలో 6 మంది చిన్నపిల్లలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. .. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి …
Read More »కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం..కుటుంబంలో ముగ్గురు అక్కడిక్కడే
మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేమనడానికి కర్నూలు జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదమే నిదర్శనం. కర్నూలు నగరానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ శివభూషణం, అతని భార్య సుక్కలమ్మలు డ్రైవర్ ఎస్.వెంకటరమణతో కలిసి కర్నూలు వైపు కారులో వస్తున్నారు. అలాగే హైదరాబాద్ నుంచి మైసూరుకు నలుగురితో వెళుతున్న మరో కారుకి కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామశివారులోని 44వ నంబరు జాతీయ రహదారి వద్ద టైరు …
Read More »చిత్తూరు జిల్లా ఇసుక తవ్వకాల్లో విషాదం
మరుగుదొడ్ల నిర్మాణాలకు ఇసుక తవ్వకాలు చేపడుతుండగా మట్టి పెళ్లలు పడి ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతిచెందిన సంఘటన చిత్తూరు జిల్లా పుంగునూరు మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని చెదళ్ళ చెరువులో ఇటీవల ఇసుక తవ్వకాలను చేపట్టారు. ఈ సమయంలో ఒక్కసారిగా పై నుంచి మట్టి పెళ్లలు పడటంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. వారిపై మట్టి పెళ్లలు ఎక్కువగా పడటంతో జెసిబి సాయంతో …
Read More »ఘోరం… 9 మంది విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు
పంజాబ్‌లో ఘోరం జరిగింది. భటిండా జిల్లా బుచోమండి వద్ద రోడ్డుపక్కన ఉన్న యువకులపైకి లారీ దూసుకెళ్లింది. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. పలువురికి గాయాలయ్యాయి. ఉదయం 8.15 గంటల సమయంలో జరిగినట్టు తెలుస్తోంది. దట్టంగా అలుముకున్న పొగమంచు.. వాహన డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. కళాశాల, కోచింగ్ క్లాస్‌లకు వెళ్తున్న విద్యార్థుల బస్సులో సాంకేతికలోపం తలెత్తడంతో ఆగిపోయింది. …
Read More »మృతదేహాలు కనిపించాగానే బాధితుల బంధువుల రోదనలు
సరదాగా బంధువుల ఇంటికి వచ్చి ప్రమాదవశాత్తు నీట మునిగి నలుగురు బాలలు, ఒకవ్యక్తి విగతజీవులయ్యారు. మృతులందరూ హైదరాబాద్‌కు చెందినవారు. సోమవారం కొప్పళజిల్లా గంగావతి తాలూకా హేమగుడ్డ శ్రీ దుర్గా పరమేశ్వర దేవాలయం వద్దనున్న చెరువులో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులను ప్రవల్లిక (16), పవిత్ర (15), పావని (14), రాఘవేంద్ర (32), ఆశిష్ (15)లుగా గుర్తించారు. గౌరి పౌర్ణమికి వచ్చి : వివరాలు… ప్రతి ఏడాది గౌరి పౌర్ణమి సందర్భంగా …
Read More »దాని దెబ్బకు సొరంగం కుప్పకూలి.. 200 మంది మృతి!
ప్రపంచ దేశాల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ.. ఉత్తర కొరియా ఇటీవల హైడ్రోజన్ బాంబును పరీక్షించిన సంగతి తెలిసిందే. హైడ్రోజన్ బాంబు పరీక్ష సందర్భంగా సమీపంలోని ఓ సొరంగం కుప్పకూలి.. 200 మంది చనిపోయినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉత్తర కొరియా ఈశాన్య ప్రాంతమైన పంగ్యే-రీ ప్రాంతంలో గత నెల కిమ్ జాంగ్ ఉన్ సర్కారు హైడ్రోజన్ అణుబాంబు పరీక్షించింది. కొరియా చేపట్టిన ఆరో అణ్వాయుధ పరీక్షల్లో భాగంగా సెప్టెంబర్ 3న …
Read More »విజయవాడలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి జనం మీదికి
విజయవాడలో శుక్రవారం ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు అదుపు తప్పి జనం మీదికి దూసుకుపోవడంతో ముగ్గురు దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గవర్నర్‌పేట డిపోకు చెందిన ఆర్టీసీ నంబరు ఏపీ 16జెడ్ 6604 సిటీ బస్సు వేగంగా దూసుకొచ్చి నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై మాచవరం వెళుతున్న మైలవరానికి చెందిన తల్లీకూతుళ్ళు షేక్ ఖుర్షీద్ బేగం …
Read More »ఘోర ప్రమాదం 47 మంది సజీవ దహనం
ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించి 47 మంది సజీవ దహనమయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం ఉదయం 9 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జకార్తా సమీపంలోని తంగెరాంగ్ ప్రాంతంలో గల ఓ బాణసంచా ఫ్యాక్టరీలో గురువారం ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి భవనమంతా వ్యాపించాయి. ఈ ఘటనలో 47 మంది సజీవ దహనమయ్యారు. …
Read More »ఏపీలో ఆ వ్యాధితో 35 మంది మృతి చెందగా..1000 మంది బాధితులు…జాగ్రత్త
ఏపీలో విషజ్వరాల బెడదతో పలువురు మరణిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక నెల వ్యవధిలో డెంగీ వ్యాధి కారణంగా ముప్పై ఐదు మంది మరణించారని చెబుతున్నారు.వేలాది మంది అనారోగ్యం పాలవుతున్నారని, ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని సమచారం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 200కు పైగానే డెంగీ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ గుర్తించింది. ప్రభుత్వ దృష్టికి రానివి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరిగణనలోకి తీసుకుంటే సుమారు 1000 …
Read More »