దేశ రాజధాని మహానగరం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్టు చేసింది. ఇటీవల అతన్ని ఈడీ రెండు రోజుల పాటు ప్రశ్నించింది. రాబిన్ డిస్టలరీస్ పేరిట సౌత్ గ్రూప్ నుంచి మనీలాండరింగ్ కు పాల్పడినట్లు పిళ్లైపై ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఇప్పటివరకు ఈ కేసులో 11 మంది అరెస్టు అయ్యారు.
Read More »డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్ కు అసలు కారణం ఇదే- సీబీఐ
లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను నిన్న ఆదివారం అరెస్ట్ చేయడంపై సీబీఐ స్పందించింది. ఉప ముఖ్యమంత్రి అయిన మనీష్ సిసోడియా విచారణకు సహకరించలేదు.. తాము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేశారని తెలిపింది. తాము సేకరించిన ఆధారాలపై ప్రశ్నించాము.. అయితే వాటికి సరైన సమాధానం చెప్పని నేపథ్యంలో సిసోడియాను అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. కాగా, నేడు ప్రత్యేక కోర్టులో …
Read More »ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు – వైసీపీ ఎంపీ తనయుడు అరెస్ట్
దేశ రాజధాని మహానగరం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో అరెస్ట్ నమోదైంది. ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కుమారుడు రాఘవ్ రెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. రాఘవ్ రెడ్డిని మధ్యాహ్నం కోర్టులో అధికారులు హాజరుపరచనున్నారు. కాగా ఇటీవల హైదరాబాద్ నగరానికి చెందిన సీఏ బుచ్చిబాబు, గౌతమ్ మల్హోత్ర సహా పలువురిని అరెస్ట్ చేశారు.
Read More »ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సంబంధం గురించి ఎమ్మెల్సీ కవిత క్లారిటీ.?
దేశవ్యాప్తంగా కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శంచారు. రంగారెడ్డి ఎలిమనేడులో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి నాలుగు రోజులుగా సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో పాటు కవిత యాగానికి హాజరయ్యారు. అనంతరం విలేకరులతో కవిత మాట్లాడారు. బీజేపీ తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. తాను మానసికంగా కుంగిపోతానని అనుకుంటున్నారన్నారు. బట్టకాల్చిమీద వేయడం బీజేపీ పని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇది ఆరోగ్యక పరిణామం కాదన్నారు. బిల్కిస్ …
Read More »