దేశ రాజధాని మహానగరం ఢిల్లీ ప్రభుత్వ దవాఖాన టెండర్ స్కామ్‌లో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్‌ను వెంటనే తొలగించడమో, సస్పెన్షనో చేయాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్‌ను కోరారు. ఈ మేరకు ఆయన ఎల్జీకి దానికి సంబంధించిన నివేదికను పంపారు. ఒక ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్ కోసం ప్రభుత్వానికి చెందిన ఐఎల్‌బీఎస్ దవాఖాన నుంచి సీఎస్ నరేష్ కుమార్ కుమారుడు కరణ్ చౌహాన్‌కు చెందిన మెటామిక్స్ కంపెనీ ఎలాంటి …
Read More »కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీ సర్కారు ఉద్యోగులకు బంపర్ ఆఫర్
దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది ఢిల్లీ ప్రభుత్వం. ఉద్యోగులకు ఈఎంఐ పద్ధతిలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను అందించాలని నిర్ణయించింది. ఈ స్కీమ్ తొలి దశలో టూ వీలర్ వాహనాలను అందించనుంది. తొలుత ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను కొనుగోలు చేసిన పదివేల మంది ఉద్యోగులకు రూ.5 వేల చొప్పున ఇన్సెంటివ్ అందిస్తామని ఢిల్లీ సర్కారు వెల్లడించింది. దీంతోపాటు మొదటి వెయ్యి ఎలక్ట్రిక్ …
Read More »ఢిల్లీ రాష్ట్రంలో ఉచిత రేషన్ పథకం పెంపు
ఢిల్లీ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి విస్తృతమవుతున్న నేపథ్యంలో ఉచిత రేషన్ పథకాన్ని మరో 6 నెలలు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ సీఎం అర్వింద్ కేజీవాల్ తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి బూస్టర్ డోసుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కాగా, ఢిల్లీలో ఇప్పటివరకు 26 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
Read More »ఢిల్లీ సర్కారు మరో సంచలన నిర్ణయం
లాక్డౌన్ విధింపుతో ఉపాధికి దూరమైన నిర్మాణ రంగ కూలీలను ఆదుకునేందుకు ఢిల్లీ సర్కారు ముందుకొచ్చింది. రిజిస్టర్ అయిన కూలీలకు రూ. 5,000 చొప్పున ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించింది. ఢిల్లీలో ఇప్పటివరకు 1,71,861 మంది నిర్మాణ కూలీలు రిజిస్టర్ అయ్యారు. వీరికి రూ. 5,000 సాయం అందనుంది. ఇక రాష్ట్రంలోని వలస కూలీలకు వసతి, వైద్యం, భోజనం లాంటి సౌకర్యాలను పర్యవేక్షించేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేసింది.
Read More »