ఢిల్లీ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి విస్తృతమవుతున్న నేపథ్యంలో ఉచిత రేషన్ పథకాన్ని మరో 6 నెలలు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ సీఎం అర్వింద్ కేజీవాల్ తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి బూస్టర్ డోసుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కాగా, ఢిల్లీలో ఇప్పటివరకు 26 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
Read More »ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ వరాల జల్లు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ఉత్తరాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. 18 ఏళ్లు దాటిన మహిళలందరికీ ప్రతి నెలా రూ.1,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ‘నేను నాయకుడిని కాదు. రాజకీయాలు ఎలా చేయాలో నాకు తెలీదు. పని ఎలా చేయాలో మాత్రమే తెలుసు. ఢిల్లీలో 10 లక్షల మందికి ఉద్యోగాలిచ్చాం. ఇక్కడ కూడా అదే విధంగా చేస్తాం’ అని తెలిపారు.
Read More »సీఎం అరవింద్ కేజీవాల్ మహిళలపై హామీల వర్షం
గోవా ప్రచార సభలో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్ మహిళలపై హామీల వర్షం కురిపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ను గెలిపిస్తే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.వెయ్యి ఇస్తామని ప్రకటించారు. అలాగే గృహ ఆధార్ స్కీం కింద ఇస్తున్న రూ.1500లను రూ.2500కు పెంచనున్నట్లు ఆయన తెలిపారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా సాధికార పథకంగా నిలుస్తుందని కేజీవాల్ అన్నారు.
Read More »హ్యాపీ బర్త్‌డే.. మోదీ జీ- ట్విట్టర్లో రాహుల్ గాంధీ
ప్రధాని నరేంద్ర మోదీకి ఇవాళ 71 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా ఆయనకు బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా గ్రీట్ చేశారు. హ్యాపీ బర్త్‌డే, మోదీజీ అంటూ రాహుల్ తన ట్విట్టర్‌లో తెలిపారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా మోదీకి బర్త్‌డే విషెస్ చెప్పారు. సుదీర్ఘ కాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.
Read More »ఢిల్లీలో బయటపడిన బ్రిటీషర్లు వాడిన సొరంగ ( Tunnel ) మార్గం
దేశ రాజధాని ఢిల్లీలో బ్రిటీషర్లు వాడిన సొరంగ ( Tunnel ) మార్గం ఒకటి బయటపడింది. ఢిల్లీ అసెంబ్లీలో ఆ టన్నెల్‌ను గుర్తించారు. అసెంబ్లీ నుంచి ఎర్రకోటకు ఆ టన్నెల్ దారితీసినట్లు భావిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధులను తరలించేందుకు ఆ సొరంగాన్ని బ్రిటీషర్లు వాడినట్లు తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ నుంచి ఎర్రకోట వద్దకు ఆ సొరంగ మార్గం ఉన్నట్లు గుర్తించారు. దేశాన్ని బ్రిటీషర్లు పాలించిన సమయంలో ఆ మార్గం ద్వారా ఫ్రీడమ్ …
Read More »మోదీకి ఢిల్లీ సీఎం క్రేజీ ఫంచ్
దేశంలో వ్యాక్సినేషన్ కొరతపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం ఎందుకు టీకాలు కొనడం లేదని ప్రశ్నించారు. ఒకవేళ పాకిస్తాన్ దేశంపై దాడులు చేస్తే, రక్షించుకునే బాధ్యతను కూడా రాష్ట్రాలకే వదిలేస్తారా? సొంతంగా యుద్ధ ట్యాంకులు కొనుక్కోమని అంటారా? అంటూ మండిపడ్డారు. ఇతర దేశాల లాగా కాకుండా దేశంలో 6 నెలలు ఆలస్యంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని విమర్శించారు.
Read More »ఢిల్లీ సీఎం సంచలన నిర్ణయం
కొవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు ఢిల్లీ సర్కారు ముందుకొచ్చింది. ఆ పిల్లల చదువులకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని CM అరవింద్ కేజీవాల్ వెల్లడించారు. తాము అనాథలమని బాధపడకూడదని, మీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. కరోనా వల్ల ఇంట్లో సంపాదించే వ్యక్తిని కోల్పోయిన కుటుంబాలకూ ఆర్థికంగా అండగా ఉంటామని తెలిపారు.
Read More »ఢిల్లీ సర్కారు మరో సంచలన నిర్ణయం
లాక్డౌన్ విధింపుతో ఉపాధికి దూరమైన నిర్మాణ రంగ కూలీలను ఆదుకునేందుకు ఢిల్లీ సర్కారు ముందుకొచ్చింది. రిజిస్టర్ అయిన కూలీలకు రూ. 5,000 చొప్పున ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించింది. ఢిల్లీలో ఇప్పటివరకు 1,71,861 మంది నిర్మాణ కూలీలు రిజిస్టర్ అయ్యారు. వీరికి రూ. 5,000 సాయం అందనుంది. ఇక రాష్ట్రంలోని వలస కూలీలకు వసతి, వైద్యం, భోజనం లాంటి సౌకర్యాలను పర్యవేక్షించేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేసింది.
Read More »ఢిల్లీలో 7రోజులు లాక్‌డౌన్
దేశరాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఈరోజు నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ లాక్‌డౌన్ ఈ రోజు(సోమవారం) రాత్రి 10 గంటల నుంచి వచ్చే సోమవారం అంటే ఏప్రిల్ 26 ఉదయం 6 గంటల వరకూ కొనసాగనుంది. కరోనా చైన్ తెగ్గొట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఢిల్లీ సర్కారు వెల్లడించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈరోజు ఉదయం …
Read More »మోసపోయిన ఢిల్లీ సీఎం కూతురు
సైబర్ నేరగాడి చేతిలో ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్ కూతురు హర్షిత మోసపోయింది. ఓ ఈ కామర్స్ సైట్లో పాత సోఫాను అమ్మకానికి పెట్టగా, ఓ వ్యక్తి ఆమెను సంప్రదించాడు. QR కోడ్ పంపించి, దాన్ని స్కాన్ చేస్తే తాను ఇవ్వాల్సిన మొత్తం అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అవుతుందని నమ్మించాడు. అలా చేయగానే హర్షిత ఖాతా నుంచి రూ.20 వేలు మాయమయ్యాయి. అది తప్పు కోడ్ అని, సరైన కోడ్ …
Read More »