ఏపీలోని కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు, టీడీపీ సీనియర్ నాయకుడు సంపతి ధనారెడ్డి(68) మంగళవారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కర్నూలులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన పార్థివ దేహాన్ని స్వగృహానికి తరలించారు.ఈ విషయం తెలిసిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ మైనార్టీ …
Read More »ఘోర రోడ్డు ప్రమాదం..బైక్‌ను కారు ఢీకొట్టడంతో… ఫ్లై ఓవర్‌పై నుంచి కింద పడి
కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. బైక్‌ను కారు ఢీకొట్టడంతో ఇద్దరు ద్విచక్రవాహనదారులు వంతెనపైనుంచి పడి మృతి చెందారు. ఈ ఘటన బొమ్మనహళ్లి సమీపంలోని గారేబావి పాళ్య వద్ద శనివారం చోటు చేసుకుంది. మడివాళ ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు… మహ్మద్ హుసేన్(36), ఫకృద్ధీన్(34) అనే వ్యక్తులు శనివారం మడివాళ వైపు నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వైపు బైక్‌లో వెళ్తుండగా భారీ వర్షం …
Read More »ఆర్మీలో భర్త నిండునూరేళ్లు బతకాలని భార్య ఉపవాసం….
ఆర్మీలో పనిచేస్తున్న తన భర్త నిండునూరేళ్లు బతకాలని కర్వా చౌత్ పర్వదినాన ఉపవాసం చేసింది దేవి. కానీ ఆమె ఉపవాసం విడవకముందే అమరుడయ్యాడు భర్త. ఉగ్రమూకల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి కొనవూపిరితో ఉన్నప్పటికీ భార్యకు ఫోన్ చేసి ‘నువ్వు ఉపవాసం విడిచి ఏదన్నా తిను. నేను డ్యూటీకి వెళుతున్నాను. ఉదయం మాట్లాడతాను’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఈ బాధాకర ఘటన ఉత్తర కశ్మీర్‌లో చోటుచేసుకుంది. కంగ్ర ప్రాంతానికిచెందిన సుబేదార్ …
Read More »తెలుగు యాంకర్ మృతి
ప్రముఖ యాంకర్ మల్లిక అనారోగ్యంతో ఇవాళ మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లిక చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘రాజకుమారుడు’ సహా పలు చిత్రాల్లో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. 1997-2004 మధ్యకాలంలో పలు టెలివిజన్ ఛానళ్లలో ప్రసారమైన కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఉత్తమ యాంకర్‌గా అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. వివాహానంతరం నటనకు దూరమయ్యారు. నేడు ఆమె …
Read More »ఏపీలో ఘోర రోడ్డుప్రమాదం..
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాలను బలితీసుంది మరో వ్యక్తి చావుబతుకుల్లో ఉన్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కొయ్యలగూడెం సమీపంలోని బ్రహ్మాల కాలనీ వద్ద బైక్‌ను లారీ ఢీకొన్న ఘటనలో శీలం సత్యవతి (45) మృతి చెందింది. ఆమె భర్త శీలం రెడ్డియ్య తలకు తీవ్ర గాయమై విషమ పరిస్థితిలో ఉన్నాడు. నల్లజర్ల మండలం చోడవరానికి చెందిన భార్యాభర్తలు రెడ్డియ్య, సత్యవతి కుమారుడితో కలిసి కొయ్యలగూడెం మండలం సరిపల్లిలో …
Read More »కొడుకు మరణం తట్టుకోలేక కన్నతల్లి…
తల్లంటే కొడుకుకి ఎనలేని ప్రేమ.. కొడుకంటే తల్లికి పంచ ప్రాణాలు. అమ్మను వదిలి తనయుడు ఉండలేడు. కొడుకును చూడలేక తల్లి ఉండలేదు. చివరి శ్వాస వరకు ఆ తల్లికొడుకులు ఇలాగే ఉన్నారు. కుమారుడు బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించడంతో తల్లడిల్లిన ఆ తల్లి గుండె ఆగి పోయింది. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం జాడీ జమాల్‌పూర్‌కు చెందిన గాలి అన్సయ్య, శౌరమ్మ …
Read More »