స్త్రీలు ఎక్కడ గౌరవించడబడుతారో అక్కడ దేవతలు కొలువుంటారని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. ఆదివారం మియాపూర్‌లోని మారుతీ గర్ల్ చైల్డ్ అనాథాశ్రమంలో సినీనటి ప్రత్యూష వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలకిషన్, రాష్ట్ర సాంఘిక, సంక్షేమ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్‌లు హాజరై ప్రత్యూష చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం షీ …
Read More »జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం జగన్ ఘన నివాళి…!
అహింసా, సత్యాగ్రహాలే ఆయుధంగా అహింసామార్గంలో తెల్లవాడిని తరిమికొట్టి అఖండ భారతావనికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ప్రసాదించిన భారత జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి నేడు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తన నివాసంలో మహాత్ముని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి స్వాతంత్ర్యం అందించిన గొప్ప నాయకుడు మహాత్మాగాంధీ అని స్మరించుకున్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన బోధనలైన అహింస, సత్యాగ్రహం, సర్వోదయ కోసం పునరంకితమవుదామని సీఎం వైఎస్ …
Read More »రంగా వర్థంతి వేడుకలు.. రాధాపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!
బెజవాడలో స్వర్గీయ వంగవీ రంగా వర్థంతి వేడుకలను పార్టీలకతీతంగా నిర్వహిస్తున్నారు. పేదల పెన్నిధిగా గాంచిన నాయకుడు వంగవీటి రంగా 31వ వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. కాగా విజయవాడలో అన్ని వర్గాల ప్రజల మన్నలను పొంది..కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగిన వంగవీటి రంగా ఎన్టీఆర్ హయాంలో అర్థరాత్రి హత్యకు గురైన సంగతి తెలిసిందే. రంగా హత్యలో చంద్రబాబుకు, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావుకు భాగస్వామ్యం …
Read More »నేడు మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి…సీఎం జగన్ ఘన నివాళి…!
అణగారిన వర్గాలకు సమాన హక్కు ఉండాలంటూ పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త..మహాత్మా జ్యోతిబాపూలే అని ఏపీ సీఎం జగన్ కొనియాడారు. నేడు సామాజిక అసమానతలపై పోరాడిన గొప్ప సంఘసంస్కర్త, అట్టడుగు వర్గాల విద్య కోసం పాటుపడిన మహనీయుడు మహాత్మా జ్యోతిబాపూలే వర్థంతి సందర్భంగా ఏపీ సీఎం జగన్ విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పులే విగ్రహానికి వైఎస్ …
Read More »తెలంగాణ ధిక్కార స్వరం..ప్రజాకవి కాళోజీకి అక్షర నివాళి..!
పుట్టుక నీది..చావు నీది..బతుకంతా దేశానికే అంటూ తన యావత్ జీవితాన్ని తెలంగాణకే అంకితం చేసిన ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణరావు వర్థంతి నేడు. అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అని సగర్వంగా ప్రకటించి..ఉద్యమమే ఊపిరిగా కడదాకా జీవించిన ప్రజాకవి..కాళోజీ. జీవితాంతం తన రచనలలో తెలంగాణ గోసను చిత్రిస్తూ కోట్లాది ప్రజలలో స్వరాష్ట్ర కాంక్షను రగిలించిన అక్షర యోధుడు…కాళోజీ నారాయణ రావు. కాళోజీ ఓ వ్యక్తి కాదు..ఓ శక్తి…సాహితీ ప్రపంచంలో …
Read More »భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన నిప్పుకణిక..తెలంగాణ వీర వనిత…చాకలి ఐలమ్మ..!
నేడు పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన ధీరవనిత…చాకలి ఐలమ్మ వర్థంతి. భూస్వాముల పెత్తందారీ విధానానికి వ్యతిరేకంగా ఒంటరిగా యుద్ధమే చేసిన చాకలి ఐలమ్మ… 1919 వరంగల్ జిల్లా, రాయపర్తి మండలంలోని క్రిష్టాపురం గ్రామంలో జన్మించింది. చాకలి ఐలమ్మ అసలు పేరు చిట్యాల ఐలమ్మ. పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో వివాహం జరిగింది. ఈ దంపతులకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. ఒక …
Read More »ఘనంగా జయశంకర్ సార్ 8వ వర్ధంతి వేడుకలు
ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత, ఉద్యమ దిక్సూచి, సిద్దాంత కర్త స్వర్గీయ ప్రొ.జయశంకర్ సార్ 8వ వర్ధంతి సందర్భంగా ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ శాఖ అద్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జయశంకర్ సార్ చిత్ర పటానికి పూలమాల వేసి తెలంగాణ అమరవీరులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనంపాటించి ఘనంగా సభ్యులు అందరూ నివాళులర్పించారు. అనంతరం శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ …
Read More »