శతాబ్దాలపాటు సామాజిక, రాజకీయ, ఆర్థిక వివక్షను ఎదుర్కొన్న దళితులు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని, దళితబంధు పథకం చరిత్రాత్మకమని డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ అన్నారు. సీతాఫల్‌మండి బీదల్‌బస్తీ మైదానంలో 25 మంది దళితబంధు లబ్ధిదారులకు ఎలక్ట్రికల్ ఆటో, మినీట్రాలీలు, రవాణా వాహనాలు, కార్లను శుక్రవారం జిల్లా కలెక్టర్ శర్మన్, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్‌రెడ్డి, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పంపిణీ చేశారు. …
Read More »17 లక్షల కుటుంబాలకు దళితబంధు
తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు 17 లక్షల కుటుంబాలకు దళితబంధు పథకం అందుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కరీంనగర్లోని అంబేద్కర్ మైదానంలో 393 మంది దళితబంధు లబ్ధిదారులకు 202 వాహనాలను మంత్రి గంగుల కమలాకర్తో కలసి పంపిణీ చేశారు. రాష్ట్రంలోని ప్రతీ దళితుడు లక్షాధికారి కావాలన్న కేసీఆర్ సంకల్పానికి ఈ పథకం నిదర్శనమన్నారు.
Read More »ఇక నుండి దళితబంధు ఎంపిక వాళ్ల చేతుల్లోనే
సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళితబంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యే లకు అప్పగించనుంది. తొలి ఏడాది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి రూ.10 లక్షలు ఇవ్వనుండగా.. హుజురాబాద్ నియోజకవర్గం మినహా మిగతా చోట్ల ఈ పథకం త్వరలోనే అమలు చేయనుంది. …
Read More »దళితబంధుకు రూ.250 కోట్లు విడుదల
తెలంగాణ రాష్ట్రంలోని 4 మండలాల్లో దళితబంధును పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు ప్రభుత్వం రూ.250 కోట్లు విడుదల చేసింది. చింతకాని, తిరుమలగిరి, చారకొండ, నిజాంసాగర్ మండలాల్లో ఈ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించింది. చింతకాని మండలానికి రూ.100 కోట్లు, మిగతా 3 మండలాలకు రూ.50 కోట్ల చొప్పున ఇచ్చింది. ఇప్పటికే ఆయా మండలాల్లో దళిత బంధు ప్రాజెక్టుపై జిల్లా కలెక్టర్లు అవగాహన సదస్సులు నిర్వహించారు.
Read More »వాసాలమర్రిలోని దళిత కుటుంబాలకు అందిన దళితబంధు పథకం ఫలాలు
తెలంగాణ సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలోని దళిత కుటుంబాలకు దళితబంధు పథకం ఫలాలు అందాయి. బుధవారం పండుగ వాతావరణంలో యూనిట్ల పంపిణీని చేశారు. కూలీనాలీ చేసుకొంటూ జీవనం సాగించిన నిరుపేద దళిత కుటుంబాల వారు ఇప్పుడు ఓనర్లుగా మారి కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. వాసాలమర్రిలోని 76 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో గతంలోనే జమ చేశారు. తాజాగా వీరిలో ముగ్గురికి …
Read More »దళిత బంధు పై బీజేపీ కుట్ర – ఎమ్మెల్యే అరూరి
తెలంగాణ ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి తీసుకొచ్చిన పథకం దళిత బంధు పథకాన్ని బీజేపీ కుట్రలు చేసి ఆపిందని అన్నారు జమ్మికుంట రూరల్ ఇంచార్జి వర్ధనపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు బుధవారం జమ్మికుంట మండలంలోని మాచనపల్లి మరియు నాగంపేట దళిత కాలనిలో నిర్వహించిన దళిత ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే లు చిరుమర్తి లింగయ్య మరియు గాదరి కిషోర్ తో కలిసి పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడ్తు తెలంగాణ రాష్ట్ర …
Read More »హుజూరాబాద్ లో ఇప్పటివరకు 12,521 మందికి దళిత బంధు
దళిత బంధు పథకం కింద హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 12,521 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.9.90 లక్షల చొప్పున జమ చేశామని మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి కరీంనగర్ కలెక్టరేట్‌లో సీఎంవో కార్యదర్శి రాహుల్ బొజ్జా, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి మంత్రు లు అధికారులు, బ్యాంకర్లతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ …
Read More »దళితబంధు దేశానికే పాఠం
తెలంగాణ కోసం కదిలిననాడు నావెంట మీరంతా కదిలిండ్రు, రాష్ర్టాన్ని సాధించుకొనేదాకా నావెంట నడిచిండ్రు. నేను కొట్లాడితే నాకు సహకరించిండ్రు. ఏడేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమానికి అండగా నిలబడిండ్రు. దళితుల అభివృద్ధి కోసం అదే ఉద్యమస్ఫూర్తితో నేను చేస్తున్న పోరాటానికి కూడా సహకారం అందించండి. పట్టుబడితే సాధించలేనిది ఏమీ లేదు. పట్టుబట్టి తెలంగాణ సాధించుకున్నం. అదే పట్టుదలతో తెలంగాణ స్వరాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నం. దళితుల సమగ్రాభివృద్ధి …
Read More »ఏం నర్సయ్య బాగేనా.. సర్పంచ్‌కు సీఎం కేసీఆర్ ఆప్యాయ పలుకరింపు
ఏం నర్సయ్య బాగేనా.. పిల్లలు బాగున్నారా? అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ సర్పంచును ఆప్యాయంగా పలుకరించారు.కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని తీగలగుట్టపల్లి కేసీఆర్ భవన్‌లో గురువారం రాత్రి బసచేసిన సీఎంను శుక్రవారం ఉదయం పలువురు మంత్రులు, అధికారులు కలిశారు. ఇదేసమయంలో మొగ్దుంపూర్ సర్పంచు జక్కం నర్సయ్య కలిసేందుకు రాగా.. సీఎం ఆయన చేతులు పట్టుకుని ఆప్యాయంగా పలుకరించారు. నర్సయ్య బాగేనా.. పిల్లలు బాగున్నారా.. అంటూ కుటుంబసభ్యుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. …
Read More »మాజీ మంత్రి ఈటల కొత్త ఎత్తుగడ
హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు వస్తున్న ఆదరణతో బెంబేలెత్తిపోయిన ఈటల రాజేందర్ తాజాగా దళితులను రెచ్చగొట్టి సొమ్ము చేసుకొనేందుకు కుయుక్తులు పన్నుతున్నట్టు తేలిపోయింది. బీజేపీ జెండా, ఈటల బొమ్మ ఉంటుంది. కానీ వాహనం మాత్రం నీలిరంగులో ఉంటుంది. ఎక్కడా బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకుల ముఖాలు మచ్చుకు కూడా కనిపించవు. ఈ వాహనాలను బుధవారమే రంగంలోకి దింపారు. బుధవారం సాయంత్రం శంభునిపల్లి గ్రామానికి రంగుమార్చుకొన్న ప్రచార రథాలు చేరుకొన్నాయి. వాడవాడల్లో తిరుగుతూ.. దళితబంధు …
Read More »