ఒడిషాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాన్వాయ్పై గుడ్ల దాడి జరగటం సంచలనం సృష్టించింది. పూరీలో ఓ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి.. సీఎం నవీన్ హజరై తిరిగి వస్తుండగా.. ఆయన కాన్వాయ్ పై భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు గుడ్లతో దాడి చేశారు. ఓ ఉపాధ్యాయురాలిని దుండగులు కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన ఘటనపై.. బీజేవైఎం రాష్ట్రంలో నిరసనలు చేపట్టింది. ఈ క్రమంలోనే.. ముఖ్యమంత్రి కారుపై గుడ్లు విసిరారు.
Read More »కన్నకూతురిపై కన్నతండ్రే..!
ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం జరిగింది. కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డ తండ్రి ఆమెను గర్భవతిని చేశాడు. తాగుడుకు బానిసైన ఆ వ్యక్తికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 15 ఏళ్ల వయసున్న పెద్ద కుమార్తెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. 2 రోజుల క్రితం ఒంట్లో నలతగా ఉండటంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. టెస్టులు చేయగా బాలిక గర్భవతి అని తేలింది.
Read More »గుజరాత్‌లో పట్టుబడిన భారీగా మత్తుపదార్థాలు
గుజరాత్‌లోని ద్వారకా జిల్లాలో భారీగా మత్తుపదార్థాలు పట్టుబడ్డాయి. జిల్లాలోని మోర్బి సమీపంలో ఉన్న జింజుడాలో 120 కిలోల హెరాయిన్‌ను (heroin) గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ (ఏటీఎస్) స్వాధీనం చేసుకున్నది. వాటి విలువ సుమారు రూ.600 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల ముఠాకు చెందిన నలుగురిని అరెస్టు చేశామన్నారు.గత సెప్టెంబర్‌లో కచ్‌లోని ముంద్రా పోర్టులో మూడు వేల కిలోల మత్తు పదార్థాలను డీఆర్‌ఐ అధికారులు సీజ్ చేశారు. …
Read More »గాంధీ దవాఖానలో అగ్ని ప్రమాదం
సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా దవాఖాన నాలుగో అంతస్తులోని విద్యుత్ ప్యానెల్ బోర్డులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. మంటలను గమనించిన హాస్పిటల్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదంతో దవాఖానలోని పలు వార్డుల్లోకి పొగ వ్యాపించింది. దీంతో రోగులు శ్వాస తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్రమత్తమైన …
Read More »BJPకి షాక్ -ఎంపీ పదవికి బాబుల్ సుప్రియో రాజీనామా
బీజేపీ ఎంపీ పదవికి అధికారికంగా రాజీనామా సమర్పించడానికి బాబుల్ సుప్రియో మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలవనున్నారు.భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) లో చేరిన కేంద్ర మాజీమంత్రి బాబుల్ సుప్రియో అక్టోబర్ 19 న ఎంపీ పదవికి అధికారికంగా రాజీనామా చేయనున్నారు. ‘‘నేను అధికారికంగా ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి మంగళవారం ఉదయం 11 గంటలకు సమయం …
Read More »డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడిన నటుడు
తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన ‘సింగం’ సినిమాలో విలన్‌గా నటించిన నైజీరియన్ దేశస్థుడు, నటుడు చాక్విమ్మాల్విన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో భాగంగా బెంగుళూరు పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.8 లక్షల విలువ చేసే హ్యాష్ ఆయిల్సహా ఎండీఎంఓ వంటి మత్తుపదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో సినిమా అవకాశాలు రాకపోవడంతో అతడు డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. …
Read More »నల్గొండ జిల్లా పరిధిలో జాతీయ రహదారిపై 120 కిలోల గంజాయిని స్వాధీనం
గంజాయి అక్రమ రవాణాపై పటిష్ట నిఘా పెట్టడం ద్వారా నల్గొండ జిల్లా పరిధిలో జాతీయ రహదారిపై 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డిఐజి ఏ.వి. రంగనాధ్ తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టిన క్రమంలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో జిల్లా పరిధిలో ఉన్న జాతీయ రహదారి – 65పై నిరంతరాయంగా నిర్వహిస్తున్న వాహనాల తనిఖిలలో ఒక …
Read More »విచారణకు సజ్జనార్
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ‘దిశ’ కేసు నిందితుల ఎన్ కౌంటర్పై.. సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ VS సిర్పుర్కర్ కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. ఎన్ కౌంటర్ టైంలో సైబరాబాద్ కమిషనర్గా ఉన్న VC సజ్జనార్ను తొలిసారిగా కమిటీ విచారించనుంది. ఆయనకు సమన్లు జారీ చేసిన కమిషన్.. మంగళవారం లేదా బుధవారం విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక దిశ ఎన్ కౌంటర్పై NHRC నివేదికపై నేడు విచారణ జరగనుంది.
Read More »పోలీసు కమిషనర్ అంజనీకుమార్ కి బెదిరింపులు
హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌ను ఓ వ్యక్తి బెదిరించాడు. అసభ్య పదజాలంతో దూషించాడు. దీనిపై హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే.. రెండు రోజుల క్రితం సీపీ అంజనీకుమార్ పోలీసు కంట్రోల్ రూం సిబ్బందికి వాట్సాప్ ద్వారా రెండు మొబైల్ నంబర్లను షేర్ చేశారు. సదరు వ్యక్తి సమస్య ఏమిటో కనుక్కోవాలని సూచించారు. దీంతో.. కంట్రోల్ రూం విధుల్లో ఉన్న కానిస్టేబుల్ …
Read More »కామాంధుడు రాజు ఆత్మహత్యపై అతని అత్త ఏమన్నాదంటే..?
ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కామాంధుడు పల్లకొండ రాజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రాజు ఆత్మహత్యపై అతడి అత్త యాదమ్మ ఏబీఎన్‌తో మాట్లాడారు. తన కుమార్తె మౌనిక జీవితం నాశనం చేశాడని చెప్పారు. తన కూతురు జీవితంలో మన్నుబోయడమే కాక మరో చిన్నారి జీవితాన్ని కూడా నాశనం చేశాడని, అతడికి బతికే హక్కులేదని యాదమ్మ తెలిపారు. ఆత్మహత్య చేసుకుని మంచి పని చేశాడన్నారు. తన కుమార్తెకు వచ్చిన పరిస్థితి …
Read More »